50MP + 50MP + 50MP కెమెరాలు, వైర్‌లెస్, రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 7025mAh బ్యాటరీతో OPPO ఫోన్ విడుదల..!
OPPO Find X9 Smartphone : ఒప్పో ఫైండ్ X9 సిరీస్ భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా ఫైండ్ X9, ఫైండ్ X9 ప్రో ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్ కెమెరాలు Hasselblad భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. బేస్ వేరియంట్ వైర్‌లెస్, రివర్స్ ఛార్జింగ్ సపోర్టు ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
ఒప్పో ఫైండ్ X9 స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ ఫోన్ 6.59 అంగుళాల (1250 x 2760 పిక్సల్స్) అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 3600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 460 ppi పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ను పొందుతుంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్ 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 5 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని ఒప్పో హామీ ఇచ్చింది.
50MP + 50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా Hasselblad భాగస్వామ్యంతో కూడిన ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT-808 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్ మరియు OIS సపోర్టుతో 50MP సోనీ LYT-600 టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది.

సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సోనీ IMX615 కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా విభాగం లూమో ఇమేజింగ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 32052.5 Sq mm తో VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
వైర్‌లెస్, రివర్స్ ఛార్జింగ్ :
ఈ ఫోన్ 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7025mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంది. 50W AirVOOC వైర్‌లైస్ ఛార్జింగ్ సపోర్టు, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంది. భద్రత కోసం 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అమర్చారు.
కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై 7, బ్లూటూత్ 6.0, NFC, AI లింక్‌బూస్ట్, ఒప్పో RF చిప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. IP66, IP68, IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. SGS డ్రాప్ రెసిస్టెంట్‌గా ఉంది.

ఒప్పో ఫైండ్ X9 సిరీస్ ధర, సేల్ వివరాలు :
ఒప్పో ఫైండ్ X9 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.74999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.84999 గా ఉంది. స్పైస్ బ్లాక్, టైటానియం గ్రే కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. నవంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో ఇండియా స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








