7000mAh బ్యాటరీ. 6.7 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా OPPO 5G ఫోన్‌పై రూ.1000 డిస్కౌంట్..!
ఒప్పో సంస్థ ఇటీవల భారత్ మార్కె్ట్‌లో 7000mAh భారీ బ్యాటరీతో ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్‌ను (OPPO K1 3 5G Smartphone) విడుదల చేసింది. దీంతోపాటు ఈ ఫోన్‌ను ఎక్కువ రోజుల పాటు ఉపయోగించుకొనేలా అనేక ఫీచర్‌లున్నాయి. మరియు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 6.7 అంగుళాల డిస్‌ప్లేతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.
ధర, ఆఫర్ వివరాలు :
ప్రస్తుతం ఈ ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ లో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.19999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో డెబిట్, క్రెడిట్ కార్డులతో రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ ఐసీ పర్పుల్, ప్రిజమ్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో భారీ బ్యాటరీ, మెరుగైన ఫీచర్‌లను కలిగిన ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.
ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ ఫోన్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. 6.7 అంగుళాల అమోలెడ్ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080 x 2400 పిక్సల్స్, 120Hz రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 92.2 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో తో అందుబాటులో ఉంది.
చిప్‌సెట్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 4nm స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. దీంతోపాటు మల్టీ టాస్కింగ్ కోసం Adreno A810 GPU ను కూడా కలిగి ఉంది. ఈ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.
కూలింగ్ ఛాంబర్ :
ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 ను కలిగి ఉంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ సమయాల్లో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఈ హ్యాండ్‌సెట్ 6000mm Sq గ్రాఫైట్ షీట్, 5700mm Sq భారీ వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. ఒప్పో AI ట్రినిటీ ఇంజిన్‌ను కూడా కలిగి ఉంది.
AI ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ AI Eraser 2.0, AI Blur, AI Reflection remover వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. మరియు వైఫై యాంటెనా, AI LinkBoost 2.0 టెక్నాలజీ కలిగి ఉంది. దీంతో నెట్‌వర్క్ పనితీరును మెరుగుపరుస్తుంది.
కెమెరా వివరాలు :
ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP సోనీ IMX480 కెమెరాను కలిగి ఉంది. 80W Supervooc ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. 100 శాతం ఛార్జింగ్‌ను 56 నిమిషాల్లో పూర్తి చేస్తుందని ఒప్పో చెబుతోంది.
ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ ప్రూఫ్‌గా ఉంది. IR రిమోట్ కంట్రోల్, సెక్యూరిటీ కోం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చి ఉంది. ఈ డిస్‌ప్లే వెట్ హ్యాండ్ టచ్, గ్లౌజ్ మోడ్‌ను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులు, గ్లౌజ్ తోనూ ఈ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








