6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, HD+ డిస్‌ప్లే 5G ఫోన్ సేల్.. రూ.1500 డిస్కౌంట్!
OPPO K14x 5G Smartphone Sale : ఒప్పో సంస్థ భారత్ మార్కెట్ లో ఇటీవల ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను అందిస్తోంది.
ప్రారంభ ధర రూ.14999 :
ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999 గా ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఒప్పో ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు.

రూ.1500 డిస్కౌంట్ :
ఈ ఫోన్ తొలి సేల్‌లో భాగంగా SBI, HDFC, ICICI బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1500 డిస్కౌంట్ ను పొందవచ్చు. దీంతోపాటు మూడు నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఫోన్ ఐసీ బ్లూ, ప్రిజమ్ వైలెట్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
ఆండ్రాయిడ్ 15 OS :
ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 6GB LPDDR4X ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ARM Mali G57 GPU ను అమర్చి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తోంది.

HD+ డిస్‌ప్లే, AI ఫీచర్లు :
ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 1125 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 256 PPI పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది. AI గేమ్‌బూస్ట్ 2.0 తో పాటు ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కలిగి ఉంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 50MP అల్ట్రా క్లియర్ ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమో లెన్స్ ఉన్నాయి. దీంతోపాటు ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాలు 60fps వద్ద 1080p వీడియో రికార్డింగ్ ను సపోర్టు చేస్తాయి.
6500mAh బ్యాటరీ, IP64 రేటింగ్ :
ఒప్పో K14x 5G ఫోన్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్. USB-C ఛార్జింగ్ పోర్టు ఉన్నాయి. దీంతోపాటు యాంబియంట్ లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, ఇ-కంపాస్, యాక్సెలిరోమీటర్‌లు ఉన్నాయి. IP64 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.


Click it and Unblock the Notifications








