Home
Mobile

200MP కెమెరా, 7500mAh భారీ బ్యాటరీతో OPPO స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!

ఒప్పో నుంచి OPPO Find X9 సిరీస్‌ విడుదల అయింది. ఇందులో భాగంగా ఒప్పో ఫైండ్‌ X9, ఒప్పో ఫైండ్‌ X9 ప్రో మోడల్స్‌ (OPPO Find X9 Series) అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ రెండు ఫోన్‌లు చైనాలోనే అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్‌లో ప్రో మోడల్ ఏకంగా 200MP కెమెరాను కలిగి ఉంది. రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 16 పైన పనిచేస్తాయి. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ పైన పనిచేస్తాయి. ఈ సిరీస్ పూర్తి వివరాలు.

ఒప్పో ఫైండ్‌ X9 సిరీస్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఒప్పో ఫైండ్ X9 స్మార్ట్‌ఫోన్ 6.59 అంగుళాల 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంది. అదే ప్రో మోడల్‌ 6.78 అంగుళాల 1.5K LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ రెండు ఫోన్‌లు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1800 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌ల డిస్‌ప్లేలు HDR Vivid, డాల్బీ విజన్, HDR10+, Always On Display ఫీచర్‌ను సపోర్టు చేస్తాయి.

OPPO Find X9 and Find X9 Pro launched in china

ఆండ్రాయిడ్ 16 OS :
ఒప్పో ఫైండ్‌ X9 సిరీస్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ పైన పనిచేస్తాయి. ఈ చిప్‌సెట్‌ 16GB ర్యామ్, 1TB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.

కెమెరా విభాగం పరంగా ఒప్పో ఫైండ్‌ X9 స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 50MP సోనీ LYT 828 ప్రైమరీ కెమెరా, 50MP సోనీ LYT 600 పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌, 50MP శాంసంగ్‌ JN5 అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

200MP కెమెరా :
ఒప్పో ఫైండ్‌ X9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 50MP సోనీ LYT 828 ప్రైమరీ కెమెరా, 3x డిజిటల్‌ జూమ్‌తో 200MP పెరిస్కోప్‌ టెలిఫోటో కెమెరా, 50MP శాంసంగ్‌ JN5 అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను అమర్చి ఉంటుంది.

OPPO Find X9 and Find X9 Pro launched in china

ఒప్పో ఫైండ్‌ X9 స్మార్ట్‌ఫోన్ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7025mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే ప్రో మోడల్ 80W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ సిరీస్‌ IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ప్రస్తుతం ఈ సిరీస్‌ చైనాలోనే విడుదల అయింది. భారత్‌లో నవంబర్‌ నెలలో లాంచ్‌ కానుందని అంచనా వేస్తు్న్నారు. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా నవంబర్‌ 18 వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు భారత్‌లో ఈ సిరీస్ విడుదలపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ధర వివరాలు :
చైనాలో ఒప్పో ఫైండ్‌ X9 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర CNY 4399 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.54,300) గా ఉంది. అదే ప్రో మోడల్‌ ప్రారంభ ధర CNY 5299 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.65,400) గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO Find X9 and Find X9 Pro launched with mediatek dimensity 9500 Chipset, specifications, features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X