స్టన్నింగ్ ఫీచర్లతో OPPO K1,రేపటి నుంచి ఫ్లిప్‌కార్ట్ లో ఎక్సక్లూజివ్
గత కొద్ది సంవత్సరాల నుంచి స్మార్ట్‌ఫోన్ల యుగం విపరీతంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.
గత కొద్ది సంవత్సరాల నుంచి స్మార్ట్‌ఫోన్ల యుగం విపరీతంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.అవి కమ్యూనికేషన్స్ కోసమే కాకుండా అన్ని అవసరాలకు ఉపయోగపడే విధంగా మినీ కంప్యూటర్ లా ఉండే వాటిని అందరూ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందులో భాగంగానే టాప్ కంపెనీలు కూడా వినియోగదారుల కనుగుణంగానే ఫీచర్లను అందిస్తూ సరికొత్తగా మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్లను తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా ఒప్పో కంపెనీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త టెక్నాలజీతో ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మార్కెట్లోకి OPPO K1 పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లోకి రిలీజ్ చేయబోతోంది.పియానో బ్లాక్ మరియు ఆస్ట్రల్ బ్లూ కలర్లలో రూ.16,990 ధరతో రేపటి నుంచి ఫ్లిప్‌కార్ట్ లో లభించనుంది.
ఫ్యూచరిస్టిక్ ఇన్ -స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
ఈ OPPO K1 స్మార్ట్‌ఫోన్‌కు ఇన్ -స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 6.41 అంగుళాల డిస్‌ప్లే అత్యుత్తమ గేమ్ ప్లేతో పాటు ఎడ్జ్ టు ఎడ్జ్ వీడియో ప్లేబ్యాక్ ఇంకా హైక్వాలిటీ మల్టీటాస్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ ఈ డివైస్‌కు మంచి లుక్‌ను తీసుకువచ్చింది.
25మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
రెండు రకాల డ్యూయెల్ కెమెరాలతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది .బ్యాక్ కెమెరా విషయానికొస్తే 16,2 మెగాపిక్సల్ కెమెరాలతో వినియోగదారులు మంచి ఫోటోలు తీసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు.సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 25మెగాపిక్సల్ తో మంచి క్వాలిటీ గల సెల్ఫీ ఫోటోలు తీసుకునేలా కల్పించారు.అలాగే Scene Detection ,3D Portrait, వంటి పవర్ ఫుల్ AI ఫీచర్స్ ఇందులో కలిపించారు.
అందమైన 3డి గ్రేడియంట్ డిజైన్
ఈ స్మార్ట్‌ఫోన్ 3డి గ్రేడియంట్ డిజైన్ తో వస్తుంది. OPPO K1 కు డిజైన్ చేసిన బ్యాక్ ప్యానెల్ కొంచెం చేతి కదలికతో అందంగా కాంతి ప్రతిబింబిస్తుంది.
డిస్‌ప్లే
6.41 ఇంచ్ డిస్‌ప్లేతో పాటు 1080p screen ఈ ఫోన్ కి ప్రత్యేక ఆకర్షణ. 2280x1,080 pixelsతో యూజర్లకు మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.
సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్
అలాగే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా ఇది మంచి పనితీరును కనపరుస్తోంది.octa-core Qualcomm Snapdragon 660 processor తో ఈఫోన్ రాబోతుంది. ఇది వేగవంతమైన పనితీరును అందిచబోతుంది.ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ తో లభ్యమవుతోంది.
ఈ OPPO K1 ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే 3600 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ను కలిగి ఉంటుంది.యల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 అదనపు ఆకర్షణలు.
OPPO K1 ఫీచర్లు
6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3600 ఎంఏహెచ్ బ్యాటరీ.



Click it and Unblock the Notifications








