Home
Mobile

ఈ యూజర్లే టార్గెట్‌గా OPPO నుంచి కొత్త సిరీస్‌.. విడుదల తేదీ, చిప్‌సెట్‌ సహా కీలక వివరాలు వెల్లడి..!

OPPO K13 Turbo Series : ఒప్పో నుంచి త్వరలో K13 టర్బో సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌ లో భాగంగా ఒప్పో K13 టర్బో, K13 టర్బో ప్రో మోడల్స్‌ లాంచ్‌ కానున్నాయి. ఈ ఫోన్‌లు ప్రధానంగా గేమింగ్‌, క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సిరీస్‌ విడుదల తేదీ సహా చిప్‌సెట్‌, పనితీరు వివరాలు వెల్లడయ్యాయి.

ఎప్పుడు విడుదల కానుంది :
ఒప్పో K13 టర్బో సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ లు భారత్ మార్కెట్‌ లో ఆగస్టు 11 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. ఈ ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. మరియు రూ.40 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్‌ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యాయి.

OPPO K13 Turbo Series Smartphones

ఒప్పో K13 టర్బో ప్రో స్మార్ట్‌ఫోన్ :
ఒప్పో K13 టర్బో ప్రో మోడల్‌ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 SoC చిప్‌సెట్‌ తో అందుబాటులోకి వస్తుందని ఒప్పో తెలిపింది. గత మోడల్స్‌ తో పోలిస్తే.. టర్బో సిరీస్‌ 31 శాతం CPU మెరుగుదల, GPU 49 శాతం మెరుగైన పనితీరును అందిస్తుందని చెబుతోంది. దీంతోపాటు NPU ను కూడా కలిగి ఉంటుంది.

ఈ సిరీస్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఇందులో Text Summarisation, Smart Suggestions వంటి జెమినీ ఫీచర్లు ఉంటాయి. చైనా వేరియంట్ ఆధారంగా ఈ సిరీస్‌ 6.8 అంగుళాల ఫ్లాట్ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

OPPO K13 Turbo Series Smartphones

ఒప్పో K13 టర్బో స్మార్ట్‌ఫోన్‌ :
ఒప్పో K13 టర్బో స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. దీంతోపాటు Arm G720 MC7 GPU ను కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్‌ రియల్‌ టైం వాయిస్‌ రికజ్నైజేషన్‌, సెన్స్‌ ఆప్టిమైజేషన్‌, Smart Enhancements వంటి అనేక AI ఆధారిత సామర్థ్యాలను కలిగి ఉంటుంది.

ఒప్పో K13 టర్బో సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ లు ప్రత్యేకమైన యాక్టివ్‌, పాసివ్‌ కూలింగ్‌ యూనిట్స్‌ ను కలిగి ఉంటాయని సంస్థ తెలిపింది. గేమింగ్‌, హెవీ యూజ్‌, మల్టీ టాస్కింగ్ సమయాల్లో సిరీస్‌ వేడెక్కకుండా ఉండేందుకు ఈ ఫీచర్‌ అనుకూలంగా ఉంటుంది. ఈ ఒప్పో సిరీస్ 7000 sq mm వేపర్‌ ఛాంబర్‌, 19000 sq mm గ్రాఫైట్‌ లేయర్‌ ను కలిగి ఉంటుంది.

ఒప్పో K13 టర్బో స్మార్ట్‌ఫోన్ రూ.30 కంటే తక్కువ అదే ప్రో మోడల్‌ రూ.40 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్‌ కు సంబంధించిన ప్రత్యేకమైన మైక్రోసైట్‌ లైవ్‌ లో ఉంది. ఒప్పో ఇండియా స్టోర్‌ ద్వారా కూడా అందుబాటులోకి రానున్నాయి. కనెక్టివిటీ పరంగా ఈ సిరీస్‌ 5G, 4G LTE, వైఫై 7, బ్లూటూత్‌ 6.0 వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉంటుందని ఒప్పో తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO K13 Turbo Series Smartphones launch date and chipset details revealed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X