హైలెట్ ఫీచర్లతో చైనా మార్కెట్లో విడుదలైన Oppo R15x

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో సైలెంట్ గా ఓ కొత్త ఫోన్ ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. Oppo R15x పేరుతో ఫోన్ ను లాంచ్ చేసింది.

|

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో సైలెంట్ గా ఓ కొత్త ఫోన్ ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. Oppo R15x పేరుతో ఫోన్ ను లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ ఈ మధ్య కాలం లో విడుదల అయిన Oppo K1 కి రెప్లికా.భారీ స్క్రీన్‌, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది అలాగే ఈ ఫోన్ యొక్క ముందుభాగంలో వాటర్ డ్రాప్స్ పడుతున్నట్లుగా కనిపించేలా ఫోన్ స్క్రీన్ ని డిజైన్ చేశారు.ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ ను ఒకసారి పరిశీలిస్తే..

జియో కి పోటీగా కాంబో ప్యాక్‌లు విడుదల చేసిన ఎయిర్టెల్జియో కి పోటీగా కాంబో ప్యాక్‌లు విడుదల చేసిన ఎయిర్టెల్

ధర...

ధర...

చైనా లో ఈ ఫోన్ ధర సుమారు రూ.26,400 గా ఉంది. ఈ Oppo R15x నవంబర్ 1 నుంచి Nebula మరియు Ice Blue కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది.

Oppo R15x స్పెసిఫికేషన్స్..

Oppo R15x స్పెసిఫికేషన్స్..

6.4 అంగుళాల భారీ అమోల్డ్ డిస్‌ప్లే (2340x1080 పిక్సల్స్) , కర్వుడ్ బాడీతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు కార్నింగి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ రెండు వైపులా కవర్ అయి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన్ రన్ అవుతుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి క్వాల్కమ్ మొబైల్ చిప్‌సెట్‌లలో ఒకటైన స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ పై ఫోన్ రన్ అవుతుంది. ఈ ఫోన్ 6జీబి ర్యామ్ కెపాసిటీతో లభ్యముతోంది.

 ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో...

ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో...

Oppo R15x ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో మార్కెట్లోకి విడుదల అయింది . డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి ఈ డివైస్‌లో 6.4 అంగుళాల భారీ అమోల్డ్ డిస్‌ప్లే (2340 x 1080 పిక్సల్స్)ను ఒప్పో నిక్షిప్తం చేసింది.

స్టోరేజ్, కెమెరా, బ్యాటరీ...

స్టోరేజ్, కెమెరా, బ్యాటరీ...

ఇక స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి 128జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో Oppo R15x లభ్యమవుతుంది. ఇక కెమెరా సెగ్మెంట్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్‌లో 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 25 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఒప్పో నిక్షిప్తం చేసింది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసిరికి ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లో 3730ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఒప్పో ఏర్పాటు చేసింది. కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్‌లో 4జీ VoLTE, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను ఒప్పో పొందుపరిచింది.

Best Mobiles in India

English summary
Oppo R15x With In-Display Fingerprint Sensor, Dual Rear Cameras Launched.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X