OPPO నుంచి 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, కిందపడినా డ్యామేజీ కాని 5G స్మార్ట్‌ఫోన్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో భారత్ మార్కెట్ లో ఇటీవల K14x 5G ఫోన్ ను లాంచ్ చేసింది. సేల్ కూడా ప్రారంభం అయింది. తాజాగా K సిరీస్ నుంచి ఒప్పో K14 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. 50MP కెమెరా, 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, మెరుగైన వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. తొలిసేల్ లో భాగంగా డిస్కౌంట్‌లను కూడా అందిస్తామని తెలిపింది.
ఒప్పో K14 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్ ( OPPO K14 5G Smartphone Launch ) 6.75 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1125 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్, SGS 5 స్టార్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.

కిందపడినా డ్యామేజీ కాని ఫోన్! :
ఈ ఫోన్ 1.22 మీటర్ల నుంచి కిందపడినా డ్యామేజీ కాదని ఒప్పో చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్ IP66 + IP68 + IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ను కలిగి ఉంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS పైన పనిచేస్తుంది. కూలింగ్ సిస్టమ్ ను కూడా కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP AI కెమెరా, 2MP కెమెరాలు ఉన్నాయి. వీటితోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చి ఉంది. డ్యూయల్ వ్యూ వీడియో, AI Recompose, AI Perfect Shot, AI Eraser 2.0, AI Clarity Enhancer ఫీచర్లు ఉన్నాయి.

7000mAh బ్యాటరీ :
ఒప్పో K14 5G స్మార్ట్‌ఫోన్ 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఛార్జర్‌ను ఉపయోగించి కేవలం 30 నిమిషాల్లో 1-37 శాతం ఛార్జింగ్, 92 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ చేయవచ్చని ఒప్పో తెలిపింది.
ఒప్పో K14 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
ఈ ఫోన్ ( OPPO K14 5G Sale ) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999, 6GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.19999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21999 గా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 20 వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఒప్పో ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. SBI, HDFC, ICICI బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ ఫోన్ ప్రిజం వైట్, ప్రిజం వైలెట్, ఐస్ బ్లూ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








