Home
Mobile

బడ్జెట్‌ ధరలో 7000mAh భారీ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 OS, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌, ఏఐ ఫీచర్లతో 5G ఫోన్‌..!

OPPO K13 5G Smartphone : ఒప్పో నుంచి భారత్‌ మార్కెట్‌లో ఒప్పో K13 5G ఫోన్ ఈ సంవత్సరం తొలిభాగంలో లాంచ్‌ అయింది. ఈ ఫోన్ అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు డిజైన్‌ పరంగాను ఆకట్టుకొనే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ రూ.18 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి వివరాలు.

ధర వివరాలు :
ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఒప్పో ఇండియా ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.19,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు.

OPPO K13 5G Smartphone

డిస్‌ప్లే వివరాలు :
ఈ ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్‌ ఫ్లాట్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వెట్‌ హ్యాండ్‌ టచ్‌, గ్లౌజ్‌ మోడ్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులు, గ్లౌజ్‌ తోనూ ఈ ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు.

స్నాప్‌డ్రాగన్‌ చిప్‌, ఆండ్రాయిడ్ 15 :
ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 4 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ప్రాసెసర్‌ గరిష్ఠంగా 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. దీంతోపాటు Adreno A810 GPU కూడా అమర్చి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తోంది.

వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్ :
ఈ హ్యాండ్‌సెట్‌ మెరుగైన థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం 6000mm Sq గ్రాఫైట్‌ షీట్‌, 5700mm Sq భారీ వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది. మల్టీ టాస్కింగ్, గేమింగ్‌ సమయంలో ఈ ఫోన్ వేడెక్కకుండా ఉండేలా ఈ కూలింగ్‌ ఛాంబర్‌ పనిచేస్తుంది.

50MP కెమెరా, AI ఫీచర్లు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఒప్పో AI ట్రినిటీ ఇంజిన్‌, AI Blur, AI Eraser 2.0, AI Reflection remover వంటి ఫీచర్లు ఉన్నాయి.

7000mAh బ్యాటరీ :
ఒప్పో హ్యాండ్‌సెట్ 80W Supervooc ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఛార్జర్‌తో కేవలం 56 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయవచ్చని తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ ఇలైట్ గేమింగ్‌ ఫీచర్లు, గేమింగ్‌ కోసం ప్రత్యేకంగా Wi-Fi యాంటెనా ను అమర్చి ఉంది.

ఒప్పో K13 స్మార్ట్‌ఫోన్‌ AI LinkBoost 2.0 టెక్నాలజీని కలిగి ఉంది. నెట్‌వర్క్‌ మెరుగుపరుచుకొనేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. 5G, 4G, Wi-Fi, బ్లూటూత్‌, IR బ్లాస్టర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ ఐసీ పర్పుల్‌, ప్రిజమ్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
OPPO K13 5G Smartphone with 7000mAh battery, 50MP camera available on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X