Home
Mobile

ఇవాళ్టి నుంచే OPPO 5G ఫోన్‌ సేల్‌.. 6.8 అంగుళాల డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, ఇన్‌బిల్ట్‌ ఫ్యాన్‌..!

OPPO K13 Turbo 5G Smartphone Sale : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ ఒప్పో K13 టర్బో సిరీస్‌ గత వారం భారత్‌ మార్కెట్‌ లో విడుదల అయింది. ఇందులో ఒప్పో K13 టర్బో, ఒప్పో K13 టర్బో ప్రో ఫోన్‌ లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ప్రో మోడల్‌ సేల్‌ ప్రారంభం అయింది. ఇవాళ్టి నుంచి బేస్‌ వేరియంట్ సేల్‌ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు అనేక బెస్ట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది.

ధర వివరాలు :
ఒప్పో K13 టర్బో స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.27999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.29999 గా ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఒప్పో ఇండియా ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్స్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

OPPO K13 Turbo 5G Smartphone sale in telugu

కలర్‌ వేరియంట్స్‌ :
ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.3000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. దీంతోపాటు నో కాస్ట్ EMI ఆఫర్లు కూడా ఉన్నాయి. ఒప్పో K13 టర్బో స్మార్ట్‌ ఫోన్‌ ఫస్ట్‌ పర్పుల్‌, సైట్‌ వైట్‌, మిడ్‌ నైట్‌ మావ్‌రిక్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

భారీ డిస్‌ప్లే :
ఒప్పో K13 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. IPX6, IPX8, IPX9 రేటింగ్‌ ను కలిగి ఉంది.

OPPO K13 Turbo 5G Smartphone sale in telugu

ఇన్‌బిల్ట్‌ ఫ్యాన్‌, కూలింగ్‌ ఛాంబర్‌ :
ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ColorOS 15.0.2 పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఇన్‌బిల్ట్ ఫ్యాన్‌, ఎయిర్ డక్ట్స్‌, 7000 sq mm వేపర్‌ కూలింగ్ ఛాంబర్‌ ను కలిగి ఉంది.

50MP కెమెరా, 7000mAh భారీ బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఒప్పో K13 టర్బో 5G స్మార్ట్‌ఫోన్‌ బైపాస్‌ ఛార్జింగ్‌ ను కూడా సపోర్టు చేస్తుంది.

ఒప్పో K13 టర్బో 5G కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, WiFi 7, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సెక్యూరిటీ కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ను కలిగి ఉంది.

ఒప్పో K13 టర్బో ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికే సేల్‌ ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.37,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.39,999 గా ఉంది. పర్పుల్‌ ఫాంటమ్‌, మిడ్‌నైట్‌ మావ్‌రిక్‌, సిల్వర్‌ నైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO K13 Turbo 5G Smartphone sale start from today via Flipkart here is the deal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X