వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్న OPPO.. తాజాగా కొత్త సిరీస్ విడుదలపై కీలక ప్రకటన!
OPPO K13 Turbo Series : ఒప్పో K13 టర్బో సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో భారత్ మార్కె్‌ట్లో విడుదల కానుంది. తాజాగా ఒప్పో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే కచ్చితమైన విడుదల తేదీ వెల్లడి కాలేదు. ఆగస్టు నెలలోనే ఒప్పో K13 టర్బో, ఒప్పో K13 టర్బో ప్రో మోడల్స్ లాంచ్ కానున్నాయి. విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది.
ఫ్లిప్‌కార్ట్ ద్వారా :
ఒప్పో K13 టర్బో సిరీస్‌కు సంబంధించిన మైక్రోసైట్‌ను ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించింది. ఇప్పటికే వరకు ఒప్పో, ఫ్లిప్‌కార్ట్ ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్ల గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అయితే త్వరలో ఈ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ రెండు ఫోన్‌లు చైనాలో అందుబాటులో ఉన్నాయి. చైనా మార్కెట్‌లో ఒప్పో K13 టర్బో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. అదే ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉన్నాయి. రెండు ఫోన్‌లు 12GB/16GB LPDDR5x ర్యామ్, 1TB వరకు స్టోరేజీని సపోర్టు చేస్తున్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తున్నాయి.
ఈ ఫోన్‌లు 120Hz రీఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో ఫ్లాట్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఈ ఒప్పో K13 టర్బో సిరీస్ ఫోన్‌లు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. దీంతోపాటు ఈ రెండు మోడల్స్ IPX6, IPX8, IPX9 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌గా ఉన్నాయి. ఇందులో చాలా వరకు భారత్ వేరియంట్స్‌లోనూ ఉండే అవకాశం ఉంది.
ఇటీవల భారత్‌లో K13, K13x ఫోన్‌లు విడుదల :
ప్రస్తుతం ఒప్పో K13, ఒప్పో K13x 5G ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒప్పో K13 ఫోన్ ప్రారంభ ధర రూ.17999 గా ఉంది. అదే ఒప్పో K13x 5G హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.11999 గా ఉంది.
ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ 6.7 అంగుళాల అమోలెడ్ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4nm స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 ను కలిగి ఉంది. కూలింగ్ ఛాంబర్, ఒప్పో AI ట్రినిటీ ఇంజిన్ సహా అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లున్నాయి.
ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా మరియు 16MP MP సోనీ IMX480 కెమెరాను కలిగి ఉంది. 80W Supervooc ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ ప్రూఫ్‌గా ఉంది.
ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 6nm ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








