కొత్త ఫోన్ లాంచ్ తో దిగ్గజాలకు షాక్ ఇచ్చిన రియల్‌‌మి

చైనా మొబైల్‌ మేకర్‌ ఒప్పోకు చెందిన రియల్‌‌మి 3 భారత మార్కెట్లో లాంచ్‌ అయింది.

|

చైనా మొబైల్‌ మేకర్‌ ఒప్పోకు చెందిన రియల్‌‌మి 3 భారత మార్కెట్లో లాంచ్‌ అయింది. గతంలో వచ్చిన రియల్‌‌మి 2 డివైస్‌ భారీ విక్రయాలను నమోదు చేయగా దీనికి సక్సెసర్‌గా రియల్‌‌మి3ను రెండు వేరియంట్లలో కంపెనీ తాజాగా లాంచ్‌ చేసింది. రియల్‌మి 2కు మరిన్ని అధునాతన ఫీచర్లను జోడించి రియల్‌మి 3ను తీసుకొచ్చింది. నాచ్‌ డిస్‌ప్లే‌తో పాటు, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను ఈ ఫోన్‌ కలిగి ఉంది. అందరూ ఊహించినట్టుగానే బడ్జెట్‌ ధరలోనే దీన్ని విడుదల చేసింది.ఇదే ఫోన్‌కు చెందిన ప్రొ వేరియెంట్‌ను ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌నున్నారు.

 

మీ ఆధార్ కార్డు పోయిందా.. ఇప్పుడు డూప్లికేట్ ఆధార్ కార్డు పొందటం చాలా సులువుమీ ఆధార్ కార్డు పోయిందా.. ఇప్పుడు డూప్లికేట్ ఆధార్ కార్డు పొందటం చాలా సులువు

ఫీచ‌ర్లు

ఫీచ‌ర్లు

6.2 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

ధర

ధర

బేసిక్‌ మోడల్‌ 3జిబి ర్యామ్ ఫోన్‌ను రూ. 8,999 ధరలో కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే 4జీబీ, 64 జీబీ స్టోరేజి వేరియంట్‌ ధర రూ.10,999గా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌ తో పాటు రియ‌ల్ మి ఆన్‌లైన్ స్టోర్‌లోప్రత్యకంగా లభించనుంది.

ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్‌క్లూజివ్‌గా
 

ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్‌క్లూజివ్‌గా

ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్‌ను విడుదల చేశారు. మార్చ్ 12న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో తొలి సేల్‌ను నిర్వహించనున్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికి

ఈ ఫోన్‌పై కొన్ని ఆఫర్లను కూడా ప్రకటించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికి రూ. 500 డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు.

Best Mobiles in India

English summary
Oppo launches Realme 3 with MediaTek Helio P70 processor, 4230mAh battery.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X