8జీబీ ర్యామ్,25మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాతో లాంచ్ కానున్న ఒప్పో R17
చైనా మొబైల్ తయారీ దిగ్గజం ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ R17 ను మరో మూడు రోజుల్లో చైనా మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఒప్పో R17 ధరను కంపెనీ ప్రకటించింది.
చైనా మొబైల్ తయారీ దిగ్గజం ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ R17 ను మరో మూడు రోజుల్లో చైనా మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఒప్పో R17 ధరను కంపెనీ ప్రకటించింది. Twilight Blue మరియు Starry Purple కలర్స్ లో అందుబాటులో ఉండే ఈ ఒప్పో R17 స్మార్ట్ ఫోన్ ధరను రూ.35,600 గా కంపెనీ నిర్ణయించింది.ఈ నెల 31 నుంచి ఒప్పో అధికారిక వెబ్సైట్ ద్వారా చైనా మార్కెట్ లో అమ్మకాలు మొదలవబోతున్నాయి. కాగా ఈ ఫోన్ భారత్ కి ఎప్పుడు వస్తుందనేది కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ అతి త్వరలోనే ఈ ఫోన్ ఇండియాలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ధర :
Twilight Blue మరియు Starry Purple కలర్స్ లో అందుబాటులో ఉండే ఒప్పో R17 స్మార్ట్ ఫోన్ ధరను రూ.35,600 గా కంపెనీ నిర్ణయించింది.

డిస్‌ప్లే :
6.4 ఇంచ్ డిస్‌ప్లేతో పాటు 1080p screen ఈ ఫోన్ కి ప్రత్యేక ఆకర్షణ. 2280x1,080 pixelsతో యూజర్లకు మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 యొక్క coating తో రాబోయే మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఒప్పో R17 అవబోతుంది.

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ :
అలాగే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా ఇది మంచి పనితీరును కనపరుస్తోంది.octa-core Qualcomm Snapdragon 670 processor తో ఈఫోన్ రాబోతుంది. ఇది వేగవంతమైన పనితీరును అందిచబోతుంది .ఈ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ తో లభ్యమవుతోంది. FM radio, Bluetooth 4.2, Wi-Fi, 4G with VoLTE, USB Type-C . అదనపు ఆకర్షణలు.

కెమెరా :
రెండు రకాల డ్యూయెల్ కెమెరాలతో ఈ ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ కాబోతుంది .బ్యాక్ కెమెరా విషయానికొస్తే 16,5మెగాపిక్సల్ కెమెరాలతో వినియోగదారులు మంచి ఫోటోలు తీసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు.సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 25మెగాపిక్సల్ తో మంచి క్వాలిటీ గల సెల్ఫీ ఫోటోలు తీసుకునేలా కల్పించారు.అలాగే Scene Detection ,3D Portrait, వంటి పవర్ ఫుల్ AI ఫీచర్స్ ఇందులో కలిపించారు.

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ :
ఈ ఒప్పో R17 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే 3500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ను కలిగి ఉంటుంది.

ఒప్పో R17 ఫీచర్స్ :
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, octa-core Qualcomm Snapdragon 670 processor, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ , 16,5 మెగాపిక్సల్ రియర్ కెమెరా , 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 8.1 Oreo , 4జీ వీవోఎల్‌టీఈ , బ్లూటూత్ 4.2,3500 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








