భారీ తగ్గింపు ధరతో ఫ్లిప్‌కార్ట్ లో Oppo K1 స్మార్ట్‌ఫోన్‌

|

ఒప్పో K1 స్మార్ట్‌ఫోన్‌ యొక్క ధరను ఇండియాలో ఇప్పుడు భారీగా తగ్గించింది. ఒప్పో ఫోన్ గత ఏడాది ఫిబ్రవరిలో ఇండియాలో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇది ఆస్ట్రల్ బ్లూ మరియు పియానో బ్లాక్ అనే రెండు కలర్ లలో లభిస్తున్నది.

ఇండియాలో ఒప్పో K1 ప్రస్తుత ధర
 

ఇండియాలో ఒప్పో K1 ప్రస్తుత ధర

ఇండియాలో ఒప్పో K1ను ఇప్పుడు రూ.13,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది మునుపటి ధరతో పోలిస్తే సుమారు రూ.3,000 ల తగ్గింపు పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో సింగిల్ వేరియంట్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ను రూ.16,990 ధర వద్ద లాంచ్ అయింది. దీనిని ఇప్పుడు కొత్త ధర వద్ద ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయడానికి అనుదుబాటులో ఉంది.

Dish SMRT Hub & Tata Sky Binge+ సెట్-టాప్-బాక్స్‌ల మధ్య తేడా...

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

ఒప్పో K1 స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి కలర్ ఓఎస్ 6 తో ఆండ్రాయిడ్ పై ఆధారంగా రన్ అవుతుంది. ఇందులో 19.5: 9 కారక నిష్పత్తితో గల 6.4-అంగుళాల ఫుల్-హెచ్‌డి + (1080x2340 పిక్సెల్స్) అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. బయోమెట్రిక్ యాక్సిస్ కోసం డిస్‌ప్లేలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ 4 ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 SoC యొక్క శక్తిని కలిగి ఉండి 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి ఉంటుంది. మెమొరిని (256GB వరకు) మరింత విస్తరించడానికి మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఇందులో ఉంది.

Realme 5i : క్వాడ్ కెమెరా సెటప్‌తో రిలీజ్... ధరకు సమానమైన ఆఫర్లు

కెమెరా సెటప్‌

కెమెరా సెటప్‌

ఆప్టిక్స్ విషయానికి వస్తే ఒప్పో K1 స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ కూడా ఉంది.

PF బ్యాలెన్స్ ను SMS ద్వారా తెలుసుకోవడం ఎలా?

కనెక్టివిటీ
 

కనెక్టివిటీ

ఒప్పో K1 లోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో 4G VoLTE, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, మైక్రో-యుఎస్‌బి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఇందులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ 3,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Oppo K1 Smartphone Price Slashed:Price,Specifications,Availability and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X