6400mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6.7 FHD+ డిస్‌ప్లే ఒప్పో ఫోన్ విడుదల.. ధర, సేల్ వివరాలు..!
ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ ఇవాళ విడుదల అయింది. ఒప్పో K12 ప్లస్ పేరుతో (Oppo K12 Plus Smartphone) లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 6400mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్ సపోర్టుతో పనిచేస్తుంది. దీంతోపాటు IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌తో విడుదల అయింది. మరియు 50MP ప్రైమరీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. IR సహా వైఫై 6 వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది.
ఒప్పో K12 ప్లస్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఒప్పో K12 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ (1080*2412 పిక్సల్స్) అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP54 రేటింగ్‌తో కూడిన డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14 (అవుట్ ఆఫ్ ది బాక్స్) ను కలిగి ఉంది. మరియు స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్ 8GB LPDDR4X ర్యామ్, 512GB స్టోరేజీతో జతచేయబడి ఉంటుంది. మూడు స్టోరేజీ వేరియంట్‌లో ఈ హ్యాండ్‌సెట్ విడుదల అయింది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
కెమెరా విభాగం పరంగా వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP IMX355 అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఒప్పో K12 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 16MP కెమెరాను అమర్చారు. 80W సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్టుతో 6400mAh బ్యాటరీని కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.3, వైఫై 6, GPS, NFC కనెక్టివిటీ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, యాక్సెలిరోమీటర్ మరియు ఈ కంపాస్ వంటి ఫీచర్‌లను కూడా కలిగి ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్‌ప్రారెడ్ ట్రాన్సిమిట్టర్ (IR) ను కూడా కలిగి ఉంది.
ఒప్పో K12 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధర సేల్ వివరాలు :
ఒప్పో K12 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ప్రారంభ ధర CNY 1899 (భారత కరెన్సీ ప్రకారం రూ.22600) అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర CNY 2099 (భారత్ కరెన్సీలో సుమారుగా రూ.25,000), అదే 12GB + 512GB స్టోరేజీ ధర CNY 2499 భారత్ కరెన్సీ ప్రకారం రూ.29800) గా ఉంది.
అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం చైనాలో విడుదల అయింది. అక్టోబర్ 15 నుంచి సేల్ ప్రారంభం (Oppo K12 Plus Smartphone Sale Date) కానుంది. అయితే భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ హ్యాండ్‌సెట్ విడుదల కానుందా లేదా అనే వివరాలను ఒప్పో వెల్లడించలేదు. చైనాలో రెండు కలర్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








