Home
Mobile

OPPO K13 5G సంచలనం.. మొదటి రోజే రికార్డ్ సేల్స్.. మళ్లీ మే 1న అమ్మకాలు షురూ!

OPPO K13 5G first sale : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఒప్పో (OPPO) నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది. అదే ఒప్పో K13 5G. రూ.20,000 లోపు ధరలో వచ్చిన ఈ ఫోన్, విడుదలైన మొదటి రోజే తన సత్తా చాటింది. ఆ ధరల విభాగంలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా రికార్డు సృష్టించింది. 2025, ఏప్రిల్ 25న ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్, రిటైల్ షాపుల్లో దీని అమ్మకాలు మొదలయ్యాయి. అయితే, కొద్ది గంటల్లోనే స్టాక్ మొత్తం అయిపోవడం విశేషం.

మంచి ఫీచర్లతో, తక్కువ ధరలో ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారు ఎంతగా ఆసక్తి చూపించారో దీన్నిబట్టి అర్థమవుతుంది. స్టాక్ అయిపోవడంతో నిరాశ చెందిన వారి కోసం, ఒప్పో సంస్థ మళ్లీ 2025, మే 1న అమ్మకాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

OPPO K13 5G Sets Record Highest Day One Sales in India

* ఒప్పో K13 5Gకి అదిరిపోయే రెస్పాన్స్..
ఒప్పో ప్రకారం, మొదటి సేల్‌లోనే K13 5Gకి ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. కొనుగోలుదారుల నుంచి భారీ ఆసక్తి ఉండటంతో స్టాక్స్ చాలా వేగంగా అయిపోయాయని ఫ్లిప్‌కార్ట్ కూడా తెలిపింది. ఈ అద్భుత స్పందన పట్ల ఒప్పో అధికారులు, సావియో డిసౌజా, అన్షుమన్ భట్, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

* ఒప్పో K13 5G ధర, వేరియంట్లు ఇవే..
శక్తివంతమైన పనితీరు, ఎక్కువ సేపు నిలిచే బ్యాటరీ, మంచి ఫీచర్లను తక్కువ ధరకే కోరుకునే వినియోగదారుల మనసును K13 5G గెలుచుకుందని ఒప్పో అధికారులు అభిప్రాయపడ్డారు. ఒప్పో K13 5G రెండు రంగులలో లభిస్తుంది. అవి ప్రిజం బ్లాక్ (Prism Black), ఐసీ పర్పుల్ (Icy Purple).

స్టోరేజ్ పరంగా రెండు ఆప్షన్లు ఉన్నాయి. 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999. ఈ ధరలకు 8GB RAM లభించడం వినియోగదారులకు మంచి విలువైతే అందిస్తుంది. OPPO k13 5G స్మా్ర్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్‌ చేయండి.

* ఒప్పో K13 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లే ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అంటే, వీడియోలు, గేమ్స్ చాలా స్మూత్‌గా, మంచి రంగులతో అద్భుతంగా ఉంటాయి. దీని గరిష్ట బ్రైట్‌నెస్ 1200 నిట్స్ వరకు ఉంటుంది.

* కెమెరాలు, ప్రాసెసర్, పర్ఫార్మెన్స్
వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా 50MP కాగా, దీనికి తోడుగా 2MP సెకండరీ సెన్సార్ ఉంది. సెల్ఫీల కోసం ముందువైపు 16MP కెమెరా ఇచ్చారు. ఇది మంచి క్లియర్ ఫోటోలు తీస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 (Qualcomm Snapdragon 6 Gen 4) చిప్‌సెట్‌ను ఉపయోగించారు.

గ్రాఫిక్స్ కోసం అడ్రినో 810 GPU ఉంది. దీనికి 8GB LPDDR4X RAM, 256GB వరకు UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ జోడించారు. దీనివల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. యాప్స్, ఫోటోలు స్టోర్ చేసుకోవడానికి బోలెడంత స్థలం ఉంటుంది.

* బ్యాటరీ, ఛార్జింగ్
ఈ ఫోన్‌లోని అతి పెద్ద ఆకర్షణ దీని భారీ 7,000mAh బ్యాటరీ. ఎక్కువసేపు ఫోన్ వాడేవారికి ఇది సూపర్బ్. అంతేకాదు, 80W సూపర్ వూక్ (SuperVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే, ఛార్జింగ్ కూడా చాలా వేగంగా ఎక్కుతుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్‌ఓఎస్ 15 (ColorOS 15)తో వస్తుంది. కొత్త లుక్, సులభమైన వాడకంతో ఆకట్టుకుంటుంది.

* ఇతర ఫీచర్లు
స్క్రీన్‌లోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, స్టీరియో స్పీకర్లు, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ (రిమోట్‌గా వాడుకోవచ్చు), బ్లూటూత్ 5.3, దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం IP65 రేటింగ్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.

గమనిక : గిజ్‌బాట్ వెబ్‌సైట్‌లోని అఫిలియేట్ లింక్స్‌ ద్వారా చేసిన కొనుగోళ్ల నుంచి కమీషన్‌ను సంపాదిస్తుంది. ఉత్పత్తులకు సంబంధించిన అసలైన అభిప్రాయాలు, వ్యక్తిగత అనుభవం ఆధారంగా సిఫార్సు చేయబడతాయి. అది కూడా మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO K13 5G Sets Record Highest Day One Sales in India Budget Segment Sold Out Fast Next Sale May 1
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X