Home
Mobile

7000mAh బ్యాటరీ, డ్యూయల్ కెమెరాలతో OPPO స్మార్ట్‌ఫో‌న్‌.. కీలక వివరాలు వెల్లడి..!

భారత్‌ మార్కెట్‌లో OPPO సంస్థ ఇటీవల అనేక మోడల్స్‌ను లాంచ్‌ చేసింది. జనవరి నెలలో ఒప్పో రెనో 15 సిరీస్‌తోపాటు A6 ప్రో 5G, A6 5G ఫోన్లు విడుదల అయ్యాయి. అనంతరం ఫిబ్రవరిలో ఒప్పో K14x ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్లు బడ్జెట్‌, మిడ్‌ రేంజ్‌ ధర సెగ్మెంట్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. అయితే త్వరలో మరో హ్యాండ్‌సెట్‌ను విడుదల చేయనుంది.

ఎప్పుడు విడుదల కానుంది :
భారత్ మార్కెట్‌లో ఒప్పో K సిరీస్‌ నుంచి ఒ‌ప్పో K14 5G స్మార్ట్‌ఫోన్‌ (OPPO K14 5G Smartphone) విడుదల కానుంది. గత సంవత్సరం లాంచ్‌ అయిన K13 మోడల్‌కు తర్వాత తరం వెర్షన్‌ గా అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ మార్చి 9 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది.

OPPO k14 5G smartphone

రెండు కలర్‌ వేరియంట్స్‌లో :
ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన మైక్రోసైట్‌ ఇప్పటికే ప్రారంభం అయింది. దీని ద్వారా డిజైన్‌ సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి. వైట్‌, వైలెట్‌ కలర్‌ వేరియంట్స్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి వస్తుంది.

7000mAh బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అయితే గత సంవత్సరం వచ్చిన K13 5G ఫోన్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉండడం గమనార్హం. ఈ హ్యాండ్‌సెట్ ColorOS పైన పనిచేస్తుంది. దీంతోపాటు బ్యాక్‌ ప్యానల్‌ డిజైన్‌ విడుదల అయింది.

డ్యూయల్‌ కెమెరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. అయితే కెమెరాల వివరాలు వెల్లడి కాలేదు. దీంతోపాటు LED ఫ్లాష్‌ లైట్‌ను కలిగి ఉంటుంది. అయితే టిప్‌స్టర్‌ డిబయన్‌ రాయ్‌ ఈ ఒప్పో K14 5G స్మార్ట్‌ఫోన్‌ కీలక వివరాలను వెల్లడించారు.

ఈ వివరాల ఆధారంగా ఒప్పో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 4 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ రూ.20 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలో ఈ హ్యాండ్‌సెట్ గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

గత నెలలో ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఐసీ బ్లూ, ప్రిజమ్‌ వైలెట్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది.

ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్‌ 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తోంది. 50MP అల్ట్రా క్లియర్‌ ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమో లెన్స్‌, 5MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO k14 5G smartphone with 7000mAh Battery launch dare revealed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X