Oppo నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, రెడ్‌మికి పోటీగా నిలబడతాయా?

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo), కొత్త సిరీస్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ సిరీస్ నుంచి లాంచ్ అయ్యే మొదటి ఫోన్ Oppo K1 పేరుతో అందుబాటులో ఉంటుందని సమాచారం.

|

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo), కొత్త సిరీస్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ సిరీస్ నుంచి లాంచ్ అయ్యే మొదటి ఫోన్ Oppo K1 పేరుతో అందుబాటులో ఉంటుందని సమాచారం. అక్టోబర్ 10వ తేదీన మార్కెట్లో లాంచ్ కాబోతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి పలు స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి.

తాజా రూమర్స్ ప్రకారం....

తాజా రూమర్స్ ప్రకారం....

తాజా రూమర్స్ ప్రకారం ఒప్పోకు సంబంధించిన PBCM10, PBCT10, PBCM30 స్మార్ట్‌ఫోన్‌లను చైనాకు చెందిన TENAA సర్టిఫికేషన్ అథారిటీ సర్టిఫై చేసినట్లు వార్తలొస్తున్నాయి. అనధికారికంగా తెలియవచ్చిన సమాచారం ప్రకారం..

ఒప్పో  కే1 ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో...

ఒప్పో కే1 ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో...

ఒప్పో కే1 ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో రాబోతోంది. డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి ఈ డివైస్‌లో 6.4 అంగుళాల భారీ అమోల్డ్ డిస్‌ప్లే (2340 x 1080 పిక్సల్స్)ను ఒప్పో నిక్షిప్తం చేసిందట. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన్ మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని సమచారం.

 

 

మొదటి వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో....
 

మొదటి వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో....

అందులో మొదటి వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ అందుబాటులో ఉంటాయట. ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి ఫోన్ వెనుకా, ముందూ భాగంలో 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్‌తో పాటు 25 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచినట్లు తెలుస్తోంది.

3,500 ఎమ్ఏహెచ్ బ్యాటిరీని ఈ డివైస్‌లో....

3,500 ఎమ్ఏహెచ్ బ్యాటిరీని ఈ డివైస్‌లో....

3,500 ఎమ్ఏహెచ్ బ్యాటిరీని ఈ డివైస్‌లో లోడ్ చేసినట్లు తెలుస్తోంది. బ్లుటూత్, 4జీ, వై-ఫై, జీపీఎస్, ఏ-జీపీఎస్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను ఈ ఫోన్‌లో లోడ్ చేసినట్లు సమాచారం. బ్లు, రెడ్ ఇంకా సిల్వర్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Oppo to Launch New K-Series Phone with In-Display FingerPrint Sensor on October 10.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X