డిస్కౌంట్ ధరల పై ఓపో ఎన్1, ఆర్1 స్మార్ట్‌ఫోన్‌లు

|

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఓపో ఇండియన్ మార్కెట్లో ఓపో బ్రాండ్ పేరిట స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీ నుంచి తొలిసారిగా భారత్‌లో విడుదలైన స్మార్ట్‌ఫోన్ ఓపో ఎన్1 ఫ్రంట్ ఇంకా బ్యాక్ రోటేటింగ్ కెమెరా ఫీచర్‌ను కలిగి మార్కెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తరువాత ఓపో ఆర్1 పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను ఓపో కంపెనీ ఇండియన్ మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చంది.

 
 డిస్కౌంట్ ధరల పై ఓపో ఎన్1, ఆర్1 స్మార్ట్‌ఫోన్‌లు

తాజాగా, ఓపో మొబైల్స్ ఇండియా.. ఓపో ఎన్1, ఓపో ఆర్1 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు ప్రకటించింది. విడుదల సమయంలో ఓపో ఎన్1 స్మార్ట్‌ఫోన్ ధర రూ.37,990 కాగా ప్రస్తుత డిస్కౌంట్ ఆఫర్‌లో భాగంగా రూ.32,990కే కంపెనీ ఆఫర్ చేస్తోంది. అలాగే రూ.26,990 ధర ట్యాగ్‌ను కలిగి ఉన్న ఓపో ఆర్1 ఫోన్‌ను ఇప్పుడు కంపెనీ రూ.24,990కే విక్రయిస్తోంది.

ఓపో ఎన్1 కీలక స్పెసిఫికేషన్‌‍లు:

5.9 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, 377 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 1.7గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 600 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 320 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆధారంగా స్పందించే ఓపో సొంత ఆపరేటింగ్ సిస్టం, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ సెన్సార్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, 3610ఎమ్ఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ.

ఓపో ఆర్1 కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌‍ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (మీడియాటెక్), 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2410ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), వై-ఫై, 3జీ, ఏ-జీపీఎస్ కనెక్టువిటీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X