Home
Mobile

రూ.17999 కే.. 7000mAh భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 4 చిప్‌సెట్‌, 50MP కెమెరాతో OPPO 5G స్మార్ట్‌ఫోన్‌

భారత్‌ మార్కెట్‌లో భారీ బ్యాటరీ ఫోన్‌లు వరుసగా లాంచ్ అవుతున్నాయి. ఇటీవల ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌ ఏకంగా 7300mAh బ్యాటరీతో లాంచ్‌ అయింది. సేల్‌ కూడా ప్రారంభం అయింది. రేపు వివో T4 5G స్మార్ట్‌ఫోన్ కూడా 7300mAh బ్యాటరీతో లాంచ్‌ కానుంది. అయితే ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో 7000mAh బ్యాటరీతో భారత్‌ మార్కెట్‌లో ఇవాళ ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్‌ను (OPPO K13 5G Smartphone Launched) విడుదల చేసింది.

ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ బ్యాటరీతో బడ్జెట్‌ రేంజ్‌ లో అందుబాటులోకి వచ్చింది. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను ఈ ఫోన్‌ సపోర్టు చేస్తుంది. డిజైన్‌ పరంగాను ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది.

OPPO K13 5G Smartphone launched telugu news

ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ ప్యానల్‌ ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. మరియు ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల (1080*2400 పిక్సల్స్‌) అమోలెడ్‌ ఫ్లాట్‌ డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 92.2 శాతం స్క్రీన్‌ టూ బాడీ రేషియో ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ డిస్‌ప్లే మరో సూపర్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. వెట్‌ హ్యాండ్‌ టచ్‌, గ్లౌజ్‌ మోడ్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులు మరియు గ్లౌజ్‌ తోనూ ఈ ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. IP65 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఒప్పో ఫోన్‌ 4nm స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 4 చిప్‌సెట్‌, Adreno A810 GPU తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మల్టీ టాస్కింగ్‌ సమయంలోనూ మెరుగైన పనితీరు కనబరుస్తుందని ఒప్పో చెబుతోంది.

ఈ ఫోన్‌ మెరుగైన థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 6000mm Sq గ్రాఫైట్‌ షీట్‌ మరియు 5700mm Sq భారీ వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ColorOS 15 ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ 80W Supervooc ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు 62 శాతం ఛార్జింగ్‌ను కేవలం 30 నిమిషాల్లో చేయవచ్చని ఒప్పో చెబుతోంది. మరియు 100 శాతం ఛార్జింగ్‌ను 56 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు.

OPPO K13 5G Smartphone launched telugu news

కెమెరా విభాగం విషయానికి వస్తే వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.85 అపేచర్‌తో 50MP OV50D40 ప్రైమరీ కెమెరా, 2MP OV02B1B సెకండరీ కెమెరాలను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP సోనీ IMX480 కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

ఈ ఫోన్‌ గేమింగ్‌ కోసం ప్రత్యేకంగా వైఫై యాంటెనా, నెట్‌వర్క్‌ పెర్ఫామెన్స్‌ కోసం AI LinkBoost 2.0 టెక్నాలజీను ఉపయోగిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ ఇలైట్ గేమింగ్‌ ఫీచర్లు, ఒప్పో AI ట్రినిటీ ఇంజిన్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్‌ AI Eraser 2.0, AI Reflection remover, AI Blur వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ 5G, బ్లూటూత్‌, వైఫై, IR రిమోట్‌ కంట్రోల్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్‌లున్నాయి. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు.

ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19999 గా ఉంది. ఈ ఫోన్‌ ఐసీ పర్పుల్‌, ప్రిజమ్‌ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.

భారీ బ్యాటరీ ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 25 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఒప్పో ఈ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు 6 నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO K13 5G Smartphone launched with 7000mAh large battery and Snapdragon 6 gen 4 Chipset in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X