OPPO K13 ఫస్ట్ ఇంప్రెషన్స్ : రూ.20,000 లోపు బెస్ట్ ఓవర్ పవర్డ్ ఆల్ రౌండ్ ఫోన్

OPPO K సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు మెరుగైన పనితీరు, బిల్ట్ క్వాలిటీ, అత్యుత్తమ నెట్‌వర్క్, మెరుగైన బ్యాటరీ లైఫ్ అందించడంలో ప్రసిద్ధి చెందాయి. ఎక్కువ రోజులపాటు మన్నిక, ఓవర్ పవర్డ్ స్మార్ట్‌ఫోన్ అనుభూతి కోసం ఎదురుచూసే వారికి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి. ఇవాళ విడుదల అయిన OPPO K13 5G స్మార్ట్‌ఫోన్.. ఒప్పో బ్రాండ్ వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలి కోసం అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది.
OPPO K13 స్మార్ట్‌ఫోన్ అత్యుత్తమ హార్డ్‌వేర్‌తోపాటు మెరుగైన సాఫ్ట్‌వేర్ ను కూడా కలిగి ఉంది. ఫలితంగా స్మూత్, మల్టీ టాస్కింగ్, ల్యాగ్ ఫ్రీ గేమ్ ప్లే, మెరుగైన నెట్‌వర్క్ కనెక్టివిటీ, బ్యాటరీ లైఫ్ తో అందుబాటులో ఉంది. మేము ఈ OPPO K13 5G స్మార్ట్‌ఫోన్‌ల టెస్ట్ చేశాము. దీనికి సంబంధించి అనేక వివరాలు ఉన్నాయి.

గేమింగ్ అనుభూతి
ఒప్పో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 6 సిరీస్, 4nm చిప్‌సెట్‌గా ఉంది. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తోపాటు Adreno A810 GPU, గరిష్ఠంగా 8GB ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఫలితంగా స్మూత్ మరియు మల్టీ టాస్కింగ్ అనుభూతిని అందిస్తుంది. OPPO K13 5G స్మార్ట్‌ఫోన్ 790k+ AnTuTu స్కోర్‌ను కలిగి ఉంది. గది ఉష్ణోగ్రత ఆధారంగా దీనిని నిర్ధారించారు. వీటితోపాటు స్నాప్‌డ్రాగన్ ఇలైట్ గేమింగ్ ఫీచర్ ద్వారా స్మూత్ విజువల్స్, అల్ట్రా రెస్పాన్సివ్ ఇన్‌పుట్, నో లేటెన్సీని అందిస్తుంది. స్థిరమైన పనితీరు కోసం AI ట్రినిటీ ఇంజిన్‌ను కూడా కలిగి ఉంది. 5 స్టార్ రేటింగ్‌తో కూడిన ఇంటెలిజెంట్ టెర్మినల్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఈ సిస్టమ్‌ను కలిగిన తొలి ఫోన్‌గా ఉంది. దీనిని TL సర్టిఫికేషన్ సెంటర్ జారీచేసింది. దీంతో ఎక్కువ కాలం పాటు మన్నిక అందిస్తుంది. ఈ చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ గేమ్ సూపర్ రిజల్యూషన్‌ను సపోర్టు చేస్తుంది 1080P నుంచి 4K విజువల్స్ కోసం ఇది పనిచేస్తుంది.

OPPO K13 5G స్మార్ట్‌ఫోన్‌ను మొబైల్ మరియు BGMI ను గరిష్ఠ సెట్టింగ్స్‌లో టెస్టింగ్ చేశాము. ఈ ఫోన్ ఏ గేమ్‌లో అయినా మెరుగైన పనితీరును అందిస్తుంది. ఫ్రేమ్ డ్రాప్స్, ల్యాగ్ లేకుండా పనిచేసింది. దీంతోపాటు ఈ ఫోన్ 6000 mm sq గ్రాఫైట్, 5700 mm sq వేపర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీని వల్ల లో లేటెన్సీ, ల్యాగ్ ఫ్రీ మరియు స్థిరమైన నెట్‌వర్క్ సాధ్యమైంది. గేమింగ్ సమయంలో ఈ కూలింగ్ సిస్టమ్ స్థిరమైన పనితీరును అందిస్తుంది.
OPPO K13 5G స్మార్ట్‌ఫోన్ హెవీ గేమింగ్ సమయంలో ఆకట్టుకొనే పనితీరును కనబరిచింది. స్థిరమైన ఫ్రేమ్ రేట్ మరియు మెరుగైన పవర్ ఎఫీషియన్సీ ని అందించింది. AI ఫీచర్‌లు కూడా ఇందుకు సాయం చేశాయి. ఎక్కువ సమయంపాటు గేమింగ్, ఛార్జింగ్ సమయాల్లో ఫోన్ కూల్ గా ఉంచడం సహా పనితీరుపై ఎలాంటి ప్రభావం లేకుండా చూసేందుకు AI అడాప్టివ్ టెంపరేచర్ ఫీచర్ మెరుగ్గా పనిచేస్తుంది.

సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో అన్‌స్టాపబుల్ బ్యాటరీ లైఫ్
ఎక్కువ సమయం గేమింగ్ కోసం ఫోన్‌ను వినియోగిస్తే.. బ్యాటరీ త్వరగా డిశ్ఛార్జి కానుంది. అయితే OPPO K13 ఫోన్‌లో ఈ సమస్య ఉండదు. ఎందుకంటే ఈ ఫోన్ ఏకంగా 7000mAh గ్రాఫైట్ బ్యాటరీని కలిగి ఉంది. హెవీ యూజర్లకు ఒక్క రోజులో ఈ ఫోన్ బ్యాటరీని డిశ్చార్జి చేయలేరు. సిలికాన్ బ్యాటరీలతో పోల్చి చూస్తే మెరుగైన పనితీరును అందిస్తాయి. OPPO సొంత బయోనిక్ రిపేర్ ఎలక్ట్రోలైట్ టెక్నాలజీ కారణంగా 5 సంవత్సరాల వరకు మెరుగైన పనితీరును అందిస్తుంది. OPPO K13 స్మార్ట్‌ఫోన్ 80W SUPERVOOCTM ఫ్లాష్ ఛార్జింగ్ ను సపోర్టు చేస్తుంది. ఈ ఛార్జర్ ద్వారా కేవలం 56 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చు.
OPPO K13 స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ 10 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 10 నిమిషాల్లో 25 శాతం ఛార్జ్ అయింది. దీంతోపాటు కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో 4 గంటల వరకు గేమ్స్ ఆడుకోవచ్చు. రియల్‌టైం యూసేజ్ ప్యాట్రన్ మరియు బయట ఉష్ణోగ్రత ఆధారంగా ఛార్జింగ్ స్పీడ్ ఉండేలా OPPO స్మార్ట్ ఛార్జింగ్ ఇంజిన్ 5.0 పనిచేస్తుంది. బ్యాటరీ పనితీరు, బ్యాటరీ ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం లేకుండా చూస్తుంది.

ల్యాగ్ ఫ్రీ గేమింగ్
AI హైపర్ బూస్ట్ సిస్టమ్ ల్యాగ్ లేకుండా చూస్తుంది. మరియు స్మూత్ గా పనిచేసేలా చూస్తుంది. గేమింగ్ వైఫై యాంటెనా కారణంగా నెట్‌వర్క్ పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఫలితంగా నెట్‌వర్క్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లోనూ లో లేటెన్సీ, అవాంతరాలు లేని గేమింగ్‌తో K13 స్మార్ట్‌ఫోన్ అల్టిమేట్ ల్యాగ్ ఫ్రీ కిల్లర్ గా ఉంటుంది. బలమైన, స్థిరమైన నెట్‌వర్క్ కోసం ఈ ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ AI LinkBoost 2.0 ఫీచర్‌ను కలిగి ఉంది. ఫలితంగా బేస్‌మెంట్స్, ఎలివేటర్స్, రద్దీ ప్రాంతాల్లోనూ స్థిరమైన నెట్‌వర్క్ సొంతమవుతుంది.

ఆకట్టుకొనేలా విజువల్ అనుభూతి
పనితీరు, కనెక్టివిటీ. బ్యాటరీ లైఫ్‌తోపాటు డిస్‌ప్లే, డిజైన్ కూడా స్మార్ట్‌ఫోన్ గేమింగ్‌ను ప్రభావితం చేస్తాయి. లాంగ్ గేమింగ్ సమయాల్లో ఆప్టిమల్ కంఫర్ట్‌ను అందిస్తాయి. OPPO K13 5G స్మార్ట్‌ఫోన్ అన్ని మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.
OPPO K13 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్మూత్ గేమ్ ప్లే కోసం 120Hz రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. సూర్యకాంతిలోనూ మెరుగైన విజువల్ అనుభూతిని అందిస్తుంది. దీంతోపాటు లో బ్లూ లైట్ ప్రొటెక్షన్, వెట్ హ్యాండ్ టచ్ మరియు గ్లౌజ్ మోడ్ వంటి ఫీచర్‌లు కూడా ఉన్నాయి. ఈ డివైజ్ మెరుగైన ఆడియో అనుభూతి కోసం 300 శాతం అల్ట్రా వాల్యూమ్ మోడ్ ను కలిగి ఉంది. సూపీరియర్ ఎంటర్‌టైన్‌మెంట్ ను అందిస్తాయి.

అందరినీ ఆకట్టుకొనేలా
ఈ OPPO K13 5G స్మార్ట్‌ఫోన్ స్లీక్, స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది. 8.45mm థిక్‌నెస్ మరియు 208 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంది. ఫలితంగా ఎక్కువ సమయం గేమింగ్, స్ట్రీమింగ్ సమయంలోనూ సౌకర్యంగానే ఉంటుంది. నేచురల్ రాక్ టెక్చర్ డిజైన్ తో ఈ ఫోన్ యూనిక్‌గా కనిపిస్తుంది. అందరికీ ఆకట్టుకొనేలా ఉంటుంది.
ఈ ఫోన్ ఐసూ పర్పుల్, ప్రిజమ్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. పర్పుల్ కలర్ వేరియంట్ గ్లేషియల్ మియు ప్లోటింగ్ ఐస్ ప్యాట్రన్స్‌ను కలిగి ఉంటుంది. అదే బ్లాక్ కలర్ వేరియంట్ జియోమెట్రిక్ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్‌గా ఉంది. ఫలితంగా ఎక్కువ రోజుల మన్నికను అందిస్తుంది.
ఆకట్టుకొనే AI కెమెరా సిస్టమ్
OPPO K13 స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు f/1.85 అపేచర్, ఆటోఫోకస్‌తో 50MP OV50D40 ప్రైమరీ కెమెరా, 2MP OV02B1B లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP సోనీ IMX480 కెమెరాను అమర్చారు. ఈ కెమెరా విభాగం AI ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది.
AI Clarity Enhancer : 10x జూమ్ లేదా అంతకంటే ఎక్కువ జూమ్ తో క్యాప్చర్ చేసిన ఫోటోలను కూడా 4- 8x జూమ్‌లో ప్రొపెషనల్ స్థాయి ఫోటోలను అందిస్తుంది.
AI Reflection Remover : ప్రతిసారి క్లియర్ ఫొటోలను క్యాప్చర్ చేసేందుకు వీలుగా అవసరం లేని రిఫ్లక్షన్‌లను గుర్తించి తొలగిస్తుంది.
AI Unblur : ఏదైనా సందర్భంలో ఫోటోలు క్యాప్చర్ చేసినప్పుడు బ్లర్ గా ఉంటే, ఆ ఫోటోలను మెరుగుపరుస్తుంది. కలర్ ను సరిచేస్తుంది. తక్కువ కాంతి మరియు మోషన్ షాట్స్‌ను కూడా మెరుగుపరుస్తుంది.

AI Eraser 2.0 : ఏదైనా ఫోటోను క్యాప్చర్ చేసినప్పుడు అందులోని అవసరం లేని వస్తువులు లేదా వ్యక్తులను తొలిగించేందుకు సాయం చేస్తుంది.

AI సాఫ్ట్‌వేర్ తో ప్రొడక్టివిటీని మెరుగుపరుస్తుంది
OPPO K13 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 Skin పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. అయితే ఈ ఫోన్ 5 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ OS ద్వారా అనేక కస్టమైజేషన్ ఆప్షన్స్‌ను అందిస్తుంది. దీంతోపాటు గూగుల్ జెమినీ, సర్కిల్ టూ సెర్చ్, AI Summery, స్క్రీన్ ట్రాన్స్‌లేటర్, AI Writer వంటి AI ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.

పవర్‌హౌస్ స్మార్ట్‌ఫోన్
OPPO K13 5G స్మార్ట్‌ఫోన్ కేవలం గేమింగ్ ఫోన్ మాత్రమే కాకుండా అన్ని రకాల యూజర్లను సంతృప్తి పరిచే పవర్ హౌస్ ఫోన్‌గా ఉంటుంది. మెరుగైన పనితీరు, ఇంటెలిజెంట్ థర్మల్ మేనేజ్‌మెంట్, భారీ బ్యాటరీను కలిగి ఉంది. గేమర్స్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఫీచర్‌లతో ప్రీమియం డిజైన్, ఆకట్టుకొనే కెమెరా సిస్టమ్, AI సాఫ్ట్‌వేర్ బూస్టింగ్ వంటివి ఉన్నాయి. ఈ ధర సెగ్మెంట్‌లో అందరికీ బెస్ట్ ఫోన్‌గా ఉంటుంది. OPPO K13 అన్‌స్టాపబుల్‌గా ఉంటుంది.

ధర, ఆఫర్లు, సేల్ వివరాలు
OPPO K13 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19999 గా ఉంది. ఈ ఫోన్ సేల్ ఏప్రిల్ 25 నుంచి ప్రారంభం కానుంది. Flipkart, OPPO e-Store తోపాటు ఇతర ప్రధాన రిటైల్ అవుట్‌లెట్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఒక్కరోజుపాటు రూ.1000 ప్రత్యేక డిస్కౌంట్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








