Home
Mobile

బడ్జెట్ ధరలో 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, HD+ డిస్‌ప్లేతో OPPO 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల..!

OPPO K14x 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ ఒప్పో భారత్ మార్కెట్‌ లో ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్‌ ను విడుదల చేసింది. K14 సిరీస్‌ లో తొలి హ్యాండ్‌సెట్‌ గా లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6500mAh బ్యాటరీ, మీడియాటెక్ చిప్‌సెట్, HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 50MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఒప్పో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ ఒప్పో హ్యాండ్‌సెట్ 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌, 1125 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 256 PPI పిక్సల్‌ డెన్సిటీ, 16.7 మిలియన్‌ కలర్స్‌ ను సపోర్టు చేస్తుంది.

OPPO K14x 5G smartphone features

మీడియాటెక్‌ చిప్‌సెట్ :
ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ 6GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ARM Mali G57 GPU ను కూడా అమర్చారు. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Color OS 15 పైన పనిచేస్తుంది.

50MP అల్ట్రా క్లియర్‌ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 50MP అల్ట్రా క్లియర్‌ ప్రైమరీ, 2MP మోనోక్రోమ్‌ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 5MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలతో 60fps వద్ద 1080p రిజల్యూషన్‌ తో వీడియోలను రికార్డు చేయవచ్చు.

OPPO K14x 5G smartphone features

6500mAh భారీ బ్యాటరీ :
ఈ ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్లను కలిగి ఉంది. దీంతోపాటు AI గేమ్‌బూస్ట్‌ 2.0 కూడా ఉంది. 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

ఒప్పో స్మార్ట్‌ఫోన్ 5G, 4G, వైపై, బ్లూటూత్‌, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ప్రాక్సిమిటీ సెన్సర్‌, యాంబియంట్ లైట్ సెన్సర్‌, ఇ-కంపాస్‌, యాక్సెలిరోమీటర్ వంటి సెన్సర్‌లతోపాటు సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది.

OPPO K14x 5G smartphone features

ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.16999 గా ఉంది. ఈ ఫోన్ సేల్‌ (OPPO K14x 5G Sale) ఫిబ్రవరి 16 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఒప్పో ఆన్‌లైన్ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. SBI, ICICI, HDFC బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1500 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రిజమ్‌ వైలెట్‌, ఐసీ బ్లూ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO K14x 5G smartphone with 6500mAh battery, mediatek dimensity 6300 chip launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X