Home
Mobile

7000mAh భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 4 చిప్‌సెట్, 50MP కెమెరా OPPO 5G ఫోన్‌.. రేపే విడుదల..!

భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌లు వరుసగా విడుదల అవుతున్నాయి. ఇటీవల ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌ 7300mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. వివో, వన్‌ప్లస్‌ కూడా భారీ బ్యాటరీ ఫోన్‌లను లాంచ్ చేయనున్నాయి. మరో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్‌ (OPPO K13 5G Launch) రేపు భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుంది. 7000mAh బ్యాటరీతో భారత్‌లో అందుబాటులోకి రానుంది.

ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్‌ రేపు (ఏప్రిల్‌ 21) మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్‌లో విడుదల కానుంది. విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ రూ.20 వేల ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. భారత్‌లో విడుదల అనంతరం గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

OPPO K13 5G Smartphone launching on tomorrow

ఒప్పో భారీ బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్ కోసం ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. బ్యాటరీ, ఛార్జింగ్‌, చిప్‌సెట్‌ వివరాలను సంస్థ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ ఐసీ పర్పుల్‌, ప్రిజమ్‌ బ్లాక్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్‌ వివరాలు :
ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్‌ 6.66 అంగుళాల ఫుల్‌ HD+ (2400*1080 పిక్సల్స్‌) అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ ఆధారంగా ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 100 శాతం DCI P3 కలర్‌ gamut ను కలిగి ఉంటుంది. Low బ్లూ లైట్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది.

ఒప్పో వెల్లడించిన వివరాల ఆధారంగా K13 5G హ్యాండ్‌సెట్ 4nm స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 4 మొబైల్‌ ప్లాట్‌ఫాంపైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా LPDDR4X ర్యామ్‌, UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 7,90,000 AnTuTu స్కోర్‌ను కలిగి ఉందని తెలుస్తోంది.

ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Color OS 15 ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఒప్పో AI ట్రినిటీ ఇంజిన్‌తో మెరుగైన పనితీరును కనబరుస్తుంది. దీంతోపాటు థర్మల్‌ మేనేజ్‌మెంట్ కోసం 6000 mm sq గ్రాఫైట్ షీట్‌, 5700 mm sq వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌ను కలిగి ఉంటుంది.

కెమెరా విభాగం పరంగా 50MP అల్ట్రా క్లియర్‌ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. AI అన్‌బ్లర్‌, AI Clarity Enhancer, AI ఎరేజర్‌, AI రిఫ్లక్షన్‌ రిమూవర్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ AI రైటర్‌, AI Summary, స్క్రీన్‌ ట్రాన్స్‌లేటర్‌ వంటి AI ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ 80W Supervooc ఫ్లాష్‌ ఛార్జింగ్ సపోర్టు తో 7000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీ 5 సంవత్సరాల వరకు మెరుగైన పనితీరు కనబరుస్తుందని ఒప్పో చెబుతోంది. కేవలం 30 నిమిషాల్లో 62 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేస్తుందని చెబుతోంది. సింగిల్ ఛార్జింగ్‌తో 49.4 గంటల వరకు కాలింగ్‌ టైంను పొందవచ్చు.

ఈ ఫోన్‌ IP65 రేటింగ్‌ డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. మెరుగైన ఆడియో క్వాలిటీ కోసం డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. ఇంట్లోని ఇతర ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను కంట్రోల్‌ చేసేందుకు ఇన్‌ఫ్రారెడ్ రిమోట్‌ కంట్రోల్‌ను కూడా కలిగి ఉంటుంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO K13 5G Smartphone launching on tomorrow with 7000mAh battery Snapdragon 6 Gen 4 Chip in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X