7000mAh బ్యాటరీతో OPPO 5G స్మార్ట్‌ఫోన్.. రూ.20,000 ధరలోనే.. పూర్తి స్పెసిఫికేషన్‌లు..!
ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో భారీ బ్యాటరీలు కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు ఇటీవల లాంచ్ అవుతున్నాయి. ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ తొలిసారిగా 7300mAh బ్యాటరీతో విడుదల అయింది. తాజాగా వివో T4 5G ఫోన్ కూడా 7300mAh బ్యాటరీతో లాంచ్ వివరాలను వెల్లడించింది. వన్‌ప్లస్ కూడా భారీ బ్యాటరీతో హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేయనుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో (OPPO India) కూడా భారీ బ్యాటరీతో ఫోన్ చేయనుంది.
ఎప్పుడు విడుదల కానుంది :
ఒప్పో నుంచి త్వరలో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 21 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు (OPPO K13 5G Launch Date) విడుదల కానుంది. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు 80W ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ రూ.20,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

కలర్ వేరియంట్స్ :
ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ తొలుత భారత్ మార్కెట్‌లో విడుదల కానుంది. అనంతరం గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. భారత్‌లో ఈ భారీ బ్యాటరీ ఒప్పో హ్యాండ్‌సెట్ ఐసీ పర్పుల్, ప్రిజమ్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ ద్వారా కీలక వివరాలు విడుదల :
ఈ ఒప్పో హ్యాండ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. మరియు ఇందుకు సంబంధించిన మైక్రోసైట్‌ను కూడా ప్రారంభించింది. దీని ఆధారంగా ఈ ఒప్పో K13 5G హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు వెల్లడయ్యాయి.

ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ 6.66 అంగుళాల ఫుల్ HD+ (1080*2400 పిక్సల్స్) అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 100 శాతం DCI P3 కలర్ gamut వంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.
No heat, no lag, no limits. The #OPPOK13 is here to change the way you game—powered by Snapdragon 6 Gen4 , 7000mAh battery and a cooling system so advanced, you’ll forget what frame drops feel like.
— OPPO India (@OPPOIndia) April 14, 2025
#LiveUnstoppable #OPphone
Know more: https://t.co/O13McKcGgn pic.twitter.com/5XUbfkAHL2
ఈ ఒప్పో హ్యాండ్‌సెట్ 4nm స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు గ్రాఫిక్స్ టాస్క్‌ల కోసం LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ చిప్‌సెట్ 7,90,000 AnTuTu స్కోర్‌ను కలిగి ఉందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Color OS 15 తో పనిచేస్తుంది. ఒప్పో AI ట్రినిటీ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 6000 mm sq గ్రాఫైట్ షీట్, 5700 mm sq వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇతర కెమెరాల వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్టంగా 49.4 గంటల వరకు కాలింగ్ టైం ను పొందవచ్చని ఒప్పో చెబుతోంది. కేవలం 30 నిమిషాల్లో 0-60 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చు.
బ్యాటరీతోపాటు ఇతర ఫీచర్‌ల పరంగానూ ఒప్పో ఫోన్ ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








