ఓపో ఎన్1 మినీ@రూ.26,900
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఓపో (Oppo) ఎట్టకేలకు తన ‘ఎన్1 మినీ'(N1 mini) స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది. ఫోన్ ధర రూ.26,990. అన్ని ప్రధాన స్టోర్‌ల వద్ద ఫోన్ లభ్యమవుతోంది. 13 మెగా పిక్సల్ రొటేటింగ్ కెమెరా ఫీచర్ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ కెమెరా ద్వారా 24 మెగా పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన ఫోటోలను చిత్రీకరించుకోవచ్చు. ఈ ఫోన్ కోసం ‘ఓ-క్లిక్ రిమోట్ కంట్రోల్' అనే ఉపకరణాన్ని ఓపో ఆఫర్ చేస్తోంది. ఈ ఉపకరణం ద్వారా ఎన్1 మినీ స్మార్ట్‌ఫోన్‌లోని కెమరా ఫీచర్‌ను రిమోట్ వ్యవస్థ ద్వారా నియంత్రించుకోవచ్చు. ఓ-క్లిక్ రిమోట్ కంట్రోల్ ధర రూ.1890.

ఓపో ఎన్1 మినీ కీలక స్పెసిఫికేషన్‌లు:
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపకల్పన చేయబడిన కలర్ 1.4 ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ అవుతుంది,
13 మెగా పిక్సల్ రొటేటింగ్ కెమెరా (రొటేటింగ్ స్వభావం కలిగిన ఈ కెమెరాను ఫోన్ ఫ్రంట్ కెమెరాలా ఉపయోగించుకోవచ్చు),
16జీబి ఇంటర్నల్ మెమరీ,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, బ్లూటూత్, వై-ఫై),
2140 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ బరువు 151 గ్రాములు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








