Oppo Find X8 సిరీస్ భారత్‌లో విడుదల తేదీ ఖరారు.. ColorOS 15, ట్రిపుల్ 50MP కెమెరాలు సహా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో నుంచి త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. Find X8 సిరీస్ పేరుతో లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్‌లో Find X8 మరియు Find X8 ప్రో మోడళ్లు ఉన్నాయి. ఈ రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు భారత్‌లో ColorOS 15 తో అందుబాటులోకి రానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లకు సంబంధించిన కొన్ని వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్ ఇప్పటికే చైనాలో విడుదల అయింది. భారత్ మార్కెట్‌లో ఈ ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది.
ఒప్పో ప్రకటన ఆధారంగా ఫైండ్ X8 సిరీస్ (Oppo Find X8 series) భారత్ మార్కెట్‌లో నవంబర్ 21 వ తేదీన విడుదల కానుంది. ఇండోనేషియాలోని బాలిలో గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌ను ఉదయం 10.30 AM IST గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది. ఈ మేరకు ఒప్పో ఇండియా తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటన చేసింది. ఈ సిరీస్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

ఒప్పో ఫైండ్ X8 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఒప్పో ఫైండ్ X8 స్మార్ట్‌ఫోన్ (Oppo Find X8 Smartphone) 6.59 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 2160Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే ఒప్పో క్రిస్టల్ షీల్డ్, డాల్బీ విజన్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది.
ఆండ్రాయిడ్ 15 OS :
Oppo Find X8 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ G925 GPU మరియు గరిష్ఠంగా 16GB LPDDR5X ర్యామ్ మరియు 1TB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 తో పనిచేస్తుంది.
🌟 Star Grey
— OPPO India (@OPPOIndia) November 11, 2024
🖤 Space Black
Discover the premium design of the #OPPOFindX8.
Tune into the global launch: 10:30 IST, November 21st 🌏
Know more: https://t.co/MhVxV2srdL#OPPOFindX8Series #FindYourBiggerPicture #OPPOAIPhone pic.twitter.com/Po95mKTKwS
50MP + 50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 10 బిట్ HDR సపోర్టుతో 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరా, 50MP శాంసంగ్ S5KJN5 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ మరియు 3X జూమ్ మరియు 120X డిజిటల్ జూమ్ సామర్థ్యం కలిగిన 50MP సోనీ LYT-600 టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది.
5630mAh బ్యాటరీ :
ఒప్పో ఫైండ్ X8 స్మార్ట్‌ఫోన్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సోనీ IMX615 కెమెరాతో అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5630mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఒప్పో ఫైండ్ X8 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఒప్పో ఫైండ్ X8 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల మైక్రో కర్వడ్ LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
50MP+ 50MP + 50MP+ 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ (Oppo Find X8 Pro Smartphone) వెనుక వైపు నాలుగు కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ LYT 808 ప్రైమరీ కెమెరా, 50MP శాంసంగ్ S5KJN5 అల్ట్రా వైడ్ యాంగిల్, 50MP సోనీ LYT 600 టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంటుంది.

వీటితోపాటు 6x ఆప్టికల్ జూమ్ మరియు 120x డిజిటల్ జూమ్ సామర్థ్యంతో 50MP సోనీ IMX858 6x టెలిఫోటో లెన్స్‌తో అందుబాటులోకి వస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఒప్పో ఫైండ్ F8 ప్రో మోడల్ 32MP సోనీ IMX615 లెన్స్‌ను కలిగి ఉంటుంది. 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5910mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఒప్పో ఫైండ్ X8 ప్రో మోడల్ స్మార్ట్‌ఫోన్ IP68/69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉండనున్నాయి. మరియు డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటాయి. మరియు భద్రత కోసం ఇన్‌ఫ్రారెడ్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్ స్టోరేజీ వేరియంట్‌లు సహా ధర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








