Home
Mobile

7000mAh బ్యాటరీ, 6.8 అంగుళాల డిస్‌ప్లే, ఇన్‌బిల్ట్‌ ఫ్యాన్‌తో OPPO 5G స్మార్ట్‌ఫోన్‌.. ఇవాళ్టి నుంచే సేల్‌..!

OPPO k13 Turbo Pro 5G Smartphone Sale : ఒప్పో నుంచి ఇటీవల భారత్ మార్కెట్‌ లో ఒప్పో K13 టర్బో సిరీస్‌ విడుదల అయింది. ఒప్పో K13 టర్బో, K13 టర్బో ప్రో మోడల్స్‌ ను అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ్టి నుంచి ఒప్పో K13 టర్బో ప్రో మోడల్‌ సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీ, 6.8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్‌ తో అందుబాటులో ఉంది.

ఒప్పో K13 టర్బో ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.37,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.39,999 గా ఉంది.

OPPO K13 Turbo Pro 5G

రూ.3 వేల డిస్కౌంట్ :
ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. దీంతోపాటు నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఒప్పో ఫోన్‌ పర్పుల్‌ ఫాంటమ్‌, మిడ్‌నైట్‌ మావ్‌రిక్‌, సిల్వర్‌ నైట్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

ఒప్పో K13 టర్బో ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఒప్పో K13 టర్బో ప్రో స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్, 1600 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ IPX6, IPX8, IPX9 వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

OPPO K13 Turbo Pro 5G

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 4 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ColorOS 15.0.2 పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని ఒప్పో తెలిపింది.

7000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ బైపాస్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ను కలిగి ఉంది.

OPPO K13 Turbo Pro 5G

ఈ హ్యాండ్‌సెట్ థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఇన్‌బిల్ట్ ఫ్యాన్‌, ఎయిర్ డక్ట్స్‌, 7000 Sq mm వేపర్‌ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, WiFi 7, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు.

* ఈ సిరీస్‌లో బేస్ వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.27999 గా ఉంది. ఈ ఫోన్‌ ఫస్ట్‌ పర్పుల్‌, సైట్‌ వైట్‌, మిడ్‌నైట్‌ మావ్‌రిక్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO K13 Turbo Pro 5G smartphone with inbuild Fan and 7000mAh battery sale today in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X