బడ్జెట్ ధరలో 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మీడియాటెక్ చిప్‌తో 5G స్మార్ట్‌ఫోన్..!
OPPO K14x 5G Smartphone : ఒప్పో సంస్థ గత నెలలో ఒప్పో రెనో 15 స్మార్ట్‌ఫోన్ సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా 15C ఫోన్ మినహా మిగిలిన ఫోన్‌ల సేల్ ప్రారంభం అయింది. ఇటీవలే ఈ ఫోన్ ను ముందస్తు బుకింగ్ చేసుకొనే అవకాశం కల్పించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో ప్రీ ఆర్డర్ చేయవచ్చు. అయితే తాజాగా ఒప్పో కీలక ప్రకటన చేసింది. త్వరలో భారత్ మార్కెట్ లో మరో హ్యాండ్‌సెట్ ను లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. X ప్లాట్‌ఫాం ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ఎప్పుడు విడుదల కానుంది :
ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో ఫిబ్రవరి 10 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. దీంతోపాటు అనేక స్పెసిఫికేషన్ లు, ఫీచర్ ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ ఇతర K సిరీస్ మోడల్స్ తరహాలోనే ఉంది.

డ్యూయల్ కెమెరా :
ఈ ఫోన్ ఫ్లాట్ సైడ్స్, ఫ్లాట్ బ్యాక్ ప్యానల్, పిల్ ఆకారంలో కెమెరా మాడ్యూల్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో కెమెరా ఉంటుంది. దీంతోపాటు LED ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. అయితే సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది.
HD+ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ :
ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 1125 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ను కలిగి ఉంటుంది. ColorOS 15 పైన పనిచేస్తుంది. అయితే ఈ ఫోన్ ఎన్ని సంవత్సరాల OS అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.
6500mAh బ్యాటరీ :
ఒప్పో స్మార్ట్‌ఫోన్ 45W ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేసి 17.6 గంటల యూట్యూబ్ వీడియో ప్లే బ్యాక్ లేదా 16.1 గంటల గూగుల్ మ్యాప్ నేవిగేషన్ లేదా 12.1 గంటల వాట్సాప్ వీడియో కాల్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని చెబుతోంది.
The wait is over. The new OPPO K14x 5G is launching on 10th Feb, 12PM.
— OPPO India (@OPPOIndia) February 2, 2026
Built with a 6500mAh battery and 45W fast charging to match your pace.
Get More Power, Less Lag & non-stop performance for non-stop days.
Know more: https://t.co/HlLogYPxEV#OPPOK14x #MorePowerLessLag pic.twitter.com/CeynH6xDah
ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను సపోర్టు చేస్తుంది. ఇందులో సీన్ డిటెక్షన్, పొర్ట్రెయిట్ ట్యూనింగ్, Low Light Enhancement వంటి అనేక ఫీచర్లు ఉంటాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్ అంచనా ధర వివరాలు :
ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో రూ.15000 ధర సెగ్మెంట్ లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications






