Home
Mobile

OPPO K13x 5G Overview : రూ.15 వేల ధరలో అందుబాటులో ఉన్న నమ్మకమైన, ధృడమైన స్మార్ట్‌ఫోన్‌

తక్కువ ధర 5G స్మార్ట్‌ఫోన్ల సెగ్మెంట్‌ విషయానికి వస్తే.. ఫోన్‌ తయారీదారులు ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ తోపాటు వీలైనంత వరకు మెరుగైన స్పెసిఫికేషన్‌లపై దృష్టిపెడుతుంటారు. చాలా వరకు మన్నిక మరియు యూజర్‌ అనుభూతిని మెరుగుపరిచే అంశాలను విస్మరిస్తుంటారు. అయితే ఈ ట్రెండ్‌కు ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ OPPO తమ K13x 5G మోడల్‌తో చెక్‌పెట్టింది.

OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్ మెరుగైన పనితీరు, అప్‌గ్రేడ్‌ సాఫ్ట్‌వేర్‌తోపాటు ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా డిజైన్‌ను అందిస్తూ సమతుల్యతను ప్రదర్శిస్తుంది. మరియు అందుబాటు ధరకు తీసుకొచ్చింది. ఈ ధరలో స్పెసిఫికేషన్ల విషయంలో రాజీ పడి వచ్చిన మోడల్స్‌తో నిండిన మార్కెట్‌లో బెస్ట్‌ ఆప్షన్‌గా నిలుస్తుంది.

OPPO K13x 5G

ధృడమైన డిజైన్‌, అల్యూమినియం ఫ్రేమ్
ఈ బడ్జెట్‌ విభాగంలో బిల్ట్‌ క్వాలిటీపై రాజీపడడం మరియు కేవలం స్పెసిఫికేషన్‌తోనే ఆధిపత్యం చలాయించే విభాగంలో OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ఫోనే ఏరోస్పేస్‌ గ్రేడ్‌ AM04 అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్ వినియోగించారు. ఫలితంగా ఎక్కువ బరువును కాకుండా ధృడమైన ఆకృతిని అందిస్తుంది. దీంతోపాటు OPPO ఫోన్ 360 డిగ్రీల డ్యామేజీ ప్రూఫ్‌ ఆర్మర్ బాడీ ని కలిగి ఉంది. వీటితోపాటు క్రిస్టల్‌ షీల్డ్‌ గ్లాస్‌, IP65 సర్టిఫైడ్‌ వాటర్, డస్ట్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

సముద్రపు సహజమైన స్పాంజీల డిజైన్‌ నుంచి ప్రేరణ పొంది, ఈ ఫోన్‌లో స్పాంజ్‌ ఆధారిత షాక్ అబ్జార్పన్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తు కిందపడిన సమయంలో ఈ బయోమిమిటిక్‌ లేయర్‌ 90 శాతం నష్టం జరగకుండా కాపాడుతుంది. ఎక్కువ ఎత్తు నుంచి పడినా కూడా స్మార్ట్‌ఫోన్‌ అంతర్గత భాగాలు డ్యామేజీ కాకుండా ప్రొటెక్షన్‌ ఇస్తుంది. దీంతోపాటు ముందువైపు క్రిస్టల్‌ షీల్డ్‌ గ్లాస్‌ను ఉపయోగించారు. ఫలితంగా సాధారణ పదార్ధాల కంటే 160 శాతం మెరుగైన ప్రొటెక్షన్‌ను అందిస్తుంది.

సాధారణ వినియోగంలోనూ కాలిబాటల వంటి ప్రాంతాలపై జారిపడినప్పుడు.. ఎటువంటి డ్యామేజీ కాలేదు. మరియు స్క్రాచ్‌ మరియు పరితీరులోనూ ఎటువంటి మార్పులు రాలేదు. దీంతోపాటు IP65 రేటింగ్‌తో కూడిన డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. తేలికపాటి వర్షాల సమయంలోను రక్షణ కల్పిస్తుంది.

ఈ ఫోన్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ మరియు SGS గోల్డ్‌ డ్రాప్‌ సర్టిఫికేషన్‌ సపోర్టుతో బడ్జెట్ 5G ఫోన్‌ల సెగ్మెంట్‌లో అత్యంత ధృడమైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా యాంటీ డ్రాప్‌ షీల్డ్‌ కేస్‌ను కలిగి ఉంది. సాధారణంగా బడ్జెట్ ఫోన్‌లో ట్రాన్స్‌పరెంట్‌ సిలికాన్‌ కవర్‌ కంటే మెరుగైన రక్షణ కల్పిస్తుంది.

OPPO K13x 5G

OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్‌ గ్రానైట్‌ ఫ్లోర్‌ పైన సుమారు 1.1 మీటర్‌ నుంచి 1.3 మీటర్‌ ఎత్తు నుంచి జారిపడినా ఎటువంటి డ్యామేజీ కాదు. మరియు ఇతర ఫ్లోర్‌లపై 1.4 మీటర్ల నుంచి పడినా డ్యామేజీ కాదు. మరియు 1.2 మీటర్ల ఎత్తునుంచి 30-40 స్ర్రీన్‌ డ్యామేజీలను కూడా తట్టుకుంటుంది. OPPO ఫోన్ వాటర్, డస్ట్‌ రెసిస్టెన్స్‌ కోసం IP65 రేటింగ్‌ను కలిగి ఉంది. ఫలితంగా ప్రధానంగా డ్యామేజీ అయ్యే ప్రాంతాలను సురక్షితంగా మూసివేయడం వంటి అనేక చర్యలు తీసుకుంది.

ధృడమైన డిజైన్‌తోపాటు OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్‌ మిడ్‌నైట్‌ వైలెట్ మరియు సన్‌నెట్‌ పీచ్‌ ఫినిష్‌తో ఆకట్టుకుంటుంది. CNC ప్రీసిషన్, UV టెక్స్చర్‌ తో గ్లాస్‌ మ్యాటీ కాంట్రాస్ట్‌ను అందిస్తుంది. AF కోటింగ్ కెమెరా డిజైన్‌ కారణంగా నీటిని నిరోదిస్తుంది. ఈ ఫోన్‌ 7.9mm థిక్‌నెస్‌తో 194 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌, షాక్ అబ్జాప్షన్‌ వంటి ఫీచర్లతో OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్ బడ్జెట్‌ 5G సెగ్మెంట్‌లో ఎక్కువ రోజుల మన్నిక మరియు నాణ్యమైన బిల్ట్‌ క్వాలిటీ కలిగిన ఫోన్‌గా నిలిచింది.

పవర్‌ఫుల్‌ బ్యాటరీ
ధృడమైన, మన్నికైన డిజైన్‌తోపాటు OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్‌ 6000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫలితంగా రోజంగా సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 56.8 గంటల స్క్రీన్‌ ఆఫ్‌ కాలింగ్‌ లేదా 19.3 గంటల యూట్యూబ్‌ స్ట్రీమింగ్ లేదా 638 గంటల స్టాండ్‌బై టైంను అందిస్తుందని OPPO హామీ ఇస్తోంది. మేము రోజంగా అధికంగా వినియోగించినా రోజు గడిచే సరికి 87 శాతం బ్యాటరీ మాత్రమే వినియోగించబడింది. అంటే కనీసం రెండు గంటలపాటు సోషల్ మీడియా బ్రౌజింగ్‌, యూట్యూబ్‌ స్ట్రీమింగ్‌, గంట పాటు గేమింగ్‌ కోసం ఉపయోగించాము.

OPPO K13x 5G

45W SUPERVOOCTM ఫ్లాష్‌ ఛార్జ్‌ సపోర్టుతో 30 శాతం బ్యాటరీ ఛార్జింగ్ కోసం 21 నిమిషాల సమయం పట్టింది. అదే ఫుల్‌ ఛార్జింగ్‌ కోసం 91 నిమిషాల సమయం తీసుకుంది. OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్‌లోని ఫాస్ట్‌ ఛార్జింగ్ ఫీచర్‌ కారణంగా ఛార్జింగ్‌ అయిపోయాక కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తక్కువ సమయంలోనే ఛార్జింగ్ చేయవచ్చు.

ఎక్కువ మన్నిక వచ్చే OPPO ఫోన్.. ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను కూడా అందిస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ 1700 ఛార్జింగ్‌ సైకిల్స్ తర్వాత కూడా మొత్తం బ్యాటరీ సామర్థ్యంలో 80 శాతం కంటే మెరుగుదల నమోదవుతుంది. అంటే సుమారు 5 సంవత్సరాల వరకు మెరుగైన బ్యాటరీని అందిస్తుంది. OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ పనితీరులోనూ బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేసింది.

AI కెమెరా మేజిక్‌
కెమెరా విభాగం పరంగా OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్ 50MP AI డ్యూయల్‌ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో ఆటోఫోకస్‌ సామర్థ్యంతో 50MP OV50D ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతోపాటు f/2.0 అపేచర్‌తో 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

OPPO K13x 5G

అందుబాటు ధరతోపాటు కెమెరా అనుభూతి ఈ K13x 5G ఫోన్‌కు అదనపు ఆకర్షణగా ఉంటుంది. దీంతోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత Portrait మోడ్‌ను కలిగి ఉంది. దీంతో నేచురల్‌, సాఫ్ట్‌ బ్యాగ్రౌండ్‌లతో పోర్ట్రెయిట్లను సులభంగా క్యాప్చర్‌ చేయవచ్చు. సోషల్‌ మీడియా కోసం సులభంగా ఉపయోగించుకోవచ్చు. కొంచెం తక్కువ లైటింగ్ ఉన్న ప్రాంతాల్లోనూ సెల్ఫీ కెమెరా డైనమిక్‌ రేంజ్‌లో క్లియర్‌ సెల్ఫీలను క్యాప్చర్‌ చేస్తుంది.

OPPO K13x 5G

ఒప్పో AI Clarity Enhancer ఫీచర్‌ ద్వారా ఎటువంటి రాజీపడకుండా క్రాప్‌ చేసినా లేదా టెలిఫోటో ఫోటోలను మార్పులు చేసుకోవచ్చు. దీంతోపాటు Eraser 2.0 ఫీచర్‌.. ఫోటోల్లోని అవసరం లేని వాటిని తొలగిస్తుంది. మొత్తంగా OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్‌ ఫోటోగ్రఫీ అనుభూతిని మెరుగుపరుస్తుంది.

ఆకట్టుకొనే పనితీరు
OPPO K13 5G స్మార్ట్‌ఫోన్ 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4X ర్యామ్‌, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. సాధారణ గేమింగ్‌తోపాటు మల్టీ టాస్కింగ్ కోసం అత్యంత అనుకూలంగా ఉంటుంది. రోజువారీ పనులను సులభంగా నిర్వర్తించడంతోపాటు మరింత స్మూత్‌ మల్టీటాస్కింగ్‌ కోసం ర్యామ్‌ను 8GB వరకు అదనంగా పొడిగించుకొనేందుకు అవకాశం ఉంది.

OPPO K13x 5G

OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు సన్నని బెజెల్స్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను సపోర్టు చేస్తుంది. అవసరానికి అనుగుణంగా 60Hz, 90Hz, 120Hz రీఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా సూర్యకాంతిలోనూ సౌకర్యంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ఫోన్ స్ల్పాష్‌ టచ్‌ను కూడా కలిగి ఉంది. ఫలితంగా తడి చేతులతోనూ సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు. మరియు గ్లౌజ్‌ టచ్‌ ఫీచర్‌ను కూడా సపోర్టు చేస్తుంది. ఫలితంగా గ్లౌజ్‌లతో కూడా వినియోగించుకోవచ్చు.

ఎప్పుడైనా, ఎక్కడైనా మెరుగైన కనెక్టివిటీ
OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీలోనూ అడ్వాన్స్‌ ఫీచర్‌లతో బెంచ్‌మార్క్‌ను క్రియేట్‌ చేసింది. ఈ ఫోన్‌ డ్యూయల్‌ సిమ్‌ను సపోర్టు చేస్తుంది. Wi-Fi 5, బ్లూటూత్‌ 5.4 వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఆటోమేటిక్ హ్యాండ్స్‌ ఫ్రీ మోడ్‌తో కాలింగ్‌ సౌకర్యాన్ని పెంచుతుంది. దీంతోపాటు హెడ్‌ఫోన్‌లు తీసినప్పుడు స్పీక‌ర్‌ ఆటోమేటిక్‌గా మారుతుంది.

OPPO K13x 5G

ఈ ఫోన్ ప్రత్యేకమైన నెట్‌వర్క్‌ ఆప్టిమైజేషన్ బలమైన సిగ్నల్స్‌ మరియు డేటా స్పీడ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లోని అధునాతన అల్గారిథంలు మెరుగైన పనితీరును అందిస్తాయి. బహిరంగ ప్రాంతాల్లో ఉన్న సమయంలో 300 శాతం వాల్యుమ్‌ బూస్ట్‌, యాంప్లిఫైయింగ్‌ రింగ్‌టోన్‌, నోటిఫికేషన్ల నుంచి ప్రయోజనం పొందవచ్చు. OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్‌ నమ్మకమైన మరియ మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది.

యూజర్‌ అనుభూతిని మెరుగుపరుస్తుంది
సాఫ్ట్‌వేర్ పరంగా OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తుంది. మరియు మెరుగైన పనితీరును అందిస్తుంది. క్లీన్‌ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ గూగుల్‌ జెమినీ AI అసిస్టెంట్‌ ను కూడా కలిగి ఉంటుంది. మరియు అనేక భారతీయ భాషలకు సపోర్టు చేస్తుంది.

OPPO K13x 5G

OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్‌ ట్రినిటీ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. మెమొరీ మేనేజ్‌మెంట్, థర్మల్‌ కంట్రోల్‌ ను మెరుగుపరుస్తుంది. ఫలితంగా ఎక్కువ రోజులపాటు ఉపయోగానికి అనువుగా ఉంటుంది. మరియు ఈ ఫోన్‌ పనితీరు మరియు సామర్థ్యాన్ని సమతుల్యం చేస్తుంది. మరియు ప్రస్తుత రోజువారీ డిమాండ్లకు అనుగుణంగా స్థిరమైన అనుభవాన్ని అందిస్తుంది.

చివరిగా

OPPO K13x 5G

OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్‌లో బడ్జెట్‌ రేంజ్‌ యూజర్లు ఏం ఆశిస్తున్నారో అన్నీ ఉంటాయి. గత మోడల్స్ కంటే గణనీయమైన అప్‌గ్రేడ్‌ను తీసుకువస్తుంది. ముఖ్యంగా మన్నిక, బ్యాటరీ లైఫ్‌, AI వంటి ఫీచర్‌లు ఆకట్టుకుంటాయి. మరియు అందుబాటు ధరలోనే తీసుకువచ్చారు.

ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ బిల్ట్‌ క్వాలిటీ, అడ్వాన్స్‌డ్‌ షాక్ అబ్జాప్షన్‌, IP65 రేటింగ్‌తో మరియు క్రిస్టల్‌ షీల్డ్‌ గ్లాస్‌తో ధృడమైన హ్యాండ్‌సెట్‌గా నిలుస్తుంది. దీంతోపాటు డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. గేమింగ్‌తోపాటు రోజువారీ పనితీరులో మెరుగైన అనుభూతిని అందిస్తుంది.

ఒప్పో ColorOS 15 తోపాటు AI Clarity Enhancer, AI Eraser 2.0 వంటి AI టూల్స్‌తో మెరుగైన మరియు ఆకట్టుకొనే అనుభూతిని అందిస్తుంది. ఎక్కువ వినియోగించే యూజర్‌ అయినా.. కెమెరా విభాగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నా లేదా స్టైలిష్‌ ఫోన్‌ కోసం చూస్తున్నా.. OPPO K13x 5G మీకు సరైనదని అనిపిస్తుంది.

OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్ ధర, ఆఫర్ల వివరాలు
OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB/128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11999 గా ఉంది. అదే 8GB/128GB స్టోరేజీ మోడల్ రూ.12999 గా ఉంది. అదే 8GB/128GB వేరియంట్ ధర రూ.14999 గా ఉంటుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో 4GB, 6GB ర్యామ్ వేరియంట్స్‌పై రూ.10000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే 8GB ర్యామ్ వేరియంట్‌పై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు 3 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. OPPO K13x 5G స్మార్ట్‌ఫోన్‌ను OPPO e-Store మరియు Flipkart ద్వారా కొనుగోలు చేయవచ్చు.

OPPO K13x 5G

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO K13x 5G Overview New Gold standard For Durability and Reliability in the sub 15k segment
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X