OPPO గ్రాండ్ ఫెస్టివ్ బొనాంజా : ఫ్లాగ్‌షిప్ నుంచి బడ్జెట్ ఫోన్‌ల వరకు.. సంవత్సరంలోనే అతిపెద్ద డీల్స్!
పండుగ సీజర్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రముఖ బ్రాండ్ OPPO కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఇంటిలో పండుగ వాతావరణం నెలకొనేలా అనేక స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్‌లు అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రీమియం ఫ్లాగ్‌పిష్ మోడల్స్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్స్ వరకు డిస్కౌంట్‌లను అందించనుంది. OPPO Grand Festive Bonanza లో భాగంగా ఆఫర్లు అందిస్తుంది.
ఈ సేల్‌లో భాగంగా డిస్కౌంట్ ధరలు, బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజీ ప్రయోజనాలను పొందవచ్చు. మరియు వారి స్మార్ట్‌ఫోన్‌లను అప్‌గ్రేడ్ చేసేందుకు ఇదే సరైన సమయం. ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లతోపాటు OPPO ఏకంగా రూ.10 లక్షల వరకు నగదు బహుమతులను కూడా ప్రకటించింది.

OPPO స్మార్ట్‌ఫోన్ ఫోన్ ఆఫర్లు
గ్రాండ్ ఫెస్టివ్ సీజన్‌లో భాగంగా, OPPO ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆప్షన్‌లను కూడా అందిస్తుంది. OPPO F31 సిరీస్, Reno14 సిరీస్ మోడల్స్‌ను గరిష్ఠంగా 8 నెలల వరకు జీరో డౌన్‌పేమెంట్ ఆప్షన్‌ను అందిస్తుంది. మరియు నో కాస్ట్ EMI, 10 శాతం ఎక్స్ఛేంజీ బోనస్‌ను కూడా పొందవచ్చు. ఆర్థికంగా ఇబ్బంది లేకుండా స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
ఈ ప్రయోజనాలకు అదనంగా OPPO A5 సిరీస్‌తోపాటు అన్ని స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌పై అనేక ప్రయోజనాలను అందిస్తుంది. డౌన్ పేమెంట్ ఆప్షన్లు, EMI ప్రయోజనాలు, 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆప్షన్‌లు కూడా ఉన్నాయి. ఫలితంగా OPPO స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై ఈ పండుగ సీజన్‌లో ఎక్కువ ఆదా చేయవచ్చు.
ఈ డీల్స్‌కు అదనంగా బ్యాంకు ఆఫర్లు కూడా ఉండనున్నాయి. పండుగ సీజన్ కోసం బ్యాంకులు సహా ఇతర ఆర్థిక సంస్థలతో భాగస్వా్‌మ్యం కుదుర్చుకుంది. ఈ జాబితాలో SBI, HDFC, కోటక్ మహీంద్రా, IDFC ఫస్ట్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బజాజ్ ఫైనాన్స్, TVS క్రెడిట్, HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి. వీటి ద్వారా EMI, Non EMI ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ పండుగ ఆఫర్లు ఒప్పో రిటైల్ స్టోర్‌ల ద్వారా పొందవచ్చు. మరియు OPPO e-store, Flipkart, Amazon ద్వారా కూడా పొందవచ్చు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 31, 2025 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
దీపావళి కోసం ప్రత్యేకంగా..
గ్రాండ్ ఫెస్టివ్ సేల్ ఆఫర్లతోపాటు OPPO ప్రత్యేకంగా 'My OPPO Exclusive Diwali Raffle' నిర్వహిస్తోంది. దీని ద్వారా పండుగ కొనుగోళ్లతో తమ జీవితాన్ని మార్చే బహుమతులను గెల్చుకొనే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 31 లోపు OPPO స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారు ఇందులో పాల్గొనవచ్చు.
* 10 మంది మెగా విన్నర్స్ : ప్రతి ఒక్కరికి రూ.10 లక్షల నగదు బహుమతి
* ప్రతిరోజు ఒక విజేత : లక్ష రూపాయల నగదు బహుమతి
* OPPO ప్రీమియం ఉత్పత్తులలో ఏదైనా : Find X8, Reno14, OPPO F31 Pro, OPPO Enco Buds3 ప్రో
* మూడు నెలల అదనపు వారంటీ
* ఎక్లూజివ్ రివార్డ్ పాయింట్లు
ఇలాంటి బహుమతులతో దీపావళి వేడుకలను OPPO మరింత చిరస్మరణీయంగా మారుస్తుంది.
OPPO మొబైల్ ఫోన్ దీపావళి సేల్
ఈ సేల్‌లో భాగంగా అనేక మెరుగైన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి.
OPP F31 Series - పండుగ సందర్భంగా ప్రత్యేక ధర రూ.20700

ఈ పండుగ సీజన్‌లో OPPO తన కొత్త F31 సిరీస్‌ను పరిచయం చేసింది. ఇందులో F31 Pro+, F31 Pro, F31 ఉన్నాయి. పండుగల ఉత్సాహం, స్ల్పాష్‌లను తట్టుకొనేలా రూపొందించబడింది. ఈ సిరీస్ మన్నికైన డిజైన్, మెరుగైన పనితీరు, పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది.
OPPO F31 Pro+ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3, F31 ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ పైన పనిచేస్తున్నాయి. మెరుగైన పనితీరు కోసం ఈ రెండు మోడల్స్ OPPO డ్యూయల్ స్మూత్‌నెస్ సిస్టమ్ తో ఆప్టిమైజ్ చేయబడ్డాయి. F31 Pro+ మోడల్ ఫెస్టివ్ పింగ్, జెమ్‌స్టోన్ బ్లూ, హిమాలయన్ వైట్ కలర్ వేరియంట్లో ఉంది. అదే Pro మోడల్ డెసర్ట్ గోల్డ్, స్పేస్ గ్రే కలర్ వేరియంట్స్, OPPO F31 5G స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, క్లౌడ్ గ్రీన్, బ్లూమ్ రెడ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఈ మోడల్స్ IP66, IP68, IP69 రేటింగ్స్, 360 డిగ్రీల ఆర్మర్ బాడీ, MIL STD 810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటి సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. 18 సాధారణ స్పీల్స్ నుంచి రక్షణ పొందుతుంది. 72 నెలల పాటు మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ మోడల్స్ వేపర్ ఛాంబర్‌లు, గ్రాఫైట్ లేయర్‌తో కూడిన అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. OPPO F31 Pro+ మోడల్ 5219mm sq సూపర్ కూల్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లు 80W SUPERVOOC TM ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ రివర్స్, బైపాస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. కెమెరా విభాగం పరంగా OPPO F31 Pro+ మరియు F31 Pro మోడల్స్ OIS తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమ్ సెన్సర్ 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అదే బేస్ వేరియంట్ 50MP కెమెరా, 2MP పొర్ట్రెయిట్ సెన్సర్, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
OPPO Reno14 - పండుగ సేల్ ప్రత్యేక ధర రూ.34999
OPPO Reno14 అల్ట్రిమేట్ AI కెమెరా ట్రావెల్ పాన్టర్‌గా ఉంటుంది. ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీ కోసం చూసే వారికి మంచి ఎంపిక అవుతుంది. 3.5x టెలిఫోటో లెన్స్, 60fps 4K HDR వీడియో రికార్డింగ్ మెరుగైన అనుభూతిని అందిస్తుంది. అండర్‌వాటర్ ఫోటోగ్రఫీ మోడ్ మరింత ఆకట్టుకుంటుంది. దీంతోపాటు AI Editor 2.0, AI Perfect Face, AI Recompose, AI Best Face, AI Unblur, AI Eraser మరియు Reflection Remover వంటి అనేక ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ అత్యంత ఆకట్టుకొనే విధంగా క్యాప్చర్ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది.

Reno14 ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, గొరిల్లా గ్లాస్ 7i, ఆర్మర్ బాడీ, IP66, IP68, IP69 ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్ 7.42mm థిక్‌నెస్, 187 గ్రాముల బరువుంది. ఈ మోడల్ ఫారెస్ట్ గ్రీన్, పెర్ల్ వైట్, మింట్ గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. AI HyperBoost 2.0, AI LinkBoost 3.0 ఫీచర్లను కలిగి ఉంది.
80W SUPERVOOC TM ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 5 సంవత్సరాల వరకు మెరుగైన పనితీరును అందిస్తుంది. GenAI ఇంటిగ్రేషన్‌తో కూడిన ColorOS 15 కారణంగా AI VoiceScribe, AI Mind Space, Circle to Search, AI Toolbox 2.0 ఫీచర్లను కలిగి ఉంది. OPPO Reno14 సిరీస్ ఫోన్ కంటే ఎక్కువగా మీకు ఉపయోగపడుతుంది.
OPP A5 సిరీస్ - పండుగ సీజన్ ప్రత్యేక ధర రూ.8,999
ఈ సిరీస్ మన్నిక, విశ్వసనీయత, రోజువారీ అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ధరలో ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. ఈ సిరీస్ IP65, IP66, IP68, IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్, స్పాంజ్ బయోనిక్ కుషనింగ్, 360 డిగ్రీల ఆర్మర్ బాడీ, రీన్‌ఫోర్స్డ్ అల్లాయ్ ఫ్రేమ్‌లను కలిగి ఉంది. ఈ సెగ్మెంట్‌లో ధృడమైన మోడల్‌గా ఉంది.

ఈ సిరీస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. 5 సంవత్సరాల వరకు మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అల్ట్రా బ్రైట్ డిస్‌ప్లే కచ్చితంగా ఆకట్టుకుంటుంది. దీంతోపాటు డ్యూయల్ వ్యూ వీడియో, AI Eraser 2.0, Reflection Remover, స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0 వైబ్రంట్ కంటెంట్ క్రియేట్ చేసేందుకు అనుకూలిస్తాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 : OPPO ప్రత్యేకమైన డీల్స్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ భాగంగా OPPO K13 5G, K13x 5G, K13 Turbo, K13 Turbo Pro సహా ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. OPPO PAD SE మరియు OPPO Enco Buds 3 పై డీల్స్‌ను పొందవచ్చు. సెప్టెంబర్ 22 వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు అందుబాటులో ఉంటాయి.
OPPO K13 Series
పండుగ సీజన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ప్రత్యేకమైన డీల్స్‌తో OPPO K13 మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. మన్నిక, మెరుగైన పనితీరు. స్టైల్ తో ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. మరియు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుంది.

OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్ మిస్ట్ వైట్ కలర్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్, బ్రీజ్ బ్లూ కలర్ వేరియంట్ అనేక మందిని ఆకట్టుకుంది. రీన్‌పోర్డ్స్ SGS గోల్డ్ డ్రాప్ సర్టిఫికేషన్, MIL STD 810H టఫ్‌నెస్, ఏరోస్పేస్ గ్రేడ్ AM04, క్రిస్టల్ షీల్డ్ గ్లాస్, స్పాంజ్ షాక్ అబ్జార్ప్షన్ సిస్టమ్, IP65 రేటింగ్‌తో సాటిలేని మన్నికను అందిస్తుంది. ధృడమైన నిర్మాణంతోపాటు 120Hz HD+ డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీ, AI ఆధారిత కెమెరాలను కలిగి ఉంది.
OPPO K13 5G స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్, 80W SUPERVOOC TM ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీ, వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. మల్టీ టాస్కింగ్, గేమింగ్ సమయాల్లో అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు K13 టర్బో, K13 టర్బో మోడల్స్ దేశంలోనే తొలి బిల్ట్ ఇన్ కూలింగ్ ఫ్యాన్ కలిగిన మోడల్స్‌గా గుర్తింపును పొందాయి. 7000mAh బ్యాటరీతో ఇ-స్పోర్ట్స్ గ్రేడ్ పనితీరును అందిస్తుంది.
No Cost EMI ఆప్షన్‌తో కేవలం రూ.9999 నుంచి అందుబాటులోకి వచ్చే OPPO K13 Series ఈ సీజన్‌లో ఆకట్టుకొనే డీల్‌గా ఉంటుంది.
ఒప్పో ప్యాడ్ SE, ఒప్పో ఎన్‌కో బడ్స్ 2 ప్రో

K13 సిరీస్‌తోపాటు ఈ పండుగ సీజన్‌లో OPPO Pad SE, OPPO Enco Buds 3 Pro పై బెస్ట్ డీల్స్‌ను పొందవచ్చు. Pad SE 11 అంగుళాల ఐ కేర్ డిస్‌ప్లే, 9340mAh బ్యాటరీ, 33W SUPERVOOC TM ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. క్వాడ్ Hi-Res స్పీకర్లు, AI ఆధారిత టూల్స్, గూగుల్ జెమిని ఫీచర్‌లను కలిగి ఉంది. ధర రూ.9900 గా ఉంటుంది. వీటితోపాటు ఎన్‌కో బడ్స్ 3 ప్రో ఇయర్‌బడ్స్ 54 గంటల ప్లేబ్యాక్ టైంను అందిస్తుంది. 12.4mm డ్రైవర్స్, 47ms అల్ట్రా Low Latency, IP55 రేటింగ్‌ను కలిగి ఉంది. పండుగ ఆఫర్ ధర రూ.1499 గా ఉంది.
ఒప్పో ఆఫర్‌లతో దీపావళి పండుగ
స్మార్ట్ డివైజ్‌ల నుంచి ప్రీమియం ఫోన్‌ల వరకు డిస్కౌంట్లతో పండుగ సీజన్‌ను మరింత ప్రత్యేకంగా మారుస్తోంది. ఆకట్టుకొనే ధరల నుంచి ప్రత్యేకమైన బహుమతుల వరకు.. OPPO రాజీ లేని అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తుంది. ఒప్పో హామీతో కొనుగోలుదారులు విలువైన డీల్స్‌ను ఆస్వాదించవచ్చు. ఫ్లాగ్‌షిప్ మోడల్‌కు అప్‌గ్రేడ్ కావడం, బడ్జెట్ రేంజ్ ఆప్షన్‌లను ఎంపిక చేసుకోవడం సహా అన్నింటా మెరుగైన డీల్స్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








