Home
Mobile

అదిరిపోయే ఫీచర్లతో ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన Oppo R15 Pro

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో ఇండియాలో ఈ ఏడాది తన తొలి స్మార్ట్‌ఫోన్ Oppo R15 Proని లాంచ్ చేసింది. కాస్మిక్ పర్ఫుల్,రూబీ రెడ్ వేరియంట్లలో వచ్చిన ఈఫోన్ లో ప్రధాన ఆకర్షణ సెల్ఫీనే.

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో ఇండియాలో ఈ ఏడాది తన తొలి స్మార్ట్‌ఫోన్ Oppo R15 Proని లాంచ్ చేసింది. కాస్మిక్ పర్ఫుల్,రూబీ రెడ్ వేరియంట్లలో వచ్చిన ఈఫోన్ లో ప్రధాన ఆకర్షణ సెల్ఫీనే. 20 ఎంపీ సెల్ఫీతో పాటు ఆర్టిఫీషియల్ టెక్నాలజీతో దూసుకువచ్చింది. లో లైట్ కండిషన్లో కూడా ఫొటోలను అద్భుతంగా తీయగల కెమెరా ఈ డివైఎస్‌ ప్రత్యేకతగా కంపెనీ చెప్పింది. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌తో పాటు అడ్వాన్స్‌డ్ అల్గారిథమ్స్, ఇంటెలిజెంట్ బ్యూటికేషన్ మోడ్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్టు లాంచింగ్‌ సందర్భంగా కంపెనీ వెల్లడంచింది.

ధర..

ధర..

ఈ ఫోన్ రూ.25,990 ధ‌ర‌తో వినియోగ‌దారుల‌కు అమెజాన్‌లో ప్ర‌త్యేకంగా లభిస్తుంది.

6.28 ఇంచుల  భారీ డిస్‌ప్లే.....

6.28 ఇంచుల భారీ డిస్‌ప్లే.....

6.28 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. ఈ డిస్‌ప్లే పై భాగంలో ఐఫోన్ X తరహాలో నాచ్‌ను అమర్చారు. ఇక ఫోన్ ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు.అలాగే వెనుక భాగంలో 16 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న కెమెరాను అమర్చారు.

6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్...

6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్...

6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్ ఈ ఫోన్‌లో లభిస్తుంది. ఫోన్‌లో మెమొరీ కార్డుతోపాటు రెండు సిమ్ కార్డుల కోసం ప్రత్యేకంగా వేర్వేరుగా స్లాట్లు ఇచ్చారు. రెండు సిమ్ కార్డులు కూడా వీవోఎల్‌టీఈని సపోర్ట్ చేస్తాయి.

ఫీచ‌ర్లు...

ఫీచ‌ర్లు...

6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే, 2280 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 16, 20 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ, వూక్ ఫ్లాష్ చార్జింగ్‌.

Best Mobiles in India

English summary
Oppo R15 Pro with VOOC Flash Charge launched in India: Price, specifications.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X