Home
Mobile

64MP టెలిఫోటో కెమెరాలతో Oppo రెనో 10 సీరిస్‌ స్మార్ట్‌ఫోన్లు విడుదల

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో కొత్త సీరిస్‌ ఫోన్లను భారత్‌లో లాంచ్ చేసింది. ఒప్పో రెనో ఫోన్లు వివిధ వేరియంట్లు, వేర్వేరు ధరల్లో విడుదల చేసింది. ఈ ఫోన్లు టెలిఫోటో కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉన్నాయి. ఒప్పో రెనో ఫోన్లు సహా ఎన్‌కో ఎయిర్‌ 3 ప్రో ఇయర్‌బడ్స్‌ను కూడా విడుదల చేసింది.

ఒప్పో రెనో 10 సీరిస్‌ ఫోన్లలో రెనో 10, రెనో 10 ప్రో, రెనో 10 ప్రో+ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఒప్పో రెనో 10 సీరిస్‌ ఫోన్లు స్లిమ్‌ ఫ్రొఫైల్‌, కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. మరియు పంచ్‌ హోల్‌ డిజైన్‌తో రానున్నాయి. మరియు ఈ ఫోన్లు ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు వెనుక వైపు టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటాయి.

Oppo Launched reno 10 series smartphones

దీంతోపాటు ఒప్పో రెనో హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ రెనో 10 ప్రో+... 3x ఆప్టికల్‌ జూమ్‌తోపాటు పెరిస్కాప్‌ లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో మెరుగైన ఫోటోలను తీసుకొనే అవకాశం కలగనుంది. రెనో ప్రో+ స్మార్ట్‌ఫోన్‌ 0.96ఎంఎం పెరిస్కోప్‌ మాడ్యుల్‌ సహా స్లిమ్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

రెనో 10 ప్రో, రెనో 10 ప్రో+ రెండు ఫోన్లు కూడా ఒకేతరహా వెనుక కెమెరాలను కలిగి ఉంటాయి. ఈ ఫోన్లు 64MP టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఫోన్లలో ఇదే అత్యధికమైన కెమెరా అని ఒప్పో చెబుతోంది. ఈ కెమెరాలు.. 3X ఆప్టికల్‌ జూమ్‌, OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలిటీ) మరియు 120x హైబ్రిడ్‌ జూమ్‌ను కలిగి ఉంటాయి.

ఈ టెలీఫోటో కెమెరాతో పాటు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో తక్కువ కాంతిలోనూ నాణ్యమైన ఫోటోలను తీసుకోవచ్చు. వీటితో పాటు మరో 112 డిగ్రీల ఫీల్డ్‌వ్యూతోపాటు 8MP ఆల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా కలిగి ఉంటుంది. ఒప్పో రెనో 10 ప్రో + స్మార్ట్‌ఫోన్‌లో 4k నాణ్యత కలిగిన వీడియోల కోసం కెమెరా ఆల్గారిథమ్‌ను ఉపయోగించింది. ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను అందించింది.

ఈ కెమెరా వైడ్‌ సెన్సార్‌తోపాటు 90 డిగ్రీల ఫీల్డ్‌వ్యూ బ్రార్డర్‌ సెల్పీలు తీసుకోవచ్చు. ఒప్పో రెనో 10 స్టాండర్డ్‌ వేరియంట్‌ వెనుకవైపు 32MP టెలీఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఫోన్లతో స్టాండర్డ్‌ వేరియంట్‌కు 32MP టెలిఫోటో కెమెరాతో రావడం తొలిసారని ఒప్పో తెలిపింది.

ఒప్పో రెనో 10 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8+ జెన్‌ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. అదే స్టాండర్డ్‌ వేరియంట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌తో వస్తుంది. అదే రెనో 10 ప్రో క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 778G SoCతో వస్తుంది.

ఒప్పో రెనో 10 ప్రో ఫోన్‌ 4600mAh మరియు రెనో 10 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌ 4700mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రెండు ఫోన్లు 100W ఫ్లాష్‌ ఛార్జ్‌ను సపోర్టు చేస్తాయి. అయితే రెనో 10 ప్రో మాత్రం 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది మరియు 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో వస్తుంది.

ఒప్పో రెనో 10 ప్రో 6GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ రూ.39,999 అందుబాటులో ఉంది. ఒప్పో రెనో 10 స్టాండర్డ్‌ మోడల్‌ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధరను జులై 20 ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా వెల్లడించనుంది. అలానే ఒప్పో రెనో హైఎండ్‌ మోడల్‌ రెనో 10 ప్రో+ ధర రూ.54999 అందుబాటులో ఉంది. ఈ ఫోన్లు జులై 13 నుంచి ఫ్లిప్‌కార్టు ద్వారా విక్రయాలు జరగనున్నాయి.

Oppo Launched reno 10 series smartphones

ఒప్పో రెనో 10 సీరిస్‌ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఎన్‌కో ఎయిర్ 3 ప్రో ఇయర్‌బడ్స్‌ను కూడా విడుదల అయింది. ఈ ఇయర్‌బడ్స్‌ యాక్టివ్‌ నాయిస్‌ ‌క్యాన్సిలేషన్‌ (ANC) టెక్నాలజీ సహా వెదురు డయాఫ్రాంను కలిగి ఉన్నాయి. మరియు నాణ్యమైన ఆడియో అనుభూతిని పొందుతారు.

ఎయిర్ 3 ప్రో ఇయర్‌బడ్స్‌ 49db వరకు నాయిస్‌ క్యాన్సిలేషన్‌ డెప్త్‌ను పొందుతారు. ఇయర్‌బడ్స్‌ టచ్‌ కంట్రోల్‌ సౌకర్యం కూడా ఉంటాయి. ఎన్‌కో ఎయిర్ 3 ప్రో ఎయిర్‌బడ్స్‌ గ్రీన్ కలర్‌ మోడల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎన్‌కో ఎయిర్‌ 3 ప్రో ధర రూ.4999గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo Launched reno 10 series smartphones and enco air 3 pro earbuds in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X