Home
Mobile

6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో OPPO 5G ఫోన్‌..!

OPPO K13x 5G Smartphone Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో నుంచి భారత్ మార్కెట్‌లోకి ఇవాళ మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్‌ పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ. 50MP ప్రైమరీ కెమెరా సహా అనేక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌ మిలిటరీ గ్రేడ్‌ రెసిస్టెంట్‌గా ఉంది. డిజైన్ పరంగానూ ఈ ఫోన్‌ ఆకట్టుకుంటుంది.

ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే తో అందుబాటులోకి వచ్చింది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 89.9 శాతం స్క్రీన్‌ టూ బాడీ రేషియోను కలిగి ఉంది.

OPPO K13x 5G Smartphone launch news in telugu

ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ ను పొందుతుంది. స్ల్పాష్‌ టచ్‌, గ్లౌజ్‌ టచ్‌ టెక్నాలజీని సపోర్టు చేస్తుంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌, Sponge Absorption సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ ఒప్పో ఫోన్‌ 6nm ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

OPPO K13x 5G Smartphone launch news in telugu

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం f/2.0 అపేచర్‌తో 8MP కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ డ్యూయల్ వ్యూ వీడియో రికార్డింగ్‌ ను సపోర్టు చేస్తుంది.

AI ఫీచర్లు :
ఈ ఫోన్ గూగుల్‌ జెమిని, AI Summary, AI Recorder, AI Studio వంటి ఆప్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. మరియు AI Unblur, AI Reflection, AI Reimage వంటి AI ఆధారిత ఇమేజింగ్‌ ఫీచర్‌లను కలిగి ఉంది.

6000mAh బ్యాటరీ :
ఈ ఫోన్‌ 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ సన్‌సెట్‌ పీచ్‌, మిడ్‌నైట్‌ వైలెట్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Take a Poll

ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15999 గా ఉంది. అదే 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.18999 గా ఉంది. జూన్‌ 27 నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో ఇండియా అధికారిక వైబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు

Best Mobiles in India

English summary
OPPO K13x 5G Smartphone with 6000mAh battery, 50MP Camera launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X