7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 6.7 అంగుళాల డిస్‌ప్లేతో OPPO 5G ఫోన్.. రేపటి నుంచే సేల్..!
ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ మూడు రోజుల క్రితం భారత్ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ బడ్జెట్ రేంజ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌లో మరో ప్రత్యేక ఉంది. ఈ ఫోన్ ఏకంగా 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ భారీ బ్యాటరీ కేవలం 56 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్ కానుంది. దీంతోపాటు ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ సేల్ రేపటి నుంచి (OPPO K13 5G Smartphone Sale) ప్రారంభం కానుంది.
ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.19,999 గా ఉంది. ఈ ఫోన్ సేల్ రేపు (ఏప్రిల్ 25) మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

తొలి సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు 6 నెలల పాటు నో కాస్ట్ EMI ప్రయోజనాలను ఉపయోగించుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఐసీ పర్పుల్, ప్రిజమ్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల అమోలెడ్ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 92.2 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియోతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ వెట్ హ్యాండ్ టచ్, గ్లౌజ్ మోడ్‌ను సపోర్టు చేస్తుంది.
ఈ ఫోన్ 80W Supervooc ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. కేవలం 56 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయవచ్చని ఒప్పో చెబుతోంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది.
ఒప్పో K13 5G హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 తో పనిచేస్తుంది. మరియు 4nm స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. దీంతోపాటు Adreno A810 GPU ను కూడా కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.
గేమింగ్ సహా మల్టీ టాస్కింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేలా ఈ ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ 6000mm Sq గ్రాఫైట్ షీట్, 5700mm Sq భారీ వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. గేమింగ్ కోసం ప్రత్యేకంగా WiFi యాంటెనా, నెట్‌వర్క్ పెర్ఫామెన్స్ కోసం AI LinkBoost 2.0 టెక్నాలజీను ఉపయోగిస్తున్నారు.
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ ఇలైట్ గేమింగ్ ఫీచర్లు, ఒప్పో AI ట్రినిటీ ఇంజిన్ తోపాటు AI Reflection remover, AI Eraser 2.0, AI Blur ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. బ్లూటూత్, వైఫై, IR రిమోట్ కంట్రోల్ వంటి ఫీచర్లున్నాయి. IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.


Click it and Unblock the Notifications








