రూ.12 వేల ధరలో మంచి ఫోన్ కోసం చూస్తున్నారా.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో..!
ఒప్పో ఈ సంవత్సరం భారత్ మార్కెట్ లో అనేక మోడల్స్ ను లాంచ్ చేసింది. అయితే బడ్జెట్ ధరలోనూ వివిధ స్మార్ట్‌ఫోన్ లను తీసుకొచ్చింది. రూ.12 వేల ధర రేంజ్ లో ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 360 డిగ్రీల ఆర్మర్ బాడీ ప్రొటెక్షన్ వంటి ప్రత్యేక ఫీచర్ లను కలిగి ఉంది. ఫలితంగా ఫోన్ పొరపాటున కిందపడినా డ్యామేజీ కాకుండా ఉంటుంది. దీంతోపాటు స్పెసిఫికేషన్ ల పరంగానూ ఆకట్టుకుంటుంది. ఒప్పో స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు.
రూ.1000 డిస్కౌంట్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్ ( OPPO K13x 5G Smartphone ) 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్ ను పొందవచ్చు.

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ను కలిగి ఉంది. దీంతోపాటు 360 డిగ్రీల ఆర్మర్ బాడీ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ Sponge Absorption తరహాలో పనిచేస్తుంది. అంటే ఏదైనా సందర్భంలో ఫోన్ కిందపడితే, ఈ ప్రత్యేక ఫీచర్ ఫోన్ అంతర్గత విభాగాలు డ్యామేజీ కాకుండా రక్షణ ఇస్తాయి.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్ అల్ట్రా బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే గ్లౌజ్ టచ్, స్ల్పాష్ టచ్ ఫీచర్ లను సపోర్టు చేస్తుంది.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
50MP కెమెరా, 6000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, 2MP కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ మిడ్‌నైట్ వైలెట్, సన్‌సెట్ పీచ్, బ్రీజ్ కలర్ వేరియంట్స్ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








