Home
Mobile

OPPO K13 టర్బో సిరీస్‌ ఫోన్‌లు విడుదల.. 7000mAh బ్యాటరీ, 6.8 అంగుళాల డిస్‌ప్లే సహా సూపర్‌ ఫీచర్లు..!

OPPO K13 Turbo Series : ఒప్పో K13 టర్బో సిరీస్‌ భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో K13 టర్బో, K13 టర్బో ప్రో ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు 7000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఈ ఒప్పో ఫోన్‌లు ఈ సంవత్సరం జులైలో చైనాలో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్‌ డిజైన్ పరంగా ఆకట్టుకుంటాయి. ఈ సిరీస్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

* ఒప్పో K13 టర్బో సిరీస్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ సిరీస్‌ ఫోన్‌లు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 1600 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది.

Oppo k13 Turbo Series telugu news

ఒప్పో K13 టర్బో స్మార్ట్‌ఫోన్‌ :
ఒప్పో K13 టర్బో స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 12GB ర్యామ్‌, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ColorOS 15.0.2 తో పనిచేస్తుంది. రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చారు.

ఒప్పో K13 టర్బో ప్రో స్మార్ట్‌ఫోన్‌ :
ఒప్పో K13 టర్బో ప్రో మోడల్‌ స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 4 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 12GB ర్యామ్‌, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ColorOS 15.0.2 తో పనిచేస్తుంది. రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చారు.

Oppo k13 Turbo Series telugu news

ఈ ఒప్పో K13 టర్బో సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ బైపాస్‌ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఇన్‌బిల్ట్ ఫ్యాన్‌, ఎయిర్ డక్ట్స్‌, 7000 sq mm వేపర్‌ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, వైఫై 7, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఈ సిరీస్‌ IPX6, IPX8, IPX9 వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

Oppo k13 Turbo Series telugu news

* ఒప్పో K13 టర్బో సిరీస్‌ ధర, సేల్‌ వివరాలు :
ఒప్పో K13 టర్పో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.29999 గా ఉంది. ఈ ఫోన్‌ ఫస్ట్‌ పర్పుల్‌, సైట్‌ వైట్‌, మిడ్‌నైట్‌ మావ్‌రిక్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ సేల్‌ ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది.

అదే ప్రో మోడల్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.37,999 గా ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది. ఈ ఫోన్ సేల్‌ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. మిడ్‌నైట్‌ మావ్‌రిక్‌, పర్పుల్‌ ఫాంటమ్‌, సిల్వర్‌ నైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఒప్పో K13 టర్బో సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లను ఒప్పో ఇండియా ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. 9 నెలల వరకు నో కాస్ట్‌ EMI ఆప్షన్‌లను పొందవచ్చు.

FAQs
ఒప్పో K13 టర్బో సిరీస్‌ ఎన్ని సంవత్సరాల అప్‌డేట్స్‌ను అందిస్తుంది?

2 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

ఈ సిరీస్‌ ఎలాంటి థర్మల్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి?

ఒప్పో సిరీస్‌ థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం ఇన్‌బిల్ట్ ఫ్యాన్‌, ఎయిర్ డక్ట్స్‌, 7000 sq mm వేపర్‌ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్ ఛార్జింగ్‌ ప్రత్యేకతలు ఏంటి?

ఈ ఫోన్‌ 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. 80W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.

GizBot Technology

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo k13 Turbo Series with 7000mAh battery vapour cooling Chamber launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X