Home
Mobile

ఇవాళ్టి నుంచే 200MP కెమెరా, 7500mAh భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ సేల్‌..!

OPPO Find X9 Series Sale : ఒప్పో ఫైండ్‌ X9 సిరీస్‌ ఇటీవలే విడుదల అయింది. ఇందులో ఒప్పో ఫైండ్‌ X9, ఫైండ్‌ X9 ప్రో మోడల్‌ అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్‌లు మీడియాటెక్‌ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ప్రో మోడల్‌ 7500mAh బ్యాటరీను కలిగి ఉంది. Hasselblad భాగస్వామ్యంతో కెమెరాలను కలిగి ఉంది. ఈ సిరీస్‌ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.

ఒప్పో ఫైండ్‌ X9 ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.74999, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.84999 గా ఉంది. టైటానియం గ్రే, స్పేస్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. ప్రో మోడల్‌ 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.1,09,999 గా ఉంది.

OPPO Find X9 series sale

ప్రో మోడల్‌ ఫోన్ సిల్క్‌ వైట్‌, టైటానియం చార్‌కోల్‌ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇవాళ్టి నుంచే ఈ ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. ఒప్పో ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. SBI, HDFC, కోటక్‌ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

డిస్‌ప్లే :
ఒప్పో ఫైండ్‌ X9 స్మార్ట్‌ఫోన్ 6.59 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, ప్రో మోడల్‌ 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ల డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌ పొందుతోంది.

ప్రాసెసర్‌, OS :
ఈ సిరీస్‌ ఫోన్‌లు 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 5 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

కెమెరాలు :
ఈ సిరీస్‌ కెమెరాలు Hasselblad భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. ఫైండ్‌ X9 ఫోన్ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT 808 ప్రైమరీ కెమెరాను అమర్చారు. దీంతోపాటు 50MP అల్ట్రావైడ్‌ లెన్స్, OIS సపోర్టుతో 50MP సోనీ LYT 600 టెలిఫోటో లెన్స్‌ ను కలిగి ఉంది. 32MP సోనీ IMX615 సెల్ఫీ కెమెరా ఉంది.

ప్రో మోడల్‌ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT 828 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 50MP శాంసంగ్‌ ISOCELL 5KJN5 అల్ట్రావైడ్ యాంగిల్‌ లెన్స్‌, OIS సపోర్టుతో 200MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. 50MP శాంసంగ్‌ 5KJN5 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

బ్యాటరీ, ఛార్జింగ్‌ :
ఈ ఫోన్‌ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50W AirVOOC వైర్‌లైస్‌, 10W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7025mAh సిలికాన్ కార్బన్‌ బ్యాటరీ, ప్రో మోడల్‌ 7500mAh బ్యాటరీని కలిగి ఉంది. మెరుగైన థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం VC కూలింగ్‌ ఛాంబర్‌లు కూడా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
OPPO Find X9 series smartphones sale to start from today in india, here is the bank deals
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X