రూ.11999 కే కిందపడినా డ్యామేజీ కాని 5G స్మార్ట్‌ఫోన్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో ఈ సంవత్సరం అనేక మోడల్స్ ను భారత్ లో లాంచ్ చేసింది. ఒప్పో K13 సిరీస్ సహా అనేక మోడల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. బడ్జెట్ ధరలో ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్ ను (OPPO K13x 5G Smartphone) ఈ సంవత్సరం జున్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days 2025) భాగంగా డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
రూ.11999 కే 5G స్మార్ట్‌ఫోన్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఒప్పో ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంది. ICICI, యాక్సెస్ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

కిందపడినా డ్యామేజీ కానీ స్మార్ట్‌ఫోన్ :
ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్ అనేక సూపర్ ఫీచర్‌లను కలిగి ఉంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, ఆర్మర్ బాడీని కలిగి ఉంది. మరియు Sponge Absorption సిస్టమ్ ను కూడా కలిగి ఉంది. పొరపాటున కిందపడినా ఫోన్ డ్యామేజీ కాకుండా, ముఖ్యంగా ఫోన్ లోని అంతర్గత విభాగాలు డ్యామేజీ కాకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో ఇదో ప్రత్యేకత.
గ్లౌజ్ టచ్ ఫీచర్‌తో :
ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ను పొందుతోంది. దీంతోపాటు స్ల్పాష్ టచ్, గ్లౌజ్ టచ్ ఫీచర్‌లను కూడా కలిగి ఉంది. అంటే తడి, గ్లౌజ్ వేసుకున్న చేతులతోనూ ఈ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
50MP కెమెరా, AI ఫీచర్లు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ గూగుల్ జెమిని, ఏఐ రికార్డర్, ఏఐ స్టూడియో, AI Summary, ఏఐ అన్‌బ్లర్, AI Reflection వంటి అనేక ఫీచర్‌లు ఉన్నాయి.
6000mAh బ్యాటరీ :
ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ సన్‌సెట్ పీచ్, మిడ్‌నైట్ వైలెట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.


Click it and Unblock the Notifications








