Home
Mobile

Oppo కొత్త స్మార్ట్‌ఫోన్‌ కీలక వివరాలు లీక్‌.. ఈ ఫోన్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా వస్తోందా...?

ఒప్పో నుంచి K13 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో ఇటీవల విడుదల అయింది. బడ్జెట్‌ రేంజ్‌లో ఏకంగా 7000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు మరిన్ని బెస్ట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. అయితే Oppo K13x 5G స్మార్ట్‌ఫోన్‌ త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్‌ ఒప్పో A5 5G రీబ్రాండెడ్ వెర్షన్‌గా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

ఒప్పో A5 5G స్మార్ట్‌ఫోన్ ఇటీవలే గ్లోబల్‌ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ ఫోన్ మోడల్‌ నంబర్‌ CPH2735 గా ఉంది. అయితే ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్ (OPPO K13x 5G Smartphone) ఇటీవలే గూగుల్‌ ప్లే కన్సోల్‌ మరియు గూగుల్‌ ప్లే సపోర్ట్‌ డేటాబేస్‌ లో CPH2753 మోడల్‌ నంబర్‌తో కనిపించింది.

OPPO K13x 5G Smartphone

చిప్‌సెట్‌ వివరాలు! :
ఒప్పో A5 5G స్మార్ట్‌ఫోన్‌ తరహాలోనే ఒప్పో K13x 5G ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు ఉంటాయని తెలుస్తోంది. గూగుల్‌ ప్లే కన్సోల్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 4GB ర్యామ్‌ ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉండే అవకాశం ఉంది.

కెమెరా వివరాలు :
దీంతోపాటు ఒప్పో K13x 5G హ్యాండ్‌సెట్‌ HD+ రిజల్యూషన్‌ కలిగిన డిస్‌ప్లేతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఒప్పో A5 5G ఫోన్‌కు రీబ్రాండెడ్‌ గా లాంచ్‌ కానుందని భావిస్తున్న నేపథ్యంలో.. ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

భారీ బ్యాటరీ:
ఒప్పో K13x 5G హ్యాండ్‌సెట్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా ఈ ఫోన్‌ రూ.13000 ధర రేంజ్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఫలితంగా బడ్జెజ్‌ రేంజ్‌ యూజర్లను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

Take a Poll

* ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్‌ ఫ్లాట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే వెట్‌ హ్యాండ్‌ టచ్‌, గ్లౌజ్‌ మోడ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ 80W Supervooc ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. 56 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయవచ్చని సంస్థ చెబుతోంది.

ఈ ఫోన్‌ స్నా్ప్‌డ్రాగన్ 6 జెన్‌ 4 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ColorOS 15 తో పనిచేస్తోంది. ప్రత్యేక వేపర్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.19,999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO K13x 5G Smartphone listed on google play console, here are the specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X