ఓపో జాయ్@రూ.8,990

Posted By:

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఓపో, ‘జాయ్' ( Joy) పేరుతో సరికొత్త బడ్జెట్ ప్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో ఈ డ్యుయల్ సిమ్ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ ధర రూ.8,990.

 ఓపో జాయ్@రూ.8,990

ఈ చైనా స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 4.2 నేపథ్యంతో కూడిన కలర్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 480x800పిక్సల్ రిసల్యూషన్‌తో కూడిన 4 అంగుళాల WVGA డిస్‌ప్లేను  ఫోన్‌లో అమర్చారు. 1.3గిగాహెట్జ్ డ్యుయల్ ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. 512ఎంబి ర్యామ్ సామర్థ్యం. ఫోటోలను చిత్రీకరించుకునేందుకు ఫోన్ వెనుక భాగంలో 3 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను అమర్చారు.

అలానే ఫోన్ ముందుభాగంలో వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు 0.3 మెగా పిక్సల్ వీజీఏ కెమెరాను ఏర్పాటు చేసారు. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకోవచ్చు. 1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ పై ఫోన్ రన్ అవుతుంది. వై-ఫై, 3జీ, బ్లూటూత్ ఇంకా జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఏర్పాటు

చేసారు. ఓపో క్లౌడ్ స్టోరేజ్ సర్వీసు ద్వారా 5జీబి క్లౌడ్ స్టోరేజ్‌ను పొందే అవకాశం. ఫోటో ఆల్బమ్ క్లౌడ్ స్టోరేజ్, బ్యాకప్ ఆఫ్ కాంటాక్ట్స్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot