రూ.15 వేల ధరలో కిందపడినా డ్యామేజీ కాని స్మార్ట్‌ఫోన్..! 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా మెరుగైన ఫీచర్‌లు
OPPO K13x 5G Smartphone : ఒప్పో నుంచి ఇటీవల ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ఏకంగా 7000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. మరియు అనేక మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది. అయితే త్వరలో ఈ సిరీస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఒప్పో K13x 5G పేరుతో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఈ లాంచ్ వివరాలతోపాటు స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల సమాచారం కూడా వెల్లడయింది. ఈ ఫోన్ పొరపాటున కిందపడినా డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశం ఉంటుంది.
ఎప్పుడు విడుదల కానుంది ?
ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో జూన్ 23 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. విడుదల అనంతరం ఈ ఫోన్ ఒప్పో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ రూ.15 వేల కంటే తక్కువ ధరలో లాంచ్ కానుంది.

డ్యామేజీ ప్రూఫ్ :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్ AM04 గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తోపాటు 360 డిగ్రీల డ్యామేజీ ప్రూఫ్ ఆర్మర్ బాడీని కలిగి ఉంటుంది. మరియు మిలిటరీ గ్రేడ్ MIL - STD H షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంటుంది.
దీంతోపాటు ఈ ఫోన్ SGS గోల్డ్ డ్రాప్ రెసిస్టెన్స్ మరియు SGS మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంటాయి. ఈ ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను సపోర్టును పొందుతుంది.

ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్ 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 4GB ర్యామ్, 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా ఈ ఒప్పో బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో AI ఆధారిత 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. మిగిలిన కెమెరాల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఫోన్ AI Clarity Enhancer, AI Reflection Remover, AI Unblur, AI Eraser వంటి ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.
Your wait for the toughest 5G phone under ₹15K* ends soon. The #OPPOK13x launches on June 23. Ready? #LiveUnstoppable
— OPPO India (@OPPOIndia) June 16, 2025
know more : https://t.co/wBBLexyvSQ pic.twitter.com/SaKbBU7O0d
ఈ ఫోన్ గూగుల్ జెమిని, AI Summery, AI Recorder, AI Studio వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సపోర్టు చేస్తుంది. మరియు ఈ డిస్‌ప్లే స్ల్పాష్, గ్లౌజ్ టచ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది. అంటే తడి చేతులు మరియు గ్లౌజ్‌తోనూ ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ సన్‌సెట్ పీచ్, మిడ్‌నైట్ వైలెట్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications