రూ.30వేల-రూ.40వేల ధరలో OPPO K13 Turbo Pro 5G, OPPO K13 Turbo 5G బెస్ట్ గేమింగ్ ఫోన్‌లుగా నిలవడానికి కారణాలు
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ కేవలం కమ్యూనికేషన్ సాధనంగానే కాకుండా అనేక పనుల కోసం ఉపయోగపడుతోంది. మీకు గేమింగ్ లేదా మల్టీ టాస్కింగ్ కోసం వేగం, మెరుగైన పనితీరు సహా ఎక్కువరోజులపాటు మన్నిక వచ్చే స్మార్ట్‌ఫోన్ అవసరం. అది కూడా మీకు అందుబాటులో ధరలోనే లభిస్తుంది.
OPPO K13 Turbo 5G సిరీస్ ఫ్లాగ్‌షిప్ స్థాయిలో పనితీరును కనబరుస్తుంది. అది కూడా రూ.30 వేల నుంచి రూ.40 వేల ధర రేంజ్ లోనే అందుబాటులోకి వచ్చింది. OPPO K13 Turbo Pro 5G స్మార్ట్‌ఫోన్ అధిక సామర్థ్యంతో కూడిన మోడల్‌ను ప్రత్యేకంగా గేమర్స్ కోసం తీసుకొచ్చారు. ఈ ఫోన్ ప్రత్యేకమైన కూలింగ్ ఫ్యాన్‌ను కూడా ఉంటుంది. మరియు రోజువారీ పనుల కోసం ఉపయోగించే వారికి కూడా OPPO K14 Turbo 5G, OPPO K13 Turbo Pro 5G స్మార్ట్‌ఫోన్‌లు మెరుగైన అనుభూతిని అందిస్తాయి.

థర్మల్ మేనేజ్‌మెంట్
అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు మార్కెటింగ్ కోసం అనేక మార్గాలను ఎంచుకుంటాయి. అయితే OPPO మాత్రం OPPO K13 Turbo 5G సిరీస్‌లో యూజర్ ఫస్ట్ విధానాన్ని ఎంచుకుంది. స్థిరమైన పనితీరు, మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ విధానానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల ఎక్కువ సమయం ఉపయోగించిన తర్వాత, ఈ విషయం నిరూపితం అయింది.
OPPO K13 Turbo 5G సిరీస్ హైబ్రిడ్ కూలింగ్ సిస్టమ్‌ను పరిచయం చేసింది. ఇందులో యాక్టివ్, ప్యాసివ్ థర్మల్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. రూ.40 వేల ధర సెగ్మెంట్‌లో ఈ తరహా సిస్టమ్‌ను ఉపయోగించలేదు. ఇందులో 19000mm Sq మల్టీ లేయర్ గ్రాఫైట్ షీట్‌తో కూడిన 7000mm sq వేపర్ ఛాంబర్‌ను కలిగి ఉంది. ఈ సిస్టమ్ డిస్‌ప్లే, బ్యాటరీ, చిప్‌సెట్ అంతా సమానంగా వేడిని చెదరగొడుతుంది. OPPO స్వయంగా అభివృద్ధి చేసిన స్మార్ట్ ఇండియా యాక్టివ్ కూలింగ్ మాడ్యూల్ కూడా ఉంది. ఇది L ఆకారంలో ఉన్న డక్ట్, ఆర్క్ వోర్టెక్స్ డిజైన్‌తో కూడిన సెంట్రీఫ్యూగల్ ఫ్యాన్‌ను కలిగి ఉంది. ఇది సాంప్రదాయ సిస్టమ్స్ కంటే 220 శాతం ఎక్కువ గాలి ప్రవాహం ఉండేలా చూస్తుంది. ఇవి వాటర్‌ప్రూఫ్, పవర్ ఎఫీషియంట్‌గా ఉంటాయి. ఫలితంగా ఇన్‌బిల్ట్ కూలింగ్ ఫ్యాన్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌గా గుర్తింపు పొందింది.
ఇందులో ఎటువంటి జిమ్మిక్ లేదని తమ పరీక్షలో తేలింది. 120FPS వద్ద మూడు గంటల BGMI సెషన్‌లో కేవలం 1.2 డిగ్రీ సెల్సియల్ మాత్రమే పెరుగుదలను గుర్తించాము. ఎక్కువ సమయం ఉపయోగించినప్పుడు పనితీరుపై ప్రభావం చూపే సమస్యలు ఏమీ గుర్తించలేదు. బెంచ్‌మార్క్ పరంగానూ OPPO K13 Turbo 5G స్మార్ట్‌ఫోన్ 1.66 మిలియన్ AnTuTu స్కోర్, అదే ప్రో మోడల్ 2.2 మిలియన్ స్కోర్‌ను కలిగి ఉంది. భారత్‌లో మేము పరీక్షించిన వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 డివైజ్‌గా గుర్తింపు పొందింది.
ముఖ్యంగా గేమింగ్ సమయంలో శక్తి, స్థిరత్వాన్ని కోరుకొనే వారికి OPPO K13 Turbo 5G సిరీస్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. మరియు పూర్తి కొత్త అనుభూతిని అందిస్తుంది.

ఈ సెగ్మెంట్‌లో గుర్తించదగిన పనితీరు
OPPO K13 Turbo Pro 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్, అదే బేస్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8450 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది.
OPPO K13 Turbo Pro 5G : ఈ ప్రో మోడల్ స్మార్ట్‌ఫోన్ తమ ఫ్లాగ్‌షిప్ స్నా్‌ప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో మిడ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లో మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది. గత మోడల్స్‌తో పోలిస్తే ఈ 4nm చిప్‌సెట్ 31 శాతం CPU, 49 శాతం GPU పనితీరును మెరుగుపరుస్తుంది. గేమింగ్ సమయంలో ఫ్రేమ్ డ్రాప్ లేకపోవడం, మల్టీ టాస్కింగ్ సమయంలో స్మూత్ పనితీరు వంటి అనుభూతిని అందిస్తుంది. గ్రాఫిక్స్ పనితీరు మెరుగుపరిచేందుకు అమర్చిన Adreno GPU కూడా ఆకట్టుకుంటుంది.
క్లౌడ్ పై ఆధారపడకుండా ఇంటిగ్రేటెడ్ NPU రియల్‌టైం ఇమేజ్ ప్రాసెసింగ్ నుంచి స్మార్ట్ గేమింగ్ ఆప్టిమైజేషన్ వరకు అధునాతన ఆన్ డివైస్ AI ను అనుమతిస్తుంది. లో లేటెన్సీ, మెరుగైన ప్రైవసీని కూడా అందిస్తుంది. వైఫై 7, 4.2 Gbps స్పీడ్‌తో కూడిన 5G, బ్లూటూత్ 6.0.. అంతరాయాలు లేని ఆన్‌లైన్ ప్లే, వేగవంతమైన డౌన్‌లోడ్‌ను అందిస్తుంది. ఫలితంగా గేమర్స్, కంటెంట్ క్రియేటర్లకు మంచి ఆప్షన్‌గా ఉంటుంది.

OPPO K13 Turbo Pro 5G స్మార్ట్‌ఫోన్ రూ.40 వేల ధర రేంజ్‌లో గేమర్స్, మల్టీ టాస్కింగ్ యూజర్లకు అత్యుత్తమ హ్యాండ్‌సెట్‌గా నిలుస్తుంది. పనితీరు, స్థిరత్వం, ఆవిష్కరణల ద్వారా ఆకట్టుకుంటుంది.
OPPO K13 Turbo 5G : ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. సామర్థ్యం, అవుట్‌పుట్‌లో సమతుల్యతను పాటిస్తుంది. ఆల్ బిగ్ కోర్ ఆర్కిటెక్చర్, L3 క్యాచిని కలిగి ఉంది. మరియు మల్టీ కోర్ చిప్ కారణంగా యాప్‌లను త్వరగా లోడ్ అవుతాయి. గత మోడల్స్‌తో పోలిస్తే 41 శాతం తక్కువ పవర్‌ను ఉపయోగించుకుంటూ 41 శాతం అధిక వేగాన్ని అందిస్తుంది. అధిక సమయం గేమింగ్ సెషన్‌లో బ్యాటరీ పనితీరును గుర్తించవచ్చు.
గ్రాఫిక్స్ కోసం ARM G720 MC7 GPU ను కలిగి ఉంది. ఫలితంగా ఫ్రేమ్ రేట్ స్థిరంగా మెరుగ్గా ఉండేలా చూస్తుంది. ఎక్కువ సమయం గేమింగ్ కోసం ఉపయోగించినా, ఫ్రేమ్ రేట్‌లో మార్పులు, ఓవర్ హీట్ వంటి సమస్యలు ఉత్పన్నం కావు. అప్‌గ్రేడ్ చేసిన NPU 880 40 శాతం AI పనితీరును మెరుగుపరుస్తుంది. కెమెరాలు రియల్ టైమ్‌లో ఆప్టిమైజ్ అవుతాయి.
రోజువారీ వినియోగంలో OPPO K13 Turbo 5G వేగం, అద్భుతమైన పనితీరుతో ఆకట్టుకుంటుంది. రూ.30 వేల ధర సెగ్మెంట్‌లో గేమర్స్, మల్టీ టాస్కింగ్ కోసం బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుంది.

రూ.40 వేల లో బెస్ట్ 5G గేమింగ్ ఫోన్ టైటిల్ కోసం ఈ హార్డ్‌వేర్ తోపాటు సాఫ్ట్‌వేర్ పరంగానూ అనేక ప్రత్యేకతలున్నాయి. OPPO K13 Turbo 5G సిరీస్ గేమింగ్ స్మార్ట్‌వేర్ కూడా ఆకట్టుకుంది.
* Pro Touch Optimisation, 3910P టచ్ IC, గేమింగ్, ఎక్కువ ఇంటెన్సిటీ సమయాల్లోనూ అల్ట్రా రెన్పాన్సి్వ్, లో లెటేన్సీతో కూడిన ఇన్‌పుట్‌ను అందిస్తుంది.
* Glove Mode/Wet Touch Mode ద్వారా అత్యంత కచ్చితత్వమైన టచ్‌ను అందిస్తుంది. 5mm థిక్‌నెస్ వరకు ఉన్నా కూడా సాధారణ తరహాలోనే ప్రవర్తి్స్తుంది. AI స్క్రీన్ ప్రొటెక్షర్ డిటెక్షన్ టచ్ కచ్చితత్వాన్ని 95 శాతం కంటే ఎక్కువ పెంచింది.
* OReality Audio తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మెరుగైన, స్పేషియల్ సౌండ్‌ను అందించాయి.
* OPPO Game Assistant ఫీచర్ ద్వారా వన్ ట్యాప్ రీ ప్లే, సైలెంట్ లాంచ్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. మరెక్కడా లేని విధంగా మెరుగైన మొబైల్ గేమింగ్ అనుభూతిని అందిస్తుంది.
అధిక సమయం గేమింగ్ సమయాల్లోనూ..
ఎక్కువ సమయం గేమింగ్ ఆడేందుకు బ్యాటరీ కూడా సహకరించాల్సి ఉంటుంది. అయితే OPPO K13 Turbo 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు 7000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేసి ఏకంగా ఒకటిన్నర రోజు వరకు ఉపయోగించుకోవచ్చు.

ఈ సిరీస్ 80W SUPERVOOCTM ఫ్లాస్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. 54 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ చేయవచ్చు. మరియు OPPO ఇంటెలిజెంట్ ఛార్జింగ్ ఇంజిన్ 5.0 కారణంగా బ్యాటరీ ఐదు సంవత్సరాల వరకు మెరుగైన పనితీరును అందిస్తుంది. ఛార్జింగ్ పెట్టి, హేవీ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా ఫోన్ ఉష్ణోగ్రత అదుపులో ఉండేలా బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కృషిచేస్తుంది.
న్యూ గేమింగ్ ఐడెంటిటీ
ఇతర సాంప్రదాయ OPPO స్మార్ట్‌ఫోన్ల తరహాలో OPPO K13 Turbo 5G సిరీస్ తమ గేమింగ్ DNA ను దాచేందుకు ఇబ్బంది పడదు. రేసింగ్ ప్రేరేపిత డిజైన్ ఈ ఫోన్ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తుంది. వేగం, నైపుణ్యం, పనితీరును కోరుకొనే వారి కోసం రూపొందించబడిన స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ 8.31mm థిక్‌నెస్, 200 గ్రాముల కంటే ఎక్కువ బరువును మాత్రమే కలిగి ఉంది. శక్తివంతమైన హార్డ్‌వేర్, ఇన్‌బిల్ట్ ఫ్యాన్ ఉన్నా కూడా ఈ ఫోన్ స్లిమ్‌గానే ఉంటుంది.
ఈ ఫోన్ 120Hz ఫ్లాట్ ఇ-స్పోర్ట్స్ డిస్‌ప్లే ఫ్లూయిడ్, ఐ కంఫర్టబుల్ విజువల్స్‌ను అందిస్తుంది. టర్బో బ్రీతింగ్ లైట్ సిస్టమ్ డైనమిక్ కలర్ ఆప్షన్‌తో రెండు బిల్ట్ ఇన్ LED లను కలిగి ఉంది. OPPO k13 Turbo Pro 5G గేమింగ్ ఐడెంటిటీని బలోపేతం చేసే ఫీచర్‌ను జోడిస్తుంది. అదే OPPO K13 Turb౦ టర్బో ల్యూమినస్ రింగ్‌ను కలిగి ఉంది.
OPPO Turbo Pro 5G ధర రూ.40000 కంటే తక్కవగా ఉంది. సిల్వల్ నైట్, మిడ్‌నైట్ మావ్‌రిక్, పర్పుల్ ఫాంటమ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. అదే బేస్ వేరియంట్ పర్పుల్ ఫాంటమ్, మిడ్‌నైట్ మావ్‌రిక్, వైట్ నైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
* పర్పుల్ ఫాంటమ్ : పర్పుల్ నియాన్, సైబర్‌పంక్ కలయికతో ఏర్పడింది. ప్రకాశించే సాంకేతికతను కలిగి ఉన్న మోటార్ సైకిళ్ల నుంచి ప్రేరణ పొందింది.
* సిల్వర్ నైట్ : ఇది విండ్ స్విఫ్ట్ మోటాలిక్ షైన్, ప్రెసిషన్ మెటల్ కటింగ్ డిజైన్, మెరుగైన పనితీరును సూచించే అధిక మోటార్‌సైకిల్ ఎగ్జాస్ట్‌లను ప్రతిబింబిస్తుంది.
* వైట్ నైట్ : శాండ్‌స్ట్రోమ్ ఆకారంలోనే మెటాలిక్ టెక్చర్స్ మరియు చల్లని, తెల్లని కాంతి నుంచి తీసుకోబడింది. ఇది స్వచ్చమైన పనితీరును ప్రతిబింబిస్తుంది.
* మిడ్‌నైట్ మావెరిక్ : క్లాసిక్ శైలిని ఇష్టపడే వారి అభిరుచులను ప్రతిబింబించే ఎంపిక.

ఈ ఫోన్లు డిజైన్‌తోపాటు మన్నిక కూడా హైలెట్‌గా నిలుస్తుంది. ఈ రెండు ఫోన్‌లు స్రై డోమ్ నిర్మాణం తరహాలోని అధిక శక్తివంతమైన క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ను కలిగి ఉంటుంది. ఫలితంగా డ్రాప్ రెసిస్టెన్స్, వేర్ రిసిస్టెన్స్‌ను మెరుగుపరుస్తుంది. మరియు ఈ సెగ్మెంట్‌లో IPX9 + IPX8 + IPX6 రేటింగ్‌తో కూడిన వాటర్ ప్రూఫ్ గేమింగ్ ఫోన్‌గా ఉంది. దీని ఆధారంగా ఈ సిరీస్ కేవలం గేమింగ్ కోసమే కాకుండా రోజువారీ పనుల్లో ఎదురైన సమస్యలను తట్టుకొనే విధంగా ఉంటాయి.

ప్రతి ఫ్రేమ్.. యాక్షన్
OPPO K13 Turbo 5G సిరీస్ 6.8 అంగుళాల 1.5K అమోలెడ్ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉన్నాయి. ఫలితంగా అవుట్‌డోర్ గేమింగ్ కూడా విజిబిలిటీ ఆకట్టుకొనేలా ఉంటుంది. మరియు 120Hz ఫ్రేమ్ రేట్‌ను కలిగి ఉంది.
ఈ సిరీస్ అల్ట్రా రెస్పాన్సివ్ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ (3000Hz ఇన్‌స్టంట్ టచ్ రెన్పాన్స్), అడ్వాన్స్‌డ్ 3910P టెక్నాలజీని కలిగి ఉంది. స్క్రీన్ ప్రొటెక్షన్ డిటెక్షన్, గ్లౌజ్ టచ్, స్ల్పాష్ టచ్ వంటి అనేక ఫీచర్లున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సౌకర్యంగా ఉంటుంది.

అధిక సమయంలో గేమ్స్ ఆడేవారి సౌకర్యం కోసం రూ.30 వేల నుంచి రూ.40 వేల మధ్యలో లాంచ్ అయిన ఒప్పో కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేకమైన ఐ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటాయి. ఫలితంగా ఎక్కువ సమయం గేమ్స్ ఆడినా కళ్లపై ఒత్తిడి లేకుండా ఉంటుంది. OPPO గేమింగ్ స్మార్ట్‌ఫోన్లు X లీనియర్ మోటార్‌ను కలిగి ఉంటాయి. కచ్చితమైన, తక్షణం ప్రతిస్పందించే ఫీచర్‌లను అందిస్తుంది. గేమింగ్‌లో ప్రతిక్షణం మిమ్మల్ని ఆస్వాదించేలా చేస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు
OPPO K13 Turbo 5G సిరీస్ అనేక స్మార్ట్ AI ఫీచర్లను కలిగి ఉంటుంది. మీ రోజువారీ పనులు సులభతరం చేస్తాయి. AI Best Face గ్రూఫ్ ఫోటో ఎల్లప్పుడు ఆకట్టుకొనేలా చూస్తుంది. AI Voice Assistant ట్రాన్స్‌లేషన్, సారాంశాలను త్వరితగతిన అందిస్తుంది. అదనపు సౌలభ్యం కోసం AI Auto Run, AI Call Translate ను కూడా కలిగి ఉంది.

దీంతోపాటు ఏఐ ఆధారిత ఫ్రేమ్ ప్రిడిక్షన్, టచ్ ట్యూనింగ్, థర్మల్ ఆప్టిమైజేషన్ డైనమిక్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌తో కలిగి పనిచేస్తాయి. ఫలితంగా గేమింగ్, మల్టీ టాస్కింగ్ సజావుగా సాగేలా చూస్తాయి. బలహీనమైన నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో హై ఎనర్జీ అవుట్‌డోర్ మోడ్ 2.0 పనితీరును ఆప్టిమేజ్ చేస్తుంది.
బ్లూటూత్ 6.0 (OPPO K13 Turbo Pro 5G), బ్లూటూత్ 5.4 (OPPO K13 Turbo 5G) అవాంతరాలు లేని కనెక్టివిటీని అందిస్తుంది. పరికరాలు త్వరగా జతకలిసేలా చూస్తుంది. మరియు మల్టీ ఫంక్షన్ NFC ద్వారా పేమెంట్స్ త్వరగా జరిగేలా చూస్తుంది.
AI ఇమేజింగ్ ఇంటెలిజెన్స్

* AI Clarity Enhancer అనేది ఇమేజ్ షార్ప్‌నెస్‌ను పునరుద్దరించడం మరియు మెరుగుపరచడం, పాత ఫోటోలను మెరుగులుదిద్దడం కోసం పిక్సల్ స్థాయి విశ్లేషణతోపాటు మోడల్ అల్దారిథమ్‌ను ఉపయోగిస్తుంది.
* AI Eraser 2.0 ఫోటోల్లోనూ అవసరం లేని వస్తువులు, వ్యక్తులను సులభంగా తొలగించేందుకు సాయం చేస్తుంది.
* AI Unblur / AI Reflection Remover ఫోటోల్లో అస్పష్టంగా ఉన్న వస్తువులు, వ్యక్తులు జంతువులను మెరుగుపరుస్తుంది. మరియు గ్లాస్ రిఫ్లక్షన్‌లను తొలగిస్తుంది.
చివరిగా
రూ.40 వేల ధర సెగ్మెంట్‌లో OPPO K13 Turbo 5G సిరీస్ మెరుగైన పనితీరును అందించే మోడల్‌గా నిలుస్తుంది. బిల్ట్ ఇన్ కూలింగ్ ఫ్యాన్, అడ్వాన్సడ్ థర్మల్ మేనేజ్‌మెంట్, AI ఆధారిత ఫీచర్లను కలిగి ఉంది. 120fps గేమింగ్, 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. బైపాస్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. స్మార్ట్ ఇంజిన్ 5.0 కారణంగా బ్యాటరీ ఎక్కువ రోజుల పాటు మన్నిక ఇస్తుంది. AI టూల్స్, ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ హార్డ్‌వేర్, డిజైన్ కారణంగా గేమర్స్‌కు ఈ ధర సెగ్మెంట్‌లో ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.
ధర, ఆఫర్లు
OPPO K13 Turbo 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.29999 గా ఉంది. ఈ ఫోన్ వైట్ నైట్, పర్పుల్ ఫాంటమ్, మిడ్‌నైట్ మావ్‌రిక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. అదే ప్రో మోడల్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.37999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.39999 గా ఉంది. సిల్వర్ నైట్, పర్పుల్ ఫాంటమ్, మిడ్‌నైట్ మావ్‌రిక్ రేసింగ్ డిజైన్‌లో లభిస్తుంది.
ఈ రెండు మోడల్‌పై ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఎక్ఛ్సేజీ బోనస్‌ను పొందవచ్చు. మరియు 12 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. ఈ డిస్కౌంట్ బేస్ వేరియంట్ ధరలు వరుసగా రూ.24999, రూ.26999 గా ఉన్నాయి. ప్రో మోడల్ ధర రూ.34999, రూ.36999 గా ఉంది. వీటితోపాటు ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌లో టర్బో స్పీడ్ డెలివరీ సదుపాయం కూడా ఉంది.
OPPO K13 Turbo 5G సిరీస్ Flipkart, OPPO India E-Store ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ప్రధాన రిటైల్ అవుట్‌లెట్స్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








