Oppoనుంచి మ‌రో అద్భుత‌మైన స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌.. భార‌త్‌లో ఎప్పుడంటే!

|

చైనాకు చెందిన ప్ర‌ముఖ మొబైల్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ ఒప్పో స‌రికొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. Oppo K10 Vitality Edition పేరుతో, కొత్త హ్యాండ్‌సెట్ చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. దీంతో ఈ కొత్త వేరియంట్ ఈ ఏడాది ప్రారంభంలో ఈ కంపెనీ నుంచి ఆవిష్క‌రించిన Oppo K10 5G మరియు K10 Pro 5G ఫోన్‌ల స‌ర‌స‌న‌ ఈ ఫోన్ చేరింది. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ కు సంబంధించిన స్పెసిఫికేషన్‌లను ఒకసారి చూద్దాం.

 
 Oppo K10 Vitality Edition

ఫ్రెష్ డిజైన్‌, అత్య‌ధిక రిఫ్రెష్ రేటుతో వ‌స్తోంది:
Oppo K10 సిరీస్‌లో ఇదువ‌ర‌కు విడుద‌లైన వేరియంట్ల కంటే ఈ వేరియంట్ స‌రికొత్త ఫ్రెష్ డిజైన్‌తో వ‌స్తోంది. ఇది విభిన్న‌మైన ప్రైమ‌రీ కెమెరా మాడ్యూల్‌ని కలిగి ఉంది. ఇందులో మూడు ప్రధాన కెమెరాలు మరియు LED ఫ్లాష్ యూనిట్ ఉన్నాయి. ఈ డివైజ్‌కు ఫింగ‌ర్ ప్రింట్‌ సెన్సార్ ను కుడి వైపున పవర్ బటన్ కింద అందిస్తున్నారు. కుడి వైపు వాల్యూమ్ రాకర్ కూడా ఉంటుంది.

 

ఈ మొబైల్ కు 6.59 అంగుళాల full-HD + HD+ IPS LCD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే అత్య‌ధికంగా 120Hz రిఫ్రెష్ రేటును క‌లిగి ఉంది. ట‌చ్ సాంప్లింగ్ రేటు వ‌చ్చేసి 120Hz గా ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ColorOS 12.1 ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ octa-core Qualcomm Snapdragon 778G ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది.

ఈ మొబైల్ 12GB RAM| 256GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఇక కెమెరాల విష‌యానికొస్తే.. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 64 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. మ‌రో రెండింటిలో 8 మెగాపిక్సెల్‌తో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌, 2 మెగా పిక్సెల్ క్వాలిటీలో మాక్రో లెన్స్ ఇస్తున్నారు. 4కే క్వాలిటీ వీడియోస్ స‌పోర్ట్ చేస్తుంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు.

 Oppo K10 Vitality Edition

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 30W ఫాస్ట్‌ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, కొత్త Oppo K10 వేరియంట్ డ్యూయల్-సిమ్ స్లాట్‌లు, 5G ​​సపోర్ట్, Wi-Fi, బ్లూటూత్ 5.2, A-GPS, NFC, USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ సాకెట్‌ను క‌లిగి ఉంది.

Oppo K10 Vitality Edition ధ‌ర‌లు:
ఈ కొత్త వేరియంట్ Oppo K10 Vitality Edition ధ‌ర విష‌యానికి వ‌స్తే.. 12GB RAM| 256GB స్టోరేజీ కెపాసిటీ మొబైల్ ధ‌ర చైనా మార్కెట్లో 2,199 యువాన్లు (భార‌త్‌లో దాదాపు రూ.26వేలు అంచ‌నా) ఉంటుంది. ఇది బ్లాక్ అండ్ బ్లూ క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉంటుంది.

 Oppo K10 Vitality Edition

ఈ కొత్త వేరియంట్ భార‌త్‌లో అందుబాటులోకి వ‌స్తుందా:
Oppo చైనా కాకుండా బ‌య‌టి దేశాల్లో Oppo K10 వైటాలిటీ ఎడిషన్‌ను ఎప్పుడు లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుందో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, కంపెనీ గతంలో Oppo K10 యొక్క 4G వేరియంట్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. కాబట్టి K10 యొక్క వైటాలిటీ ఎడిషన్ కూడా సమీప భవిష్యత్తులో 5G విభాగంలో భార‌త్‌లో లాంచ్ చేసే అవకాశాలు ఉన్న‌ట్లు అంతా భావిస్తున్నారు. భార‌త్‌లో ప్ర‌స్తుతం ఈ మోడ‌ల్ 4G వేరియంట్ ధ‌ర రూ. 14,990 కు అందుబాటులో ఉంది.

భారత్‌లో ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న Oppo K10 4G మోడ‌ల్ స్పెసిఫికేష‌న్ల‌ను కూడా ఓ లుక్కేద్దాం:
ఈ మొబైల్ కు 6.59 అంగుళాల full-HD + (1080 x 2412 pixels) HD+ IPS LCD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే అత్య‌ధికంగా 90Hz రిఫ్రెష్ రేటును క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ColorOS 11.1 ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ Qualcomm SM6225 Snapdragon 680 4G (6 nm)ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది.

ఈ మొబైల్ 6GB, 8GB RAM| 128GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఇక కెమెరాల విష‌యానికొస్తే.. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. మ‌రో రెండింటిలో 2 మెగాపిక్సెల్‌తో మాక్రో లెన్స్‌, 2 మెగా పిక్సెల్ క్వాలిటీలో డెప్త్ లెన్స్ ఇస్తున్నారు. 4కే క్వాలిటీ వీడియోస్ స‌పోర్ట్ చేస్తుంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు.

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, Oppo K10 వేరియంట్ డ్యూయల్-సిమ్ స్లాట్‌లు, 4జీ ​​సపోర్ట్, Wi-Fi, బ్లూటూత్ 5.0, A-GPS,USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ సాకెట్‌ను క‌లిగి ఉంది.

Best Mobiles in India

English summary
Oppo K10 Vitality Edition With 120Hz Screen, Snapdragon 778G Launched; Coming To India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X