Home
Mobile

OPPO K14x 5G : రూ.15000 ధర సెగ్మెంట్‌లో పనితీరు, స్మూత్‌ అనుభవానికి కొత్త ప్రమాణం

రూ.15000 ధర సెగ్మెంట్‌ స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో యూజర్లు అనేక విదాలుగా రాజీ పడతారు. కొన్ని ఫోన్‌లు మెరుగైన పనితీరు కనబరిస్తే, బ్యాటరీ పరంగా రాజీపడతాయి. కొన్ని ఫోన్లు భారీ బ్యాటరీలతో అందుబాటులోకి వస్తే, స్మూత్‌ పనితీరుకు దూరంగా ఉంటాయి. లేదా కొన్ని సంవత్సరాల వరకే సక్రమమైన పనితీరును కనబరుస్తాయి. మల్టీ టాస్కింగ్‌, మెరుగైన గేమింగ్‌ పనితీరు, యాప్‌లు మారుతున్నప్పుడు స్థిరత్వం, బహిరంగ ప్రాంతాల్లో సౌకర్యవంతమైన వినియోగం, నెట్‌వర్క్ హెచ్చుతగ్గులు ఇలా అన్ని ఫీచర్లు కలిగిన సరసమైన స్మార్ట్‌ఫోన్‌లు కాలక్రమేణా తగ్గుతున్నాయి.

OPPO K14x 5G స్మార్ట్‌ఫోన్‌ ఈ అంతరాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాటరీ పవర్‌, పనితీరు, స్మూత్‌నెస్ అనేక మూడు లక్ష్యాలతో ఈ డిజైన్‌ను రూపొందించారు. ఫలితంగా ఎక్కడా రాజీలేకుండా పనితీరు కనబరుస్తుంది. ఈ ఫోన్‌ 6500mAh బ్యాటరీ, మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, ColorOS 15 పైన మెరుగైన ఆప్టిమైజేషన్‌ను కలిగి ఉంటుంది. ఎక్కువ రోజులపాటు మెరుగైన పనితీరును అందించే విధంగా ఈ ఫోన్‌ను రూపొందించారు.

oppo k14x 5g overview a new standard for performance smoothness in 15000 segment

రియల్‌లైఫ్‌ను అనుకూలంగా ఉండే బ్యాటరీ
సాధారణంగా రూ.15 వేల ధర విభాగంలో బ్యాటరీ సామర్థ్యమే అతిపెద్ద సమస్య. నేవిగేషన్, సోషల్ మీడియా, కాల్స్, మ్యూజిక్‌, స్ట్రీమింగ్‌ సహా గేమింగ్‌ వంటివి బ్యాటరీ ఛార్జింగ్‌ను త్వరగా ఖాళీ చేస్తాయి. సుదూర ప్రయాణాలు, ఛార్జింగ్‌ చేసేందుకు సౌకర్యాలు లేకపోయిన సందర్భాల్లో బ్యాటరీ ప్రాధాన్యత అర్థం అవుతుంది.

OPPO K14x 5G స్మార్ట్‌ఫోన్‌ 6500mAh బ్యాటరీతో ఈ సమస్యను పరిష్కరిస్తుంది. వీడియో స్ట్రీమింగ్‌, నేవిగేషన్‌, గేమింగ్‌ సమయాల్లో మీరు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూస్తుంది. మీరు ఎంత ఎక్కువగా వినియోగించినా, కనీసం ఈ స్మార్ట్‌ఫోన్‌ ఒక రోజంతా ఛార్జింగ్‌ అందిస్తుంది.

ఛార్జింగ్ సపోర్టు విషయానికి వస్తే.. ఈ ఫోన్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది. కేవలం 20 నిమిషాల్లోనే 30 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్‌ వేగంతోపాటు ఎక్కువ సమయం బ్యాటరీ లైఫ్‌ వచ్చేలా డిజైన్ చేశారు. బ్యాటరీ హెల్త్‌ పైనా జాగ్రత్తలు తీసుకున్నారు. బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్‌ వేగం, బ్యాటరీ లైఫ్‌ల కలయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను విశ్వసనీయమైన డిజైన్‌గా మారుస్తుంది.

ప్రతిరోజు ఫోన్‌ పనితీరును ఆస్వాదిస్తారు
చాలా మంది బెంచ్‌మార్క్‌ స్కోర్‌ ఆధారంగా ఫోన్‌ మంచిదా కాదా అనేది నిర్ణయిస్తారు. ఈ ఫోన్‌ను చూస్తే.. బెంచ్‌ మార్క్‌ స్కోర్‌ ద్వారా స్మూత్‌నెస్‌ను డిసైడ్‌ చేయలేము. రియల్‌టైం వినియోగం ఆధారంగానే దీనిపై నిర్ణయం తీసుకోగలుగుతాము. ఒక సాధారణ రోజులో వీడియో కాల్‌కు హాజరు కావడం, చెల్లింపులు కోసం UPI యాప్‌ వినియోగం, మెసేజ్‌లకు స్పందించడం, సోషల్‌ మీడియాలో స్క్రోలింగ్‌, కెమెరా వినియోగం వంటివి ఉంటాయి. ఈ ధర సెగ్మెంట్‌లో ఇన్ని విభాగాలను మేనేజ్‌ చేయడం కొన్నిసార్లు కుదరకపోవచ్చు. కానీ ఒప్పో మాత్రం ఎక్కడా యూజర్లను నిరుత్సాహపరచదు.

యూజర్ల అవసరాలు అన్ని సున్నితంగా, స్థిరంగా నిర్వహించేందుకు వీలుగా OPPO K14x 5G ను రూపొందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేసే ColorOS 15.0.02 పైన పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రతిక్షణం ఆస్వాదిస్తారు. యానిమేషన్‌లు స్మూత్‌గా, యాప్‌లు సులభంగా లాంచ్‌ అవుతాయి. ఫ్రేమ్‌ డ్రాప్స్‌ లేకుండా ఉంటాయి. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. స్కోలింగ్‌, నావిగేషన్‌ సమయంలో సున్నితంగా పనిచేస్తుంది.

oppo k14x 5g overview a new standard for performance smoothness in 15000 segment

OPPO సిస్టమ్‌ స్థాయిలో ఆప్టిమైజేషన్‌ కూడా బలోపేతం అవుతుంది. లూమినస్‌ రెండరింగ్‌ ఇంజిన్‌ విజువల్‌ ట్రాన్సిషన్ సజావుగా జరిగేలా చూస్తుంది. ట్రినిటీ ఇంజిన్‌ మల్టీ టాస్కింగ్ సమయాల్లో ఫోన్‌ పనితీరు స్థిరంగా ఉండేలా బ్యాగ్రౌండ్‌ సోర్స్‌లను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. వేగవంతమైన స్టోరేజీ కారణంగా లోడింగ్‌ సమయం తగ్గుతుంది. వన్‌ క్లిక్‌ రీఫ్రెష్‌ వంటి ఫీచర్లు అవసరమైన సమయాల్లో ప్రతిస్పందనను పునరుద్దరించడంలో సాయపడతాయి. 48 నెలల ప్ల్యూయెన్సీ ప్రొటెక్షన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ మృదువైన పనితీరును కనబరుస్తుంది.

కాలక్రమేణా నిలిచి ఉండే పనితీరు
ఈ ధర సెగ్మెంట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌ను వినియోగిస్తున్నాయి. అయితే దీని సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా ప్రొసెసర్‌ను మెరుగ్గా ట్యూన్‌ చేసింది.

BGMI, మొబైల్‌ లెజెండ్స్‌ : బ్యాంగ్‌ బ్యాంగ్‌ వంటి గేమ్స్‌ను టెస్టింగ్ చేసే సమయాల్లో OPPO K14x 5G స్మార్ట్‌ఫోన్ గుర్తించేంత స్థాయిలో ఫ్రేమ్‌ డ్రాప్స్‌, ఓవర్‌ హీటింగ్‌, క్రాష్‌లు లేకుండా సున్నితమైన పనితీరును అందించింది. బ్రౌజింగ్, యూట్యూ్బ్‌ స్ట్రీమింగ్‌, స్ల్పిట్‌ స్క్రీన్‌ మోడ్‌, మెసేజింగ్‌ యాప్‌ల మధ్య సజావుగా మారడం, ఎక్కడా స్లోడౌన్ లేకుండా క్యాజువల్‌ గేమ్‌లను అమలు చేయడం ద్వారా మల్టీటాస్కింగ్‌ పనితీరు సమర్థవంతంగా ఉంది.

oppo k14x 5g overview a new standard for performance smoothness in 15000 segment

AI గేమ్‌బూస్ట్ 2.0 ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. OPPO ఈ ప్రత్యేకమైన టెక్నాలజీని ఉపయోగించి CPU వనరులను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. క్లౌడ్‌ ఆధారిత థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ను వినియోగించి, ఫ్రేమ్‌ రేట్‌ను స్థిరంగా ఉంచడం, గేమింగ్‌ సమయాల్లో బ్యాటరీ లైప్‌ ఆకట్టుకుంటుంది.

న్యూఫాస్ట్ ఇంజిన్‌ అధిక వేడి పరిస్థితుల్లో కూడా గేమింగ్‌ పనితీరు తగ్గకుండా ఉండేలా కచ్చితమైన ఎనర్జీ మోడలింగ్‌, మెరుగైన టాస్క్‌ ప్లేస్‌మెంట్‌ సౌకర్యాన్ని అందిస్తుంది. దీంతోపాటు అధునాతన వాటర్ సిగ్నల్‌ ఫిల్టరింగ్‌ టెక్నాలజీ వల్ల చెమట కారణంగా వచ్చే టచ్‌ సమస్యలు గణనీయంగా తగ్గుతాయి. టచ్ కచ్చితత్వం 94 శాతం వరకు పెరుగుతుంది. అలానే ఈ ఫోన్‌ను 60 నెలల వరకు సాఫీగా వినియోగించుకోవచ్చని OPPO చెబుతోంది.

మన్నిక ఇచ్చే డిజైన్, స్మూత్‌ డిస్‌ప్లే పనితీరు
OPPP K14x 5G స్మార్ట్‌ఫోన్ రోజువారీ అనుకూలంగా సౌకర్యంగా ఉండేలా రూపొందించారు. IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. అంటే చిన్నపాటి వర్షం, దుమ్ము లేదా ప్రమాదవశాత్తు కిందపడినా డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశం ఉంటుంది. మెరుగైన టచ్‌ ఆప్టిమైజేషన్‌ కారణంగా చేతులు కొంచెం తడి లేదా జిడ్డుగా ఉన్నా మెరుగైన టచ్‌ రెస్పాన్స్‌ను అందిస్తుంది. వేడెక్కుతున్న సమయాల్లోనూ పనితీరు స్థిరంగానే ఉంటుంది.

అయితే ఈ ఫోన్ భారీ బ్యాటరీతో లాంచ్ అయినా కేవలం 8.61mm థిక్‌నెస్‌ను మాత్రమే కలిగి ఉంది. మెటాలిక్‌ ఫ్రేమ్‌, ప్రీమియం డెకో కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఫింగర్‌ ప్రింట్‌ రెసిస్టెన్స్‌ లెన్స్‌ కోటింగ్‌ రోజవారీ ఆచరణాత్మకంగా ఉంటుంది. ఈ ఫోన్‌ ఐసీ బ్లూ, ప్రిజం వైలెట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

oppo k14x 5g overview a new standard for performance smoothness in 15000 segment

ఈ ఫోన్ 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్ స్మూత్‌నెస్‌ అనుభూతిని మెరుగుపరుస్తుంది. ఫ్యూయిడ్‌గా అనిపించే స్క్రోలింగ్‌, యానిమేషన్‌ సజావుగా అనిపిస్తాయి. 1125 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ కారణంగా సూర్యకాంతిలోనూ విజువల్‌గా పరంగా సౌకర్యవంతంగా ఉంటుంది.

AI సపోర్టు కలిగిన ఫోటోగ్రఫీ
OPPO K14x 5G స్మార్ట్‌ఫోన్ 50MP AI ప్రైమరీ కెమెరా రోజువారీ వినియోగంలో అనుకూలంగా ఉంటుంది. ఇన్‌డోర్‌, అవుట్‌డోర్‌లో ఫోటోలు షార్ప్‌, బ్యాలెన్స్‌గా అనిపిస్తాయి. 2MP డెప్త్‌ సెన్సర్‌ సపోర్టుతో పొర్ట్రెయిట్‌ మోడ్‌, బ్యాగ్రౌండ్‌ బ్లర్‌ అత్యంత సహజంగా అనిపిస్తుంది. ఎడ్జ్‌ డిటెక్షన్‌ కూడా ఎఫెక్టివ్‌గా ఉంటుంది.

oppo k14x 5g overview a new standard for performance smoothness in 15000 segment

ఏఐ ఫీచర్లు ఈ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. AI Portrait Retouching ముఖంలోని చిన్నలోపాలను సున్నితంగా సవరిస్తాయి. అయితే సహజమైన టెక్స్చర్‌ను అలానే ఉంచుతాయి. దీంతో ఫోటోలు సహజంగా కనిపిస్తాయి. దీంతోపాటు AI Recompose ఫ్రేమింగ్‌ను తెలివిగా మెరుగుపరుస్తుంది. సడెన్‌గా క్యాప్చర్‌ చేసే ఫోటోల్లో సబ్జెక్ట్‌ సరిగ్గా లేకపోయినా ఫ్రేమ్‌ను సరిచేసి మంచి లుక్‌ను ఇస్తుంది. అదే AI Perfect Shot ఫీచర్‌ డివైజ్‌లోనే పనిచేసే AI టెక్నాలజీతో ముఖంలో భావాలు, లైటింగ్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది. ఫలితంగా గ్రూప్‌ ఫోటోలు, కాండిడ్‌ షాట్‌లు మరింత ఆకర్షణీయంగా వస్తాయి.
ఈ అన్ని ఫీచర్లు యూజర్లకు సౌలభ్యంతోపాటు సృజనాత్మకను అందిస్తాయి. ఫలితంగా కెమెరాలు రోజువారీ వినియోగానికి అనుకూలంగా, వాస్తవ పరిస్థితుల్లో మరింత తెలివిగా, పరిస్థితులను అనుగుణంగా పనిచేస్తుంది.

OPPO K14x 5G Vs దేశంలోని టాప్‌ రూ.15 వేల ధరలోని ఫోన్లు
OPPO K14x 5G.. మోటోరోలా, వివో, శాంసంగ్‌ వంటి బలమైన ప్రత్యామ్నాయాలతో పోటీపడుతోంది.

మోటో G45 తో పోలిస్తే మన్నిక, మెరుగైన బ్యాటరీ లైఫ్‌, ఫాస్ట్ ఛార్జింగ్‌, సాఫ్ట్‌వేర్‌ ఆప్టిమైజేషన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. పనితీరు విషయంలో రెండు మోడల్స్‌ కొంత వరకు దగ్గరగా అనిపించినా, OPPO ఫోన్‌ ఆప్టిమైజేషన్‌తో కూడిన గేమింగ్, మల్టీ టాస్కింగ్‌ చేసే వారి కోసం K14x 5G ఫోన్ కొంత ముందంజలో ఉంటుంది.

వివో T4 లైట్‌ మంచి బిల్డ్‌ క్వాలిటీతో వస్తుంది. అయితే తక్కువ బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్‌ వేగం తక్కువగా ఉండడం వంటి అంశాల్లో కొంచెం వెనుకబడి ఉంది. అదే OPPO ఫోన్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్, మెరుగైన సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందిస్తుంది. ప్రాక్టికల్‌ కెమెరా అనుభూతిని ఇస్తుంది. ఇవి K14x 5G ఫోన్‌కు అదనపు సపోర్టును ఇస్తాయి.

శాంసంగ్‌ గెలాక్సీ F70e సాఫ్ట్‌వేర్‌ పరంగా మెరుగైన సపోర్టును అందిస్తున్నా.. OPPO K14x 5G స్మార్ట్‌ఫోన్‌ అధిక బ్యాటరీ సామర్థ్యం, వేగవంతమైన ఛార్జింగ్‌, సమతుల్యమైన ప్యాకేజీతో ముందంజలో నిలుస్తుంది. ఈ సెగ్మెంట్‌లో మొత్తం మీద అన్ని అంశాలను సమంగా అందించే ఫోన్‌లో OPPO ఫోన్‌ మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.

ఫోన్‌ ఉన్నంత వరకు సపోర్టు ఉంటుంది
స్మార్‌ఫోన్‌పై ఉండే నమ్మకం.. దాని సపోర్టు సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో OPPO దేశవ్యాప్తంగా విస్తృతమైన ఆఫ్టర్‌ సేల్స్‌ నెట్‌వర్క్‌తో యూజర్లలో నమ్మకాన్ని పెంచుతుంది. 600 పైగా సర్వీస్‌ సెంటర్లను కలిగి ఉంది. సెలవు రోజుల్లోనూ కస్టమర్‌ కేర్‌ అందుబాటులో ఉంటుంది. మరమ్మతులు సహా ఇతర సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ పై వాట్సాప్ ద్వారా సపోర్టు వంటివి ఉన్నాయి. చిన్న సమస్య అయినా, టెక్నికల్‌గా సమస్యలున్నా యూజర్లకు తక్షణ సాయం అందేలా చూస్తుంది.

oppo k14x 5g overview a new standard for performance smoothness in 15000 segment

OPPO 30 రోజుల ఉచిత రీప్లేస్‌మెంట్ పాలసీని అందిస్తోంది. తయారీ లోపాలు లేదా నాణ్యతా సమస్యలు ఉంటే, ప్రమాదవశాత్తు జరిగిన డ్యామేజీ కాకపోతే 30 రోజుల్లో ఉచితంగా మార్చుకోవచ్చు. స్మూత్‌ పనితీరు, బలమైన హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌ కలిగి వస్తాయి. దీంతోపాటు ఈ ఫోన్‌ కొనుగోలు చేసే వినియోగదారులకు టెన్షన్‌ లేకుండా కొనుగోలు చేయగలరని నిర్ధారిస్తుంది. డివైస్‌ మాత్రమే కాకుండా, దాని వెనుక ఉన్న సపోర్టు సిస్టమ్‌ పైన నమ్మకంతో వినియోగించుకోవచ్చు.

OPPO K14x 5G సరసమైన ప్యాకేజీనా?
OPPO K14x 5G స్మార్ట్‌ఫోన్‌ కేవలం స్పెసిఫికేషన్లపైనా ఆధారపడదు. మొత్తం అనుభూతిని మెరుగుపరుస్తుంది. రూ.15 వేల కంటే తక్కువ ధరలో ఇతర మోడల్స్‌ తో పోలిస్తే అర్థవంతమైన తేడాను గురించవచ్చు.

మల్టీ టాస్కింగ్‌, స్థిరమైన గేమింగ్‌, మెరుగైన బ్యాటరీ లైఫ్‌, IP64 డ్యూరబిలిటీ, అవుట్‌డోర్‌ రెడీ బ్రైట్‌నెస్‌, ప్రాక్టికల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కెమెరాలు సహా బిల్డ్‌ క్వాలిటీతో ఇలా అన్ని అంశాల్లో ఈ ఫోన్‌ మెరుగ్గా ఉంటుంది.

oppo k14x 5g overview a new standard for performance smoothness in 15000 segment

ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16999 గా ఉంది. లాంచ్‌ ఆఫర్లతో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.13499, రూ.15499 కే కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే ప్రీ బుకింగ్‌ ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 16 వ తేదీ నుంచి OPPO India e-store, Flipkart లో కొనుగోలు చేయవచ్చు. ప్రిజమ్‌ వైలెట్‌, ఐసీ బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

OPPO K14x 5G స్మార్ట్‌ఫోన్‌ బ్యాలెన్స్, ఫినిష్‌, దీర్ఘకాల నమ్మకంతో ప్యాకేజీగా ఉంటుంది. రూ.15 వేల సెగ్మెంట్‌లో స్మూత్‌, దీర్ఘకాల పనితీరు, బలమైన బ్యాటరీ బ్యాకప్‌ వంటి అంశాలను కోరుకొనే వారికి ఈ ఫోన్ ఓ మంచి ఎంపిక అవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
oppo k14x 5g overview a new standard for performance smoothness in 15000 segment
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X