స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని శాసిస్తోన్న ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లు

సరిగ్గా అరచేతిలో ఇమిడిపోతున్న స్మార్ట్‌ఫోన్‌లు రానురాను హై-ఎండ్ పోర్టబుల్ కెమెరా డివైస్‌లుగా మారిపోతున్నాయి. ఫోటోగ్రాఫర్లు సైతం భారీ కెమెరాలను పట్టి స్మార్ట్‌ఫోన్‌లతో స్టన్నింగ్ షాట్‌లు చిత్రీకరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగంలో ఇంతగా మార్పులు రావటానికి ప్రధానమైన కారణం ఒప్పో (OPPO). అద్బుతమైన కెమెరా సెంట్రిక్ ఫోన్‌లను రూపొందించటంలో ఈ చైనా ఫోన్‌ల కంపెనీ అపారమైనన అనుభవాన్ని కలిగి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్రంట్ కెమెరా విభాగంలో విప్లవాత్మక మార్పులు...

సెల్ఫీ ఎక్స్‌పీరియన్స్‌ను తరువాతి లెవల్‌కు తీసుకువెళ్తూ ఒప్పో పరిచయం చేసిన ‘Beautify mode' సెల్ఫీ ఫోటో ట్రెండ్‌నే మార్చేసిందనే చెప్పాలి. ఈ కెమెరా లోపలి ఫీచర్‌ను OPPO U701 ఫోన్ ద్వారా కంపెనీ పరిచయం చేసింది. బిల్ట్ ఇన్ బ్యూటిఫై మోడ్‌తో లాంచ్ అయిన ఈ ఫోన్ ద్వారా యూజర్లు హైక్వాలిటీ సెల్ఫీలను చిత్రీకరించుకునే వెసలుబాటును ఒప్పో కల్పించింది.

Beautify మోడ్ ప్రధాన ఆకర్షణ..

ఒప్పో ఆఫర్ చేస్తున్న అన్ని ఫోన్‌లలో బిల్ట్‌ఇన్ Beautify మోడ్ ప్రధాన ఆకర్షణగా ఉంది. ప్రస్తుతం అందుబాటులోన్న ఉన్న ఒప్పో లేటెస్ట్ ఫోన్ లలో Beautify 4.0 వర్షన్ అందుబాటులో ఉంది.

అడ్వాన్సుడ్ ప్రాసెసింగ్ అల్గారిథమ్స్..

Beautify 4.0 వర్షన్‌లో అడ్వాన్సుడ్ ప్రాసెసింగ్ అల్గారిథమ్స్ అలానే 7 లెవల్స్‌తో కూడిన ఇంటెలిజెంట్ బ్యూటిఫికేషన్ వ్యవస్ధను పొందుపరిచారు. ఈ ప్రత్యేకమైన ఫీచర్ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే పరిమితమవ్వటం విశేషం.

ఇండస్ట్రీ ఫస్ట్ 80 డిగ్రీ గోల్డెన్ యాంగిల్ ఫీచర్‌

2012లో ఒప్పో, ఇండస్ట్రీ ఫస్ట్ 80 డిగ్రీ గోల్డెన్ యాంగిల్ ఫీచర్‌ను ఫ్రంట్ కెమెరాలో పరిచయం చేసింది. ఈ ఫీచర్‌కు అడ్వాన్సుడ్ వర్షన్‌గా సెల్ఫీ పానోరమా ఫీచర్‌ను ఒప్పో పరిచయం చేసింది. గ్రూప్ సెల్ఫీ‌లు క్యాప్చుర్ చేసుకునేందుకు ఈ ఫీచర్ చక్కటి ఆప్షన్.

206 డిగ్రీ రోటేటింగ్ కెమెరా...

2013లో ఒప్పో మరో విప్లవాత్మక ఆవిష్కరణతో ముందుకొచ్చింది. ఫోన్ వెనుక కెమెరా విభాగాన్ని కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ ప్రపంచపు మొట్టమొదటి 206 డిగ్రీ రోటేటింగ్ కెమెరాను OPPO N1 ఫోన్ ద్వారా ఇండస్ట్రీకి పరిచంయ చేసింది. 13 మెగా పిక్సల్ రిసల్యూషన్ వచ్చే ఈ కెమెరాతో రెగ్యులర్ ఫోటోలతో పాటు సెల్ఫీ షాట్ లను కూడా క్యాప్చుర్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ రొటేటింగ్ కెమెరాలో నిక్షిప్తం చేసిన ప్రత్యేకమైన CMOS సెన్సార్, ప్రత్యేకమైన Fujitsu ఐపీఎస్ ఇమేజింగ్ చిప్‌తో పాటు 6-పీస్ లెన్స్ డిజైన్‌ను కలిగి ఎఫెక్టివ్ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తుంది. ఈ రొటేటింగ్ కెమెరా ద్వారా చిత్రీకరించే ఫ్రంట్ ఇంకా బ్యాక్ షాట్స్‌కు డ్యుయల్ మోడ్ ఫ్లాష్ లైటింగ్ సదుపాయాన్ని కూడా ఒప్పో కల్పించింది. ఆ తరువాతి సంవత్సరం లాంచ్ అయిన OPPO N3 ఫోన్ ద్వారా మరింత ఆధునిక కెమెరా టెక్నాలజీ ప్రపంచానికి పరిచయమయ్యింది.

‘Ultra HD' మోడ్‌..

2014లో ఒప్పో పరిచయం చేసిన OPPO Find 7 స్మార్ట్‌ఫోన్‌, క్లాస్ లీడింగ్ కెమెరా టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని మరింత సొగసరిగా మార్చింది. ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, ఒప్పో పరిచయం చేసిన ‘Ultra HD' మోడ్‌ ద్వారా 50 మెగా పిక్సల్ హై రిసల్యూషన్‌ సాధ్యమైంది. OPPO Find 7 ఫోన్ కెమెరాలో నిక్షిప్తం చేసిన సిక్స్ ఎలిమెంట్ లెన్స్, డెడికేటెడ్ ఇమేజ్ ప్రాసెసింగ్, హెచ్‌డీఆర్ మోడ్ వంటి అంశాలు స్టార్మ్‌ఫోన్ ఫోటోగ్రఫీని ఎక్స్‌పీరియన్స్‌ను కొత్త కోణంలో ఆవిష్కరింపజేసాయి.

‘Screen Flash' టెక్నాలజీ...

ఒప్పో స్మార్ట్‌ఫోన్ యూజర్లు తక్కువ వెళుతురు కండీషన్స్ గురించి ఏ మాత్రం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్‌లకు సంబంధించి వెనుక భాగాల్లో ఏర్పాటు చేసే ప్రకాశవంతమైన ఎల్ఈడి ఫ్లాష్‌లైట్స్ ఒక ప్లస్ పాయింట్ అయితే, 2015లో OPPO R7 లైనప్‌తో పరిచయమైన ‘Screen Flash' టెక్నాలజీ మరోప్లస్ పాయింట్. ఈ స్ర్కీన్ ఫ్లాష్ ఆఫర్ చేసే లైట్‌తో సెల్ఫీలను మరింత ప్రకాశవతంగా క్యాప్చుర్ చేసుకోవచ్చు. వెళుతురు తక్కువుగా ఉన్న వాతావరణంలో సైతం బెస్ట్ క్వాలిటీ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు..

5ఎక్స్ డ్యుయల్ కెమెరా ఆప్టికల్ జూమ్

స్మార్ట్‌ఫోన్ కెమెరా టెక్నాలజీ విభాగంలో ఒప్పో తాజాగా చేపట్టిన ఆవిష్కరణ ‘5ఎక్స్ డ్యుయల్ కెమెరా ఆప్టికల్ జూమ్'. ఈ టెక్నాలజీని తొలత 2017 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒప్పో ప్రదర్శించింది. ఈ డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్‌లో వైడ్ - యాంగిల్ లెన్స్‌తో జత చేసిన టెలీఫోటో లెన్స్ లాస్‌లెస్ 5ఎక్స్ డిజిటల్ జూమ్ ను ఆఫర్ చేస్తుంది.

OPPO F3 Plus

సెల్ఫీ సెంట్రిక్ స్మా‌ర్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఒప్పో లాంచ్ చేసిన ఎఫ్1 సిరీస్ మరో మైలు రాయిగా నిలిచింది. ఈ సిరీస్ నుంచి తాజాగా లాంచ్ అయిన OPPO F1s ఫోన్, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో సెల్ఫీ ప్రియులను మరింతగా ఆకట్టుకుంటోంది. ఈ కెమెరాలోని f/2.0 అపెర్చ్యుర్ లైటింగ్‌తో సంబంధం లేకుండా ఫోటోలను ఆఫర్ చేస్తుంది. Beautify 4.0 మోడ్ ఈ కెమెరాను మరింత మోడ్రన్‌గా తీర్చిదిద్దింది. ‘Selfie Expert'గా అవతరించే క్రమంలో ఒప్పో మరో విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. OPPO F3 Plus పేరుతో మార్చి 23 లాంచ్ కాబోతున్న ఈ ఫోన్ ఏకంగా డ్యుయల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉండటం విశే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OPPO is leading the smartphone photography with its cutting edge camera technology. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot