OPPO Find X9 సిరీస్ : భారతీయ యూజర్ల సృజనాత్మకత, భవిష్యత్ అవసరాల కోసం తీసుకొచ్చిన ఫ్లాగ్‌షిప్ ఫోన్
భారతదేశంలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అంటే ఎలా ఉండాలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం OPPO సంస్థ చాటి చెబుతోంది.. శక్తివంతమైన పనితీరు, ప్రీమియం డిజైన్, ఎమోషన్స్, స్పష్టతను అందించే ఇమేజింగ్‌ను నేటి వినియోగదారులు కోరుకుంటున్నారనే డిమాండ్‌ను గుర్తించిన ఒప్పో.. భారతదేశాన్ని స్ఫూర్తిగా, బెంచ్‌మార్క్‌గా తీసుకొని రూపొందించిన సరికొత్త ఫ్లాగ్‌షిప్ లైనప్ OPPO Find X9 సిరీస్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 740 మిలియన్లు, భారతదేశంలో 100 మిలియన్లకు పైగా యూజర్లను కలిగి ఉన్న ఒప్పో.. ఇప్పుడు యువకులు తమ ఆలోచనలను, సృజనాత్మకతను వ్యక్తం చేసే విధానాన్ని రూపొందించే బ్రాండ్‌గా మారింది. వారి ఆలోచనలకు అనుగుణంగా Find X9 సిరీస్ భారతదేశ సంస్కృతి, అభిరుచి, డైనమిక్ డిజిటల్ జీవనశైలికి అనుగుణంగా రూపొందించింది. ఈ ప్రీమియం విజన్ మొబైల్ యువకుల మనసులను ఇట్టే గెలుచుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

భారతదేశ ప్రభావం - ఫ్లాగ్‌షిప్ వ్యూహం
భారత్‌లో ప్రతి యూజర్ అర్థవంతమైన ఆవిష్కరణలకు అర్హుడనే నమ్మకంతో ముందుకు సాగుతోంది. భారతదేశం ఒప్పోకి అతిపెద్ద మార్కెట్లలో ఒకటి మాత్రమే కాదని, క్రియేటివ్ ఉత్ప్రేరకం కూడా అని ఒప్పో ఇండియా పీఆర్ అండ్ కమ్యూనికేషన్స్ హెడ్ గోల్డీ పట్నాయక్ అన్నారు. డిజైన్, పనితీరు, ఇమేజింగ్‌లో అత్యుత్తమమైన మోడల్స్‌ను కోరుకొనే భారతీయ వినియోగదారులను ట్రెండ్‌సెట్టర్‌లుగా అభివర్ణించారు.
IDC డేటా ప్రకారం, 2025 మూడో త్రైమాసికంలో, ముంబై, బెంగళూరు, పూణే, చెన్నై, జైపూర్, కోల్‌కతా వంటి టెక్-ఫార్వర్డ్ నగరాల్లో పెరుగుతున్న ఆకాంక్షల కారణంగా ప్రీమియం, సూపర్ ప్రీమియం విభాగాల స్నార్ట్‌ఫోన్‌లు 40 శాతానికి పైగా వృద్ధి చెందాయి. వినియోగదారులు కాలక్రమేణా మెరుగైన బ్యాటరీ లైఫ్, అధునాతన శైలి, భవిష్యత్ సంసిద్ధ పనితీరు, ప్రో గ్రేడ్ స్థాయి కెమెరాలను అందించే పరికరాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
యూజర్ల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఫ్లాగ్‌షిప్ అనుభవాలను అందించాలనేది ఒప్పో వ్యూహం. పండుగ త్రైమాసికంలో 13.9% మార్కెట్ వాటాతో భారతదేశంలో బ్రాండ్‌ను నంబర్ 2 స్థానానికి చేర్చింది. ఈ ఊపు తాజాగామార్కెట్లోకి వచ్చిన Find X9 series Series కు వేదికను సిద్ధం చేస్తోంది. భారతీయ ఫ్లాగ్‌షిప్ వినియోగదారులు ఆశించే వాటిని మరింత పెంచుతుంది.
ఫైండ్ X9 సిరీస్ : ఫ్లాగ్‌షిఫ్ బెంచ్‌మార్క్
ఫైండ్ ఎక్స్ సిరీస్ ఎల్లప్పుడూ ఒప్పో అత్యంత వినూత్న వేదికగా నిలుస్తోంది.. ఈ ఫోన్ డిజైన్ ఖచ్చితత్వం, ఇమేజింగ్ సామర్థ్యాల కారణంగా భారతదేశంలో మంచి ప్రశంసలు పొందింది. Find X9 Series తో బ్రాండ్.. వినియోగదారుల అనుభూతి, ఆకట్టుకొనే ఇమేజింగ్, లైటింగ్, శక్తివంతమైన ఏఐ ఆధారిత పనితీరు, సొగసైన ఎర్గోనామిక్స్, ఆకట్టుకొనే బ్యాటరీ లైఫ్ పై ప్రధానంగా దృష్టిసారించింది.

హోలి రంగుల కాంతుల నుంచి పెళ్లి దుస్తుల ఎరుపు రంగుల వరకు, హై-కాంట్రాస్ట్ లైటింగ్ నుంచి దీపాల వెలుగులో జరిగే పండుగ వరకు సరిపడేలా ఈ ఫోన్ కెమెరాను ఆప్టిమైజ్ చేశారు. భారతీయుల రంగులమయమైన, భావోద్వేగభరితమైన జీవితాన్ని స్పష్టంగా క్యాప్చర్ చేసేలా ట్యూన్ చేశారు.
హాసెల్‌బ్లా్డ్ మాస్టర్ కెమెరా సిస్టమ్
భారతదేశంలో పలు అంశాల్లో ఫోటోగ్రఫీ కీలక పాత్ర పోషిస్తుంది. Find X9 Series ప్రొఫెషనల్ గ్రేడ్ ఇమేజింగ్ సామర్థ్యాలను అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ ప్రో వేరియంట్ 200MP హాసెల్‌బ్లాడ్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. దీనికి ఒప్పో అధునాతన ల్యూమో ఇమేజ్ ఇంజిన్ మద్దతు ఇస్తుంది. ఈ కలయిక కేవలం రిజల్యూషన్ కు మాత్రమే కాకుండా, ఆప్టిక్స్, కంప్యుటేషనల్ ఇంటెలిజెన్స్‌ను సామర్థ్యాలను కూడా కలిగి ఉంది.

పగటి వెలుగుతోపాటు రాత్రి సమయాల్లోనూ.. అత్యంత కచ్చితత్వం, డైనమిక్ ఆక్యూరసీ, క్లారిటీతో క్యాప్చర్ చేస్తుంది. లైటింగ్‌కు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటుంది. భారత్ యూజర్లకు అనుగుణంగా మెరుగైన స్కిన్ టోన్స్‌ను కలిగి ఉంది.
ఈ సిరీస్‌లో ఉన్న AI Unblur, AI portrait Glow, Reflection Remover వంటి ఇంటిగ్రేటెడ్ ఎడిటింగ్ టూల్స్‌ను కలిగి ఉంది. ఫలితంగా ఎటువంటి థర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్‌ల అవసరం ఉండదు.
భారతీయుల డిజిటల్ స్టైల్ ఆధారంగా పనితీరు
మొబైల్ వీడియో స్ట్రీమింగ్, డిజిటల్ చెల్లింపులు, గేమింగ్‌లో భారత్ ప్రపంచ దేశాల్లో టాప్‌లో ఉంది. Find X9 Series మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 3nm ఆర్కిటెక్చర్, OPPO ట్రినిటీ ఇంజిన్ పైన నిర్మాణం అయింది. రిసోర్స్ మేనేజ్‌మెంట్, గేమింగ్ సమయంలో స్థిరమైన ఫ్రేమ్ రేట్‌ను అందిస్తుంది. ఎక్కువ సమయంపాటు రికార్డింగ్ చేసినప్పుడు ఫోన్ వేడెక్కకుండా చూస్తుంది.
బ్యాటరీ కూడా ఈ సిరీస్‌కు ప్రధాన బలం. ఫైండ్ X9 ఫోన్ 7025mAh బ్యాటరీ, ప్రో మోడల్ 7500mAh బ్యాటరీని కలిగి ఉంది. రెండు రోజుల కంటే ఎక్కువ రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ 80W SUPERVOOC వైర్, 50W AIRVOOC వైర్‌లైస్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ 5 సంవత్సరాల తర్వాత కూడా 80 శాతం కంటే ఎక్కువగా.. బ్యాటరీ హెల్తీగా ఉంటుంది.

భారతీయ యూజర్లకు ఈ ఫోన్ పనితీరు.. విశ్వసనీయంగా, వేగంగా, అనుకూలంగా ఉంటుంది. స్మూత్ UI యానిమేషన్ నుంచి క్విక్ యాప్ స్విచ్చింగ్ వరకు ల్యాగ్ ఫ్రీ మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది.
సౌకర్యవంతమైన, ఆకట్టుకొనే డిజైన్
ఈ Find X9 సిరీస్ డిజైన్, సొగసైన ఆకృతి గుర్తింపును తీసుకొచ్చింది. OPPO తాజా ఫ్లోటింగ్ స్టాక్ ఆర్కిటెక్చర్.. కెమెరా అంతర్గత భాగాలను సమర్థవంతంగా పునర్య్వవస్థీకరిస్తుంది. సన్నగా, పట్టుకొనేందుకు సౌకర్యంగా ఉంటుంది. బ్యాటరీ కోసం సరిపడా ఖాళీ కూడా ఉంటుంది.
బోర్డర్‌లెస్ ఫ్లాట్ డిస్‌ప్లే విజువల్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. అదే సమయంలో గ్రిప్ స్టెబిలిటిని కలిగి ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్, ప్రొడక్టివిటీకి అనుకూలమైన సమతుల్యతను కలిగి ఉంది. హాసెల్‌బ్లేడ్ కళాత్మక సున్నితమైన, ప్రభావితమైన కెమెరా మాడ్యూల్ ఉంది. ప్రీమియం మోడల్‌గా ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ ను స్టైల్ స్టేట్‌మెంట్‌గా భావించే యూజర్లను ఆకట్టుకొనేలా టైటానియం చార్‌కోల్, సిల్క్ వైట్, స్పేస్ బ్లాక్, టైటానియం గ్రే వంటి కలర్ వేరియంట్స్ ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తోపాటు IP66/68/69 రేటింగ్‌ను కలిగి ఉంది. అన్ని వాతావరణాలకు అనుకూలంగా ఉంటుంది.
ColorOS 16 : ఇంటెలిజెంట్, సీమ్‌లెస్, పర్సనల్
ColorOS 16 అనేది OPPO యొక్క సాఫ్ట్‌వేర్ పనితీరును కొనసాగిస్తుంది. ఈ ఇంటర్‌ఫేస్ క్లీ్న్‌గా ఉంటుంది. ఆకట్టుకొనే విజువల్స్ ఉంటాయి. దీంతోపాటు ఎక్కువ సమయంపాటు వినియోగించినా.. ట్రినిటీ ఇంజిన్, లూమినస్ రెండరింగ్ ఇంజిన్, నేవిగేషన్... స్థిరంగా, సజావుగానే ఉంటుంది.

ఏఐ సామర్థ్యాలు రోజువారీ టాస్క్‌లను సజావుగా సాగేలా చూస్తాయి. AI Mind Space ఉపయోగించిన సృజనాత్మక ఆలోచనల కోసం సాయపడుతుంది. AI రైటర్ రాసేందుకు, AI రికార్డర్ ద్వారా ట్రాన్స్‌క్రిప్షన్ కోసం పనికొస్తుంది. O+ కనెక్ట్ వంటి ఫీచర్లు విండోస్, మ్యాక్ సిస్టమ్ లో క్రాస్ డివైస్ ఫీచర్ గా ఉంటుంది.
ప్రైవేట్ కంప్యూటింగ్ క్లౌడ్, మల్టీ లేయర్డ్ OPPO లాక్ ప్రొటెక్షన్.. వ్యక్తిగత డేటా, ఆన్ డివైస్ AI ఆపరేషన్‌ను సురక్షితంగా ఉండేలా చూస్తాయి.
భారతీయుల కోసం ప్రత్యేక వ్యూహం
భారత్‌లో OPPO విధానం ఎప్పుడూ కూడా సమగ్రంగా ఉంటుంది. ప్రతి ధర సెగ్మెంట్ లోనూ నాణ్యమైన, ఆలోచనాత్మక ఫీచర్లను కలిగి ఉంది. తొలిసారి స్మార్ట్‌ఫోన్ యూజర్లు నమ్మకమైన డిజైన్, మెరుగైన పనితీరును పొందుతారు. దీంతోపాటు ప్రీమియం యూజర్లు అత్యాధునిక ఇమేజింగ్, అధునాతన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను ఆస్వాదిస్తారు.
ఒప్పో డిజైన్ తత్వం : టెక్నాలజీ భావోద్వేగపరంగా సందర్భానికి అనుకూలంగా ఉండాలి. రోజువారీ టాస్క్‌లను పూర్తిచేయడం నుంచి అనేక టాస్క్‌ల కోసం ఒప్పో డివైజ్‌లు యూజర్‌కు అనుకూలంగా ఉంటాయి.
యువ భారతం భావ వ్యక్తీకరణకు సాధికారత కల్పించడం
OPPO బ్రాండ్ కథనం, మేక్ యువర్ మూవెంట్ ఆధారంగా యూవతతో మెరుగైన సంబంధాన్ని సూచిస్తుంది. కేవలం టెక్నాలజీ డిజైస్ గానే కాకుండా, స్వీయ వ్యక్తీకరణకు వీలు కల్పిస్తుంది. యంగ్ ఇండియా ప్రామాణికత, సృజనాత్మకత, భావోద్వేగాలను విలువైనవిగా భావిస్తుంది. వీరి జీవనశైలికి మద్దతు ఇచ్చేందుకు ఒప్పో కొత్త సిరీస్‌ను తీసుకొచ్చారు.

షార్ట్ వీడియో కంటెంట్, ఫోటోగ్రఫీ, గేమింగ్ సహా ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా భారత సృజనాత్మకత విస్తరిస్తూనే ఉండడంతో, OPPO ఈ అభిరుచులను అందించే వేదికగా నిలుస్తుంది.
ఫైండ్ X9 సిరీసే ఎందుకు
ఒప్పో ఫైండ్ సిరీస్ భారతీయ యూజర్ల రోజువారీ అవసరాలను తీరుస్తుంది.
* ప్రతి లైట్ కండిషన్‌లో మెరుగైన ఫోటోగ్రఫీ
* ప్రీమియం డిజైన్ సహా రోజువారీ సౌకర్యవంతంగా ఉండేలా నిర్మాణం
* అధిక వినియోగంలోనూ మెరుగైన పనితీరు
* ఎక్కువ సంవత్సరాల వినియోగం అనంతరం కూడా మెరుగైన బ్యాటరీ లైఫ్
* వ్యక్తిగత టాస్క్‌లకు అనుకూలంగా ప్రైవసీ, AI ఫీచర్లు
నేటి డిజిటల్ యుగానికి మాత్రమే కాకుండా, వినియోగదారుల రేపటి అవసరాలతోపాటు టెక్నాలజీ ఎలా వృద్ధి చెందుతుందో, యూజర్లు ఏం ఆశిస్తున్నారో తెలిపేలా రూపొందించిన హ్యాండ్‌సెట్.
భారత్ నుంచి ప్రేరణ పొందిన ఆవిష్కరణ
OPPO ఫైండ్ X9 సిరీస్ కేవలం టెక్నాలజీ అప్‌గ్రేడ్ మాత్రమే కాదు. భారత్ వృద్ధిని ప్రతిబింబిస్తుంది. దేశ సాంస్కృతిక వైభవాన్ని, అభివృద్ధి కాంక్ష, సాంకేతిక అనేక వ్యక్తిగత వ్యక్తీకరణకు రూపం అనే నమ్మకాన్ని పెంపొదిస్తుంది.
ఇమేజింగ్, పనితీరు, అద్భుతమైన హస్తకళ, సాఫ్ట్‌వేర్ ఇంటెలిజెన్స్‌తో ఫైండ్ X9 సిరీస్ భారతదేశ ఫ్లాగ్‌షిప్ భవిష్యత్ పట్ల OPPO సంస్థ నిబంధనను బలోపేతం చేస్తుంది. ప్రీమియం సెగ్మెంట్ రోడ్‌మ్యాప్‌ను బలోపేతం చేస్తూనే ఉంది. ఈ సిరీస్‌తో ఆవిష్కరణ, భావోద్వేగాలను పురోగమించే ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
క్రియేటర్లు, ట్రావెలర్‌లు, నిపుణులు సహా అనేక మందికి ఒప్పో ఫైండ్ X9 సిరీస్ ప్రతి క్షణం మెరుగైన అనుభూతి అందించేందుకు వీలు కల్పించే ఫ్లాగ్‌షిఫ్‌గా నిలుస్తుంది.
ఒప్పో ఫైండ్ X9 సిరీస్ ధర, ఆఫర్ల వివరాలు

ఒప్పో ఫైండ్ X9 ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.74999 గా ఉంది. అదే 16GB ర్యా్‌మ్, 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.84999 గా ఉంది. అదే ప్రో వేరియంట్ ధర 16GB ర్యా్మ్, 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.109999 గా ఉంది.
ఈ సిరీస్ సేల్ నవంబర్ 21 వ తేదీ నుంచి ప్రారంభం అయింది. ఒప్పో ఇండియా స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫైండ్ X9 ఫోన్ కోస హాసెల్‌బ్లేడ్ టెలికన్వర్టర్ కిట్‌ను రూ.29999 ధరకు కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








