ఒప్పో ఫైండ్ X9 స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ వివరాలు..!
Oppo Find X9 Velvet Red Edition : ఒప్పో ఫైండ్ X9 సిరీస్ ఇటీవల భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‌లో భాగంగా ఫైండ్ X9, ఫైండ్ X9 ప్రో మోడల్స్ లాంచ్ అయ్యాయి. బేస్ వేరియంట్ టైటానియం గ్రే, స్పేస్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో విడుదల అయింది. తాజాగా వెల్‌వెట్ రెడ్ ఎడిషన్ అందుబాటులోకి వచ్చింది. గత ఫైండ్ సిరీస్ ఫోన్‌లతో పోలిస్తే.. కొత్త సిరీస్‌కు మంచి స్పందన వచ్చిందని వివో చెబుతోంది.
ధర, సేల్ వివరాలు :
ఒప్పో ఫైండ్ X9 స్మార్ట్‌ఫోన్ రెడ్ ఎడిషన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.74999 గా ఉంది. బ్యాంకు, ఎక్స్ఛేంజీ ఆఫర్లతో రూ.67,499 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త కలర్ వేరియంట్ డిసెంబర్ 8 వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది.

ప్రత్యేక ప్రయోజనాలు :
ఒప్పో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, భాగస్వామ్య రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై ఒప్పో ఎన్‌కో బడ్స్ 3 ప్రో+, ప్రీమియం ఫోన్ కేస్ ను పొందవచ్చు. దీంతోపాటు రూ.5198 విలువైన బ్లాక్ గోల్డ్ గిఫ్ట్ బాక్స్ ను కూడా పొందవచ్చు.
హార్ట్‌వేర్ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా 180 రోజుల వరకు రీఫ్లేస్‌మెంట్ పాలసీని అందిస్తోంది. మూడు నెలలపాటు గూగుల్ జెమిని ప్రో ను వినియోగించుకోవచ్చు. రూ.649 లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌పై రూ.2250 విలువైన ప్రయోజనాలను పొందవచ్చని చెబుతోంది. దీంతోపాటు 18 నెలల వరకు జెమిని ప్రో ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.
స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఒప్పో ఫైండ్ X9 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 7025mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ LYT-808 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఒప్పో A6x 5G స్మార్ట్‌ఫోన్ :
ఒప్పో నుంచి త్వరలో A6x 5G స్మార్ట్‌ఫోన్ విడుదల కానుందని తెలుస్తోంది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఒప్పో A6x 5G ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.12499, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంటుందని అంచనా వేశారు.
ఒప్పో A6x 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOs తో లాంచ్ చేసే అవకాశం ఉందని టిప్‌స్టర్ తెలిపారు.


Click it and Unblock the Notifications








