ఇవాళ్టి నుంచే OPPO ఫోన్ సేల్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP కెమెరా, 7000mAh బ్యాటరీ..!
OPPO K14 5G Sale : ఒప్పో సంస్థ భారత్‌లో ఇటీవల వరుసగా A సిరీస్ ఫోన్‌లను తీసుకొచ్చింది. దీంతోపాటు ఒప్పో K14 5G స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. తొలి సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి.
ఇవాళ్టి నుంచే సేల్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఒప్పో ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999, 6GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.19999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.21999 గా ఉంది.

డిస్కౌంట్, IP రేటింగ్ :
ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 20 వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. SBI, HDFC, ICICI బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ ప్రిజం వైట్, ప్రిజం వైలెట్, ఐసూ బ్లూ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఒప్పో ఫోన్ IP66 + IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఒప్పో K14 5G స్మార్ట్‌ఫోన్ SGS 5 స్టార్, మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. అనేక డ్రాప్ టెస్ట్‌లు నిర్వహించామని, 1.22 మీటర్ల నుంచి కిందపడినా డ్యామేజీ కాదని ఒప్పో చెబుతోంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.75 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 1125 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ఉంటుంది.
మీడియాటెక్ చిప్ :
ఒప్పో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS పైన పనిచేస్తుంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం కూలింగ్ సిస్టమ్ ఉంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని తెలుస్తోంది. అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కలిగి ఉంది.
7000mAh భారీ బ్యాటరీ :
ఈ ఒప్పో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 30 నిమిషాల్లో 1-37 శాతం ఛార్జింగ్ చేయవచ్చు. అదే 92 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయవచ్చని ఒప్పో చెబుతోంది.
50MP కెమెరా :
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 50MP AI కెమెరా, 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరా ఉంది. AI Perfect Shot, AI Eraser 2.0, డ్యూయల్ వ్యూ, AI Recompose, AI Clarity Enhancer ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








