200MP కెమెరా, 7500mAh బ్యాటరీతో OPPO స్మార్ట్‌ఫోన్.. ఎప్పుడు విడుదల కానుందంటే..?
ఒప్పో నుంచి భారత్ మార్కెట్ లో OPPO Find X9 సిరీస్ విడుదల కానుంది. ఇందులో భాగంగా ఒప్పో ఫైండ్ X9, ఫైండ్ X9 ప్రో మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. 7000mAh కంటే భారీ బ్యాటరీలతో లాంచ్ కానుంది. ఈ సిరీస్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
ఎప్పుడు విడుదల కానుంది? :
ఒప్పో ఫైండ్ X9 సిరీస్ భారత్ మార్కెట్‌లో నవంబర్ 18 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ ఫోన్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఒప్పో ఫైండ్ X9 ఫోన్ రూ.75000 ధర రేంజ్, ప్రో మోడల్ రూ.1,00,000 ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అయితే లాంచ్ అయ్యాక ప్రారంభ ఆఫర్‌లో భాగంగా డిస్కౌంట్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సిరీస్ బేస్ వేరియంట్ స్పేస్ బ్లాక్, టైటానియం గ్రే, వెల్‌వెట్ రెడ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. అదే ప్రో వేరియంట్ టైటానియం చార్‌కోల్, సిల్క్ వైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఒప్పో ఫైండ్ X9 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే HDR10+, HDR వివిడ్ సపోర్టు, డాల్బీ విజన్ సపోర్టును కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
A new chapter in ultra-clear imaging and smooth OS begins…
— OPPO India (@OPPOIndia) November 7, 2025
Experience the #OPPOFindX9Series launch and see the power of AI and Hasselblad come alive.
Click here to know more: https://t.co/RteSp59jUz#AIFlagshipCamera #HasselbladPocketCamera #OPPOColorOS16 pic.twitter.com/PbcSqayZrl
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ ను కలిగి ఉంటుంది. ఈ చిప్ 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది. ఇందులో 5 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
కెమెరా విభాగం పరంగా Hasselblad భాగస్వామ్యంతో ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 50MP సోనీ LYT-828, 50MP ISOCELL అల్ట్రావైడ్, 200MP టెలిఫోటో లెన్స్ (OIS) ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ 50MP కెమెరాతో లాంచ్ కానుంది.
ఈ ప్రో మోడల్ 80W SuperVOOC వైర్, 50W AirVOOC వైర్‌లెస్, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 7500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP66. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. SGS డ్రాప్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రో మోడల్ అడ్వాన్సడ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.
ఒప్పో ఫైండ్ X9 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఒప్పో ఫైండ్ X9 స్మార్ట్‌ఫోన్ 6.59 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 808 OIS కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP టెలిఫోటో సోనీ LYT 600 OIS కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సోనీ IMX615 కెమెరాను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 80W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 7025mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రో మోడల్ కలిగిన ఉండనున్న చిప్‌సెట్, OS, కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








