Home
Mobile

భారత్ మార్కెట్‌లోకి రెనో 15 సిరీస్‌.. కీలక వివరాలు వెల్లడించిన OPPO..!

OPPO Reno 15 series : భారత్‌ మార్కెట్లో ఒప్పో రెనో 15 సిరీస్‌ లాంచ్‌ కానుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే తాజా ఒప్పో దీనిపై స్పందించింది. రెనో 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల వివరాలను ధ్రువీకరించింది. భారత్‌లో త్వరలో ఈ సిరీస్‌ ను లాంచ్ చేస్తామని X పోస్ట్‌ ద్వారా వెల్లడించింది.

ఎప్పుడు విడుదల కానుంది? :
అయితే భారత్‌లో ఎప్పుడు విడుదల కానుందనే వివరాలను కచ్చితంగా వెల్లడించలేదు. అయితే జనవరి 2026 లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సిరీస్‌ లో భాగంగా ఒప్పో రెనో 15, ఒప్పో రెనో 15 ప్రో మోడల్స్‌ విడుదల కానున్నాయి. అయితే రెనో 15 ప్రో మిని మోడల్‌ విడుదలపై ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.

OPPO india confirmed reno 15 series launch in india here are the full details

ఈ మిని మోడల్‌ ఫోన్‌ ఈనెలలో చైనాలో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. అయితే భారత్ లో ఈ మోడల్‌ విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది. భారత్‌లో ఇటీవల కాలంలో అనేక ఫోన్‌ల ధరలు పెరుగుతున్నాయి. ఒప్పో కూడా రెనో 14, 14 ప్రో మోడల్స్‌ ధరలు పెంచింది.

ఎంత ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది :
భారత్ మార్కెట్‌ లో ఒప్పో 15 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.45000 గా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చైనాలో ఈ సిరీస్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అక్కడ ప్రారంభ ధర CNY 2999 (భారత కరెన్సీ ప్రకారం రూ.37,450) గా ఉంది.

చైనాలో ఈ సిరీస్ ఇప్పటికే విడుదల అయింది. ఇందులో భాగంగా ఒప్పో రెనో 15, ఒప్పో రెనో 15 ప్రో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్‌లు మీడియాటెక్‌ డైమెన్సిటీ 8450 చిప్‌ ను కలిగి ఉన్నాయి. ఈ చిప్‌ 16GB LPDDR5x ర్యామ్‌, 1TB UFS 3.1 స్టోరేజీ సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది.

చైనాలో ఇటీవలే విడుదల :
చైనా మార్కెట్‌ లో ఒప్పో రెనో 15 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.32 అంగుళాల ఫ్లాట్ అమోలెడ్‌ (2640 x 1216 పిక్సల్స్‌) ను కలిగి ఉంది. అదే ప్రో మోడల్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల (2772 x 1272 పిక్సల్స్‌) డిస్‌ప్లేను కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా రెండు ఫోన్‌లు 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ మరియు 3.5x జూమ్‌తో 50MP పెరిస్కోప్‌ లెన్స్‌, 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉన్నాయి. అయితే ప్రో మోడల్‌ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ సపోర్టును కలిగి ఉంది.

బ్యాటరీ పరంగా బేస్‌ వేరియంట్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6200mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే ప్రో వేరియంట్ 80W వైర్ ఛార్జింగ్ సపోర్టు, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO india confirmed reno 15 series launch in india here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X